సబ్జా విత్తనాలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
sabja seeds in Telugu uses

సబ్జా గింజలు అంటే ఏమిటి | What is sabja (Falooda) seeds in Telegu

Sabja seeds in Telegu : సబ్జా గింజలు లను తుక్మారియా అనే పేరుతో కూడా పిలుస్తారు, ఇవి చియా గింజల వలె కనిపిస్తాయి మరియు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సబ్జా గింజలు ప్రొటీన్లు, అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు మరియు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.

మీరు తినే రకం సాధారణంగా తీపి తులసి, ఓసిమమ్ బాసిలికం నుండి వస్తుంది, ఇది సాధారణంగా సీజన్ ఆహారాలకు ఉపయోగించే గింజలు. ఈ కారణంగా,ఈ విత్తనాలను సాధారణంగా తీపి తులసి గింజలుగా సూచిస్తారు.
sabja seeds in Telegu
ఈ గింజలు మీకు కావాలి అనుకొంటే ఇక్కడ ఇచ్చిన సైట్ లింక్ నుండి మీరు కొనుగోలు చేసుకోవచ్చు.
సబ్జా గింజలు ఎలా నిల్వ చేయాలి?

 ఈ గింజలను బాగా కడగాలి, వీటికి మిద దుదుమ్ము ధూళి ఎక్కువగా ఉంటది కాబ్బట్టి వీటికి ఎక్కువగా నీటిని పోసి శుబ్రం చేయాలి. చేసిన తర్వాత వీటిని కాఫీ ఫిల్టర్ లోకి వేసి నిరు అంత వెళ్లి పోయేదాక అరపేటి తర్వాత వీటిని ఒక ప్యాకే లోకి లేదా బాక్స్ లోకి వేసుకొని నిల్వ చేయవచు.

సబ్జా గింజలు ఎలా తినాలి | How to eat sabja (falloda) seeds

సబ్జా విత్తనాలను తీసుకోవడానికి కరెక్ట్ మార్గం ఏమిటంటే, ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటిని ఒక గ్లాసు నీటిలో సుమారు 15 నిమిషాలు నానపెట్టాలి. నానబెట్టిన విత్తనాలతో నీటిని త్రాగవచ్చు లేదా వాటిని నిమ్మకాయ నీటిలో లేదా మజ్జిగ, పాలు లేదా మీకు కావలసిన రసంలో కలుపుకొని తాగవచ్చు.
ఈ గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉన్నందున, ఇవి ఒక వ్యక్తి నిండుగా మరియు తృప్తిగా అనుభూతి చెందడానికి సహాయపడతాయి.

సబ్జా గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి Dosage of  sabja (falooda)seeds

సబ్జా  గింజలు నమలడం కష్టం, కాబట్టి వాటిని పచ్చిగా తీసుకోకండి. తినే ముందు వాటిని నీటిలో నానబెట్టడం మంచిది, ఇది వాటిని మరింత మృదువుగా చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ప్రతిరోజూ కనీసం రెండు టీస్పూన్లు తీసుకోవాలని రోజు తీసుకోవాలి.
ఈ విత్తనాలు ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. ఇవి ఎక్కువగా తీసుకోకండి తగ్గింత మోతాదులో తీసుకోండి, ఎక్కువగా తీసుకొన్న వివిధ ప్రమాదాలు చొట్టు చేసుకొనే ప్రమాదం ఉంది.  

సబ్జా గింజలు వలన ఉపయోగాలు | Sabja seeds (falooda) benefits in Telegu

 •  ఎక్కువగా వాంతి వచ్చే వారికి ఈ సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం.
 • ఈ గింజల నిరు తాగడం వలన  గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
 •  గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావు.
 •  సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి.
 • సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు  నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.
 •  సబ్జా గింజ పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.
 • ఈ గింజల లోకి చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది.
 •  నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
 • ఊబకాయంతో బాధపడే చాలా మందికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుంది.
 • ఈ గింజను ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది.
 • ఈ గింజలు డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది.
 • సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు.
 • ఈ గింజలు తాగడం వలన శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

సబ్జా గింజలు వలన దుష్ప్రభావాలు | Sabja (falooda) seeds side effects in Telegu

 • మీరు పరిమిత పరిమాణంలో ఈ విత్తనాలను తీసుకుంటే, అవి ఎటువంటి ముప్పును కలిగి ఉండవు. కానీ ఈ విత్తనాలను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.
 • రోజువారీ సిఫార్సు మోతాదు ఒక టేబుల్ స్పూన్ మించకూడదు.
 • ఈ విత్తనాల వల్ల కలిగే దుష్ప్రభావాలలో అతిసారం, వాంతులు, వికారం, మొటిమలు, యాసిడ్ రిఫ్లక్స్, తలనొప్పి, కడుపులో అసౌకర్యం, ఆకలి లేకపోవడం మొదలైనవి ఉన్నాయి.
 • అవి కొందరిలో రక్తంలో చక్కెర తగ్గడానికి కూడా కారణమవుతాయి.
 • చాలా మంది ఆరోగ్య సంరక్షణ వారు సబ్జా విత్తనాలను గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు కూడా సిఫారసు చేయరు, ఎందుకంటే పిల్లలు విత్తనాలను నీటిలో బాగా కలపకపోతే వాటినికడుపులో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.
 • అవి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గిస్తాయని నమ్ముతారు, అందువల్ల గర్భిణీ స్త్రీలకు ఇది సిఫార్సు చేయబడదు.

ఇవి కూడా చదవండి :-