AP Sachivalayam Certificate Verification Date
సచివాలయ పరీక్ష లో ఎంపికైనట్టు అభ్యర్థులకు గొప్ప శుభవార్త.ఈ పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 2 నుంచి కాల్లెటర్లు అందుకోనున్నారు.అలాగే ఈ నెల 3 నుంచి 7వ తారీకు వరకు నియామక ప్రక్రియను చేపట్టనున్నట్టు జెసి రాజకుమారి గారు స్పష్టం చేశారు.
- సచివాలయ పరీక్షలు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 3 మరియు 4 వ తేదీల్లో జరగనుంది.
- ఉమెన్ పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు గానూ ఉదయం 10 గంటలనుండి ఇ జెడ్పీ కార్యాలయంలో సర్టిఫికెట్ను పరిశీలిస్తారు.
- ఇక వార్డు సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎమినిటీస్ వార్డ్ పోస్టులకు 4 మరియు 5వ తేదీ లలో సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాల్లో పరిశీలన చేస్తారు.
- ఇక anm పోస్టులకు గాను ఈ నెల 3వ తేదీన డీఎంహెచ్వో కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
- ఇక పశుసంవర్ధక శాఖ జెడి కార్యాలయంలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు గానూ ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
- అలాగే జగన్నాథపురం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు గాను అదే రోజున నా గ్రామ ఉద్యానవన పోస్టులకుగాను ఉద్యానవన శాఖ డీడీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తారు.
- గ్రామ వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ పోస్టులకు గానూ 3, 4 తేదీల్లో పరిశీలిస్తారు.
- మూడవ తేదీన సెరికల్చర్ జెడి కార్యాలయంలో గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
- జడ్పీ కళ్యాణమండపంలో 4 మరియు 5వ తేదీన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు పరిశీలన ఉంటుంది.
- సర్వే శాఖ ఏడీ కార్యాలయం కలెక్టరేట్లో
5వ తేదీన గ్రామ సర్వే అసిస్టెంట్ సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. - కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో 3వ తేదీన వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రెటరీ,
వార్డ్ ఎడ్యుకేషన్, data processing secretary, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పోస్టులకుగాను సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
శాంపిల్ కోసం ఈ కింది లింక్ లో మీకు village/ward సెక్రటేరియట్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ సర్టిఫికెట్స్ చెక్ list ఫార్మటు ఇచ్చాను. ఈ సర్టిఫికెట్స్ పరిశీలన కోసం ఎలాంటివి ఇచ్చారో ఇందులో పొందు పరుస్తారు.
Check List For Certificates verification Link