నాన్ బాహుబలి రికార్డు బద్దలు కొట్టింది మహేషా లేదా అల్లు అర్జునా ?

0

sarileru neekevvaru vs ala vaikunta puram collections :

అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురం లో. ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకు వెళ్తున్నది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా విడుదలైన 13 రోజుల్లోనే అరుదైన రికార్డు సృష్టించింది. విడుదలైన మొదటి రోజు నుండి ఈ రెండో వారం వరకు కూడా ఒకే రకమైన కలెక్షన్లతో ముందుకు వెళుతూ దాదాపు రెండు వందల ఇరవై కోట్లు సాధించింది. సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది.

ఇదే సమయంలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సరిలేరు నీకెవ్వరు చిత్రం 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ను అల వైకుంఠ పురం లో చిత్రం కేవలం పది రోజుల్లోనే సాధించి సినీ చరిత్రలోనే ఓ గొప్ప రికార్డును సృష్టించింది.

అల వైకుంఠ పురం లో చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో నూ అన్ని ఓవర్సీస్లోనూ మొత్తంగా చూస్తే నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి అధిక మొత్తంలో వసూలు సాధించింది. తొలి 11 రోజుల్లోనే 214.65కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. రెండు తేదీ తెలుగు రాష్ట్రాల్లోనూ కలుపుకుంటే 11 రోజుల్లో 105.8 కోట్లు వచ్చాయి.

ఏరియా వైజ్ చుస్తే కింది నంబర్స్ వచ్చాయి.

నైజాం 34.36 కోట్లు
సీడెడ్ 17.81 కోట్లు
గుంటూరు 9.63 కోట్లు
ఉత్తరాంధ్ర 15.99 కోట్లు
తూర్పుగోదావరి 9.46 కోట్లు
పశ్చిమగోదావరి 7.38 కోట్లు
కృష్ణ 9.34 కోట్లు
నెల్లూరు 3.85 కోట్లు
ఇక ఆంధ్ర తెలంగాణ కలిపి 105.8కోట్లు వసూలు చేసింది.

ఆంధ్ర తెలంగాణలో టాప్ 3 షేర్లు తీసుకుంటే బాహుబలి -2 మొదటి స్థానం లో 198.7 కోట్లు ఉంది. బాహుబలి110.1 కోట్లు, అల వైకుంఠపురం లో 105.8 కోట్లు సాధించి నాన్ బాహుబలి రికార్డ్స్ తో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ సాధించడం ఇదే మొదటిసారి! అంతేకాకుండా అల వైకుంఠ పురం లో చిత్రానికి 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే టాప్ కలెక్షన్స్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇంకా సుశాంత్, నివేద పేతురాజ్, మురళీశర్మ, జయరామ్, టబు , నవదీప్ లాంటి నటులు కీలకమైన పాత్రలో నటించి అందరితోనూ ప్రశంసలు పొందారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని అద్భుతమైన రికార్డులు సాధిస్తుందని ఆశిద్దాం.