ఆర్టీసీ సమ్మె కోసం ప్రాణత్యాగం చేసినా ఆర్టీసీ కార్మికుడు.

0

హైదరాబాద్ / ఖమ్మం;  ఆర్టీసీ కార్మికుల సమ్మె  నేపథ్యంలో  నెలకొన్న పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి నేలకొండపల్లి మండలం, రామచంద్రాపురం,గ్రామానికి చెందిన ఖమ్మంఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఇ శనివారం ఖమ్మం లోని తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని   నిప్పు అంటించి కొన్నాడు ఈ ఘటనలో 90 శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో చికిత్స కోసంఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్ కు తరలించారు.

చికిత్స కోసం కంచన్ బాగ్ లోని అపోలో డిఆర్ డి వో ఆస్పత్రికి చేర్పించారు.అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం చనిపోయాడు. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందడంతో అపోలో హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికుల ను పోలీసులు అరెస్టు చేశారు సిపిఐ కార్యదర్శి చాట వెంకటరెడ్డి, అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ఆస్పత్రికి చేరుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ ఆస్పత్రి వద్దకు చేరుకొని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

ఈ విషాదంతో చెల్లించినా శ్రీనివాస్ రెడ్డి స్నేహితుడు, మరో డ్రైవర్ వెంకటేశ్వర్లు కూడా పెట్రోలు  పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.తెలంగాణ కోసం పాటుపడిన మమ్మల్ని కెసిఆర్ పట్టించుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్లుగానే ఇప్పుడు జరిగితేనే  కానీ ప్రభుత్వం స్పందించేలా లేదు.అని ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వమే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.