Mogali Rekulu Serial RK Naidu Biography In Telugu
మొగలిరేకులు సీరియల్ ఎంత జనాధరణ పొందిందో మనందరికీ తెలుసు ఈ సీరియల్ జెమినీ ఛానల్ సమాప్తం అయిపోయింది,ఆ సీరియల్కు ఉన్నా ప్రజాదరణ వల్ల జెమినీ ఛానల్ వాళ్ళు మళ్లీ రిప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే ప్రజాదరణతో అన్ని సీరియల్ ను వెనక్కి నెట్టి ఈ సీరియల్ ముందువరుసలో నిలబడింది.
ఈ సీరియల్లో హీరోగా నటించిన ఆర్కే నాయుడు లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మొగలిరేకుల హీరో పేరు సాగర్ ఇతనిని జగన్ అని, మున్నా అని ,ఆర్కే నాయుడు అని .సీరియల్ లో పిలుస్తూ ఉంటారు.సాగర్ పుట్టి పెరిగింది.గోదావరి ప్రాంతంలోనే సాగర్ చదువంతా హైదరాబాద్ లోనే కొనసాగింది.ఈయన కంప్యూటర్ సైన్స్ కోర్సును ఏవీ కళాశాలలో పూర్తి చేశారు.
ముందుగా ఈయన చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. ఈయన నటించిన మొదటి సీరియల్ అమృతం. ఈ సీరియల్లో ఒక రెండు ఎపిసోడ్ లలో కామెడీ పాత్రలో కనిపించారు.ఆ తరువాత ఆయన నటించిన తొలి చిత్రం మనసంతా నువ్వే ఈ చిత్రంలో, ఆయన ఒక చిన్న పాత్ర మాత్రమే చేశారు.
ఆ తరువాత ఆయన నటించిన సీరియల్ చక్రవాకం.ఈ సీరియల్లో సాగర్ గారి నటన నచ్చిదర్శకురాలు అయినా మంజుల నాయుడు గారు మొగలిరేకులు సీరియల్ లో ఈయనను హీరో గా ఎంచుకున్నారు. ఈ సీరియల్లో ముందుగా ఆయన ఒక పోలీస్ అధికారి గా కనిపించారు. ఆ తరువాత మెల్లగా ఆయన పాత్ర హీరో గా మారిపోయింది.
మొగలిరేకులు సీరియల్ కు గాను సాగర్ నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది. ఆ తర్వాత సాగర్ ఒక సినిమాలో హీరోగా కూడా నటించారు.