Sankranti Panduga In Telugu | సంక్రాంతి పండుగ గురించి
Sankranti Panduga Essay In Telugu :- సంక్రాంతి పండుగ అనగానే తెలుగింటి అమ్మాయిలు అందరూ తెల్లవారుజామునే లేచి, తలస్నానం చేసుకొని, కొత్త దుస్తులు ధరించుకొని, ఇంటి ముందుర కల్లాపు చల్లి రంగు రంగుల ముగ్గులును పెడుతారు.
ముగ్గు పెట్టిన తర్వాత, ఇంటిలో ఉండే దేవునికి పూజ చేసి, ముగ్గు మధ్యలో ఆవుపేడతో చేసిన గోబెమ్మలను పెట్టి వాటికీ పసుపు, కుంకుమ,చెరుకు ముక్క, పువ్వులతో అందంగా అలంకరించి పూజలు చేస్తారు.
రకరకాల పిండి వంటకాలు చేసుకొని అందరు కలిసి సంతోషంగా భోజనం చేస్తారు. ఈ పండుగని ఏంతో ఆనందంతో జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్టాలలో ఎక్కువగా ఈ పండుగని జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ విశిష్టత
సంక్రాంతి పండుగ అనేది మూడు రోజులు ఘనంగా జరుపుకొనే పండుగ. ఈ మూడు రోజులకి ఒక్కోరోజుకి ఒక్కో ప్రాముక్యత కలదు. మూడు రోజులకి ఎలాంటి ప్రాముక్యత ఉన్నదో తెలుసుకుందాం.
- భోగి.
- మకర సంక్రాంతి.
- కనుమ.
భోగి :- భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. భోగి పండుగ నాడు అందరు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేస్తారు, ఈ మంటల్లోకి ఇంటిలో ఉండే పాత వస్తువులు అన్ని వేస్తారు,ఇలా ఎందుకు వేస్తారు అంటే ఇంటిలో ఉండే దుష్ట శక్తులు అన్ని నశించిపోతాయి అని ప్రజలలో ఉండే నమ్మకం కారణంగా వేస్తారు.
ఆవు పేడతో పిడకలు చేసి వీటిని ఎండలో ఎండిపెట్టి,భోగి పండుగ రోజు మంటల్లోకి ఈ పిడకలను వేస్తారు. భోగి పండుగ రోజున అందరి ఇంటిలోనూ పాలు పొంగించి, ఈ పాలతో పాయసం చేసుకొని తింటారు.
భోగి పండుగ రోజున ఇంటిలో చిన్న పిల్లలు ఉంటె, వారికి భోగి పండ్లు తల మీద పోసి ,వారిని ఆశీర్వదిస్తారు. ఈ పండుగ రోజున ఇంటిలో బొమ్మల కొలువులు చేస్తారు. ఈ పండుగ నాడు రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భాగ్యాలతో అలాగే ఉంచమని కోరుకుంటూ పండిన ధాన్యంలో పాలు పోసి వండి ఈ నైవెధ్యాన్ని ఇంద్రుణ్ణికి , విష్ణువునికి పెట్టి పూజచేస్తారు.
మకర సంక్రాంతి :- సూర్యుడు ఆ రోజున మకర రాశిలోకి వెళ్ళడం వల్ల మకర సంక్రాంతి అని అంటారు. ఈ పండుగ నాడు ఆడపిల్లలు అందరు ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసుకొని, ఇంటిలో ఉండే దేవునికి పూజ చేసి, ఇంటి ముందుర నీటితో శుభ్రం చేసి, అవు పేడతో ఆలికి రంగు రంగుల ముగ్గులు పెడుతారు.
ముగ్గు మధ్యలో ఆవు పేడతో గోబెమ్మ చేసి పసుపు, కుంకుమ పెట్టి పూలతో అలంకారం చేసి పూజ చేస్తారు. పూజ అయిన తర్వాత దేవాలయంకి వెళ్తారు , ఇంటిలో అందరు కలిసి వివిధ రకాల పిండి వంటలు చేసుకొని అందరు సంతోషంగా భోజనం చేస్తారు.ఈ పండుగ నాడు హరిదాసులు తమ ఎద్దులతో ఇంటింటికి తిరుగుతూ నాట్యాలు చేస్తూ ప్రజలందరిని ఉత్సాహపరుస్తారు.
కొన్ని ప్రాంతాలలో అయితే కోడి పుంజుల ఆట, ఎద్దుల బండి పోటీలు, ముగ్గులు పోటీలు నిర్వహిస్తారు. ఈ పండుగ నాడు హరిదాసులకి దానం చేయడం వలన వారికి మంచి జరుగుతుంది నమ్ముతారు. ఈ విధంగా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
కనుమ :- కనుమ పండుగను ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ నాడు పశువులను శుభ్రం చేసి వాటిని అందంగా తయారుచేస్తారు. కనుమ రోజున పెద్ద, చిన్న అనే తేడాలేకుండా అందరు గాలి పాటాలను ఆకాశంలోకి ఏగరవేస్తారు. ఈ పండుగ నాడు ఇంటిలో మాంసాహారం వండుకొని అందరు సంతోషంగా తింటారు. ఈ పండుగను మూడో రోజుగా జరుపుకొంటారు. ఈ మూడు రోజులు ఏంతో ఘనంగా వేడుకలు చేసుకొంటారు.
ఇవి కూడా చదవండి :-