Sarileru Neekevvaru TEASER : అద్దిరిపోయే పంచ్ డైలాగ్స్ తో మహేశ్ రీ ఎంట్రీ

0

మహేష్ బాబు రాబోయే చిత్రం సరీలేరు నీకేవరు. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషిస్తూ, ఈ ఏడాది ఏప్రిల్‌లో మహర్షి తర్వాత మహేష్ బాబు తదుపరి రాబోతున్న సినిమా ఇదే.

“మీరెవరో మాకు తెలియదు, మేము బంధువులు కాదు. కానీ మిమ్మల్ని మరియు మీ పిల్లలను రక్షించడానికి, మేము పగలు మరియు రాత్రి , ఎండా వానా అనకుండా పోరాడుతూనే ఉంటాము. ఎందుకంటే మీరు మా బాధ్యత, ” అంటూ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో పాటు యాక్షన్ సన్నివేశాలతో టీసర్ ప్రారంభమవుతుంది.

ఒకటిన్నర నిమిషాల నిడివిగల టీజర్ దేశభక్తిపై ఎక్కువగా చిత్రీకరించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు ఒంటరిగా గూండాలను, టెర్రరిస్ట్ లను ఎదుర్కొంటుంటాడు. హైలైట్ సీన్ ఏంటంటే , మహేష్ బాబు ఒక రౌడి తో మాట్లాడే సన్నివేశం, సింపుల్ గ రౌడి ని అడుగుతాడు ” మేము అక్కడ మీకోసం ప్రాణాలను ఇస్తుంటే , మీరేమో ఇక్కడ కత్తులు, కొడవళ్ళు పట్టుకొని ఆడాళ్ళ మిద పడుతున్నారు. బాధ్యత ఉండాలి రా ” . మహేష్ బాబు పోకిరి, డూకుడు వంటి రెండు చిత్రాలలో పోలీసుగా నటించగా, అతను ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించడం ఇదే మొదటిసారి.

అనిల్ రావిపూడి చెప్పిన మాట నిలబెట్టుకునేటట్టు కనబడుతున్నాడు. అతని సినిమాల్లో ప్రధాన బలం కామెడీ, అయితే ఈ టీజర్ లో కామెడీ కంటే ఆక్షన్ మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టాడు. అలాగే కొండారెడ్డి బురుజు దగ్గర చెప్పే డైలాగ్ అయితే మనతో విజిల్స్ వేయిస్తుంది. ” భయపడేవాడే బేరానికొస్తాడు. మనదగ్గర బేరాల్లేవమ్మా” అంటూ మహేశ్ బాబు చెప్తుంటే పూనకం వస్తుంది ఒక్కొకరికి.

అలాగే  డాన్ విజయశాంతి ,  ప్రకాష్ రాజ్ కి లకు కూడా మంచి పాత్రలే ఇచ్చినట్టు కనబడుతోంది. మరే ఈ సంక్రాంతికి మహేష్ గట్టిగానే కొట్టేటట్టు కనబడుతోంది. మరోపక్క అల వైకుంటపురం తో పోటి పడాల్సి ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉండబోతోందో చూద్దాం. వెయిట్ అండ్ సి.

మరి ఆలస్యం చేయకుండా కింది ఇచ్చిన లింక్ ద్వార Sarileru Neekevvaru Teaser ని చూసెయ్యండి.

 

https://youtu.be/VbuK58iQ_qc