బ్రేకింగ్ న్యూస్ – జర్నలిస్టు కు కరోనా పాజిటివ్

0

భోపాల్ లో ఓ పత్రికా విలేకరిగా పనిచేస్తున్న జర్నలిస్టుకు కరోనా సోకింది. ఇది అతనికి తన కూతురి ద్వారా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ తన చివరి ప్రెస్ మీట్లో ఈ కరోనా సోకిన జర్నలిస్టు కూడా పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ రోజు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో పాల్గొన్న మిగతా విలేకరులు అందర్నీ కూడా క్వారంటైన్ లో కి పంపించడం జరిగింది. ఇలా భోపాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 కు చేరింది.

ఇక భారతదేశంలో నిన్నటివరకు 519 కేసులు నమోదు కాగా 11 మంది చనిపోవడం జరిగింది. భారతదేశంలో కూడా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజులపాటు పాటించాలని అందరికీ విన్నవించుకున్నాడు. ఇది చాలా ఎక్కువ సమయం అని, తనకు కూడా తెలుసునని అయినప్పటికీ కూడా మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనల్ని మనం ఇంటిలో నిర్బంధించుకోవడం తప్పనిసరి పరిస్థితి అని అందరికీ వివరించాడు.
మన తెలుగు వారి కోసం తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్ వారు అనుక్షణం కరోనా బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకువస్తున్నారు.