sarileru neekevvaru collection day 3- మహేష్ బాబు సామాన్యుడు కాదు

0

sarileru neekevvaru collection day 3

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మహేష్ కెరీర్ లో తన 26 చిత్రంగా రూపుదిద్దుకుంది.
మహేష్ తనకెంతో ప్రిస్టేజి చిత్రం గా భావిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో రష్మిక మందాన నటించింది.

అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గారు ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించి అందరినీ మెప్పించింది.ఇక మ్యూజిక్ సామ్రాజ్యంలో రాక్ స్టార్ గా పేరుపొందిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ సినిమాలో మహేష్ బాబు అజయ్ అనే పాత్రలో ఒదిగిపోయాడు అని సినీ విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు .

మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం జనవరి 11న విడుదల అయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ సినీ కెరీర్ లో ప్రెస్టేజ్ చిత్రంగాభావిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే ఈ చిత్రం యొక్క ట్రైలర్ రేసెస్ తారా స్థాయికి అందుకున్నాయి అని చెప్పవచ్చును.
అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం దూసుకుని పోతున్నది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ చేస్తూ భారీ విజయాలతో ముందుకు దూసుకుపోతున్నది మహేష్ బాబు చిత్రం.
ఈ చిత్రానికి వీకెండ్స్ మరియు సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో భారీ అంచనాలు, భారీ విజయాలు ,భారీ కలెక్షన్స్ తో కోట్లు కొల్లగొడుతుందని ట్రేడర్స్ అభిప్రాయపడుతున్నారు.

sarileru neekevvaru collection till now

ఇక కలెక్షన్ విషయానికొస్తే తొలి రోజు నుంచే బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ముందుకు పరుగులు తీస్తున్నది.
విడుదలైన తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా sarileru neekevvaru 1st day collection బాక్సాఫీస్ అంచనాల ప్రకారం 80 కోట్లు సాధించి రికార్డ్ సృష్టించినట్లు తెలుస్తోంది. 2nd day collections తో 100 కోట్లు దాటి టాలీవుడ్ క్లబ్ లో రికార్డులు సృష్టించింది. మూడో రోజు కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద తన హవాని కొనసాగిస్తూ ఉన్నాడు. రెండు రోజులు తో పాటు sarileru neekevvaru 3 days collection కూడా కాసుల వర్షం కురిపించింది నిర్మాతలకు.

వీకెండ్ కావడంతో అభిమానులు కలిసి రావడంతో వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా థియేటర్ల వైపు దూసుకొని పోతున్నారు. దీంతో ఈ చిత్రం మూడవరోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీనివల్ల ఈ మహేష్ బాబు చిత్రం మూడు రోజుల్లోనే 165 కోట్లతో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. ఇంకా ఈ సంక్రాంతి పండుగ సెలవులు ద్వారా మహేష్ బాబు ఇంకెన్ని కలెక్షన్లు సాధిస్తాడో అంచనాలకు అందకుండా ఉన్నది. మహేష్ బాబు ఈ చిత్రం ద్వారా బాహుబలి రికార్డులను కనుమరుగు చేయబోతున్నాడని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.