sarileru neekevvaru 14 days collection
మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సినిమా ఇప్పటికే ఓవరాల్గా మంచి లాభాలను సొంతం చేసుకుని మరిన్ని లాభాల వైపు దూసుకు వెళ్తున్నది. చలనచిత్ర రంగంలో ఇది ఒక పెద్ద విశేషంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర 1.13 కోట్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 1.28 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
ఇప్పటివరకు 14 రోజుల్లో ఈ చిత్రం సాధించిన కలెక్షన్స్ వివరాలు గమనిస్తే,
నైజాంలో 34.8 1 కోట్లు
సీడెడ్ లో 14.5 3 కోట్లు
వైజాగ్లో 17.83 కోట్లు
ఈస్ట్ లో 10.5 కోట్లు
వెస్ట్ లో 6.8 కోట్లు
కృష్ణాలో 8.23కోట్లు
నెల్లూరులో 3.7 1 కోట్లు గా గ్రాస్ కలెక్షన్ సాధించింది.
ఇలా రెండు రాష్ట్రాల్లోనూ మొత్తంగా 105 .4 కోట్లు సాధించింది.
ఇక కర్ణాటకలో 7.16 కోట్లు
రెస్టాఫ్ ఇండియాలో 1.76 కోట్లు
ఓవర్సీస్ మొత్తంమీద 11.4 9 కోట్లు వరల్డ్ వైడ్ గా 126.15 కోట్ల షేర్ అందించింది.
టోటల్ గ్రాస్ 202.3 కోట్లు కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది.
నిజం చెప్పాలంటే ఈ చిత్రం వంద కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది అయితే ప్రస్తుతం 26.1 5 కోట్లు లాభాలను సొంతం చేసుకున్నది. ఇక మిగిలిన ఈ రెండు రోజులు కూడా వీకెండ్స్ కాబట్టి ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర చుక్కలు చూపించే అవకాశం ఉన్నదని సినీవర్గాలు తెలియజేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరో మహేష్ బాబు మిలిటరీ మేజర్ అధికారి గా నటించడం విశేషం. ఇక కర్ణాటకకు చెందిన రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.