సాల్మన్ చేప ప్రయోజనాలు దుష్ప్రభావాలు
Salmon Fish In Telugu : సాల్మన్ చేప అత్యంత పోషకాలు కలిగిన ఆహారాలలో ఒకటి. ఇది పోషకాలతో నిండి ఉండటమే కాకుండా, అనేక రకాల వ్యాధులకు కొన్ని ప్రమాద కారకాలను కూడా తగ్గిస్తుంది. కేవలం రుచి విషయంలోనే కాకుండా ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలను చేకూరుస్తుంది.
సాల్మన్ చేప ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు తెలుసుకోండి మరి.
Salmon Fish benefits In Telugu : సాల్మన్ చేప ఆరోగ్య ప్రయోజనాలు
◆ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలలలో ఐకోసపెంటెనోయిక్ ఆమ్లం (EPA) మరియు డోకోసహెక్సానోయిక్ ఆమ్లం (DHA) మొదలైనవి ముఖ్యమైనవి. ఈ ఆమ్లాలు సాల్మన్ చేపలో సమృద్ధిగా ఉంటాయి.
ఈ సాల్మన్ చేప తీసుకోవడం వల్ల వాపు తగ్గడం, రక్తపోటు తగ్గడం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం మరియు ధమనుల కణాల పనితీరును మెరుగుపరచడం వంటి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఒమేగా ఆమ్లాలు చేకూరుస్తాయి.
ముఖ్యంగా ధూమపానం, అధిక బరువు, లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు లేదా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు సాల్మన్ చేప మంచి ఔషదంలా పనిచేస్తుంది. సాదారణంగా చాలా మంది చేప మందు కలిగిన టాబ్లెట్స్ ను తీసుకుంటూ ఉంటారు. సాల్మన్ ఫిష్ ను ఆహారంలో భాగం చేసుకుంటే చేప మందు కలిగించే ప్రయోజనాలు చేకూరుతాయి.
◆ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది
సాల్మన్‌లో అధిక-నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. ఒమేగా -3 కొవ్వులలాగా, ప్రోటీన్ అనేది ఆహారం నుండి మాత్రమే లభ్యమయ్యే పోషకం. శరీరం గాయపడినప్పుడు ఆ గాయాలు తొందరగా నయం కావడానికి, ఎముకల ఆరోగ్యం కాపాడటంలోనూ, బరువు తగ్గాలని అనుకునేవాళ్లకు, కండరాల ద్రవ్యరాశి పెరగడానికి ప్రోటీన్ ఎంతో గొప్పగా సహాయపడుతుంది.
◆ బి విటమిన్లు అధికంగా ఉంటాయి
సాల్మన్ ఫిష్ లో బి విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12, నియసిన్, విటమిన్ బి6, రిబోఫ్లేవిన్, పంతోతేనిక్ ఆమ్లం, థియమిన్, ఫోలిక్ యాసిడ్ మొదలైన బి విటమిన్ వర్గానికి చెందినవి ఉంటాయి.
ఈ విటమిన్లు శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలలో పాల్గొంటాయి, మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడం, DNA ని సృష్టించడం మరియు మరమ్మత్తు చేయడం, దీర్ఘకాలిక మంటలను తగ్గించడం వంటి ప్రక్రియలలో పాల్గొంటాయి.
అలాగే మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరును నిర్వహించడానికి అన్ని B విటమిన్లు కలిసి పనిచేస్తాయి.
◆ పొటాషియం సమృద్ధిగా ఉంటుంది
సాల్మన్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం రక్తపోటును సమతుల్యతలో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా శరీరంలో తేమ శాతాన్ని నిలిపి ఉంచడంలో తోడ్పడుతుంది.
◆ సెలీనియం సమృద్ధిగా ఉంటుంది
సెలినీయం శరీరానికి తక్కువ మొత్తంలోనే అవసరం అయినప్పటికీ,కచ్చితంగా శరీరానికి కావలసిన ఖనిజం. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, థైరాయిడ్ వ్యాధి ఉన్నవారిలో థైరాయిడ్ ప్రతిరోధకాలను తగ్గించడంలో మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సెలినీయం దోహదపడుతుంది. శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.
◆ అస్టాక్సంతిన్ కలిగి ఉంటుంది
అస్టాక్సంతిన్ అనేది అనేక శక్తివంతమైన ఆరోగ్య ప్రభావాలతో ముడిపడి ఉన్న సమ్మేళనం. యాంటీఆక్సిడెంట్ల కెరోటినాయిడ్ గా అస్టాక్సంతిన్ పనిచేస్తుంది. సాల్మన్ చేపలో ఈ సమ్మేళనం లభిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గుంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం ద్వారా అస్టాక్సంతిన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు మరియు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది.
ఇది కూడా చదవండి :- ట్యునా చేపలు తింటే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా ?
◆ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
రోజూ సాల్మన్ తినడం వల్ల గుండె జబ్బుల నుండి రక్షణ పొందవచ్చు. రక్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల స్థాయిలను సాల్మన్ చేప మాంసం పెంచుతుంది. చాలామంది రక్తంలో ఒమేగా-6 ఆమ్లం ఎక్కువ ఉంటుంది.
ఈ రెండు ఆమ్లాల సమతుల్యత లోపించినపుడు గుండెజబ్బు ప్రమాదం పెరుగుతుంది. సాల్మన్ చేపను తినడం వల్ల ఈ సమతుల్యత లోపం లేకుండా ఉంటుంది.
◆ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
సాల్మన్ తరచుగా తీసుకోవడం వల్ల బరువు సులువుగా తగ్గవచ్చు. అలాగే అధిక బరువును దూరంగా ఉండవచ్చు. అంటే సాల్మన్ చేపను తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్స్ పెరగవు.
ఇతర అధిక ప్రోటీన్ ఆహారాల మాదిరిగా, ఇది ఆకలిని నియంత్రించే హార్మోన్లను శరీరంలో ఉత్పత్తి చేసి అధిక ఆహారాన్ని తీసుకోకుండా చేస్తుంది. అలాగే ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ వల్ల పోషకాహార లోపం ఏర్పడదు.
◆ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది
ఆహారంలో సాల్మన్ చేప మాంసాన్ని చేర్చడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఈ చేప మాంసం మరియు చేప నూనె రెండూ డిప్రెసివ్ లక్షణాలను తగ్గిస్తాయి.
గర్భధారణ సమయంలో పిండం మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో సాల్మన్ చేప మాంసం పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించడం ద్వారా ప్రసవానంతరం పిల్లల ఐక్యూ చురుగ్గా ఉండేలా చేస్తుంది.
Salmon Fish Side Effects In Telugu : సాల్మన్ ఫిష్ దుష్ప్రభావాలు
◆ట్యూనా చేపలాగే సాల్మన్ కూడా సముద్రపు చేప కావడం మూలాన పరిశ్రమలు విడుదల చేసే రసాయనాలలో దాగున్న పాదరసాన్ని ఆహారంగా తీసుకుంటుంది.
సాల్మన్ చేపను కూడా ఎక్కువ తినడం వల్ల ఆ పాదరసం మానవ శరీరంలోకి చేరి అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ కారణంగా చాలామంది చేపలకు ప్రత్యామ్నాయంగా చేప నూనెల పి ఆధారపడుతుంటారు.
◆ చేప నూనెలలో ఉండే ఒమేగా -3 ఎక్కువ మొత్తంలో శరీరంలో చేరితే విసర్జనను కలుగచేస్తుంది. కాబట్టి చేపలు, మరియు చేప నూనెలు ఎక్కువ వాడటం వల్ల జీర్ణాశయ సంబంధ సమస్యలు వస్తాయి.
◆ చేప మాంసం రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించగలిగినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అవసరమైన దానికంటే ఎక్కువగా రక్తాన్ని పలుచన చేస్తాయి. దీనివల్ల రక్తస్రావ సమస్యలతో బాధపడుతున్న వారికి చేప మాంసం ప్రాణాంతకమైనదిగా మారుతుంది.
ఇది చదవండి :- బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఇంటి చిట్కాలు