బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మరో భారీ చిత్రం ఆర్ ఆర్.ఆర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారిన ఈ సినిమా అప్డేట్లు మరియు అనౌన్స్ మెంట్ లతో మరింత ఆసక్తి రేపుతున్నాయి.ఇది మల్టీ స్టార్ సినిమా కావటంతో ఇప్పటికే యావత్ భారతదేశం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తుంది. ఈ చిత్రంలో కొమురం భీం గా ఎన్టీ రామారావు, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది.
ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ నటి ఏమ్మా రా బర్డ్స్ నటిస్తోంది.
బాహుబలి సినిమాతో భారతీయ సినిమా తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూసేలా చేసిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. అయితే ఆయన ఇంతకు ముందు చిత్రాలని ముందుగానే సినిమా టైటిల్ ఇదే అని ప్రకటించే వారు.మరి ఈ చిత్రానికి మాత్రం ఇంకా టైటిల్ అన్వేషణ కొనసాగుతూనే ఉంది.ఈ చిత్రం కథ విషయానికి వస్తే,1920 లో జరిగిన సంఘటనలని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. 2020, జూలై 30న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అని చిత్ర నిర్మాత అయిన డివివి దానయ్య ప్రకటించారు.ఒకపక్క నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్, మరోపక్క మెగా ఫ్యామిలీ వారసుడు రామ్ చరణ్ కావడంతో ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అంతే కాకుండా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కావడంతో,భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోంది.బాహుబలి సినిమాకు ముందే టైటిల్ ఫిక్స్ చేసి అదే టైటిల్ తోఅన్ని భాషలకు వెళ్లారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్,కు మాత్రం ఏ భాషకు ఆ భాషలో సరే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు.తెలుగులో మాత్రం ఆర్ ఆర్ ఆర్, కు’ రామ రౌద్ర రుషితo’అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలిసింది.