రిపబ్లిక్ డే వ్యాసం | Republic Day Essay In Telugu
Republic Day Essay In Telugu :- మన దేశం స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానీయులు పోరాటం చేశారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం జనవరి 26 వ తేదిన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశం కోసం ఎంతోమంది పురుషులు మరియు స్త్రీలు యుద్ధం చేసి తమ ప్రాణాలని విడిచారు.
రిపబ్లిక్ డే రోజు ప్రతి పాఠశాలలో, కళాశాలలో వేడుకలు చేసుకుంటారు. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినది. మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగమూర్తులు తమ ప్రాణాలను తృణపాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో మరణించారు.
నిజం చెప్పాలంటే మన రాజ్యాంగం జనవరి 26 తేదీ కాకుండా 1949 నవంబర్ 26 ఆమోదించారు. గణతంత్ర దినోత్సవం నాడు ఒక ప్రత్యేకత కలదు.ఆ ప్రాముక్యత ఏమిటి అంటే ! లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు.
జలియన్‌వాలాబాగ్ ఉదంతం సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో విజయం సాధించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
అప్పటి వరకూ బ్రిటీష్ కాలంనాటి ఉన్న భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దు చేయబడింది. జనవరి 26, 1950 నుంచి భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నిక కాగా, డాక్టర్ అంబేడ్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది.
రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యాయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గల దేశంగా ఖ్యాతి గాంచింది.
గణతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులు అందరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని, uniform వేసుకొని పాఠశాలకు వెళ్తారు , పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరు కలిసి ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత గ్రామం అంత దేశ భక్తి పాటలు పాడుకొంటూ వెళ్తారు. తిరిగి పాఠశాలకు వస్తారు.
కొంత సమయం గణతంత్ర దినోత్సవం గురించి పెద్దలు తెలియచేస్తారు చివరిలో పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులు అందరికి మిటాయిలు పంచుతారు. ఈ పండుగను కుల, మత, లింగ, వర్ణ వివక్ష బేధం లేకుండా అందరు కలిసిమెలసి జరుపుకుంటారు.
పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్ లో దొరికిన information ప్రకారంమీకు తెలియచెస్తున్నాం, మీకు ఈ వ్యాసం మీద సందేశం ఉంటె కామెంట్ రూపంలో తెలియచేయండి రిప్లై ఇస్తాం.
ఇవి కూడా చదవండి :-