భారత్-పాకిస్ధాన్ ల మధ్య వన్డే సిరీస్ కరోనా బాధితుల సహాయార్థం — షోయబ్ అక్తర్

0

కరోనా వైరస్ బారినపడిన ఎంతో మంది బాధితులకు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, వారిని ఆదుకునేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ నిర్వహించడం మంచిదని షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. బుధవారం పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ తన యూట్యూబ్ ఛానల్ లో ఇలా తెలిపాడు. ” కరోనా వైరస్ కు గురికాబడిన రోగులకు సహాయం చేయడం కోసం భారత్ పాకిస్తాన్ మధ్య 3 వన్డే సిరీస్ లను నిర్వహిస్తే మంచిదని” అంటున్నాడు.

ఇది సాధ్యమేనా?
2007 సంవత్సరం నుంచి భారత్ – పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించడం లేదు.ఉగ్రవాదులు జరిపిన బీభత్స చర్యల నేపథ్యంలో ఈ రెండు దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బ తినడం వల్ల ఎలాంటి సిరీస్ లు జరపడం లేదు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ICC నిర్వహించే మెగా టోర్నీ మ్యాచ్ లు మాత్రమే జరుగుతున్నాయి.ప్రస్తుతం కోవిడ్ 19 వైరస్ కలిగిస్తున్న భయంకర అలజడుల నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ కొన్ని ఉత్తేజకరమైన వ్యాఖ్యలు చేశాడు.ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన భీకరమైన ఇలాంటి పరిస్థితుల్లో కాకుండా వ్యాధి కొంచెం తగ్గు ముఖం పట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ఈ క్రికెట్ మ్యాచ్ కనుక నిర్వహిస్తే కరోనా వైరస్ వలన కలిగిన బాధను మరిచిపోవడానికి ఇది ఒక అనుభూతిగా మిగిలి ఉంటుందని ఆయన తెలిపాడు.

ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ల మధ్య గెలుపు – ఓటములు పక్కనపెట్టి ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాలు సమానంగా పంచుకొని కోవిడ్ 19 బాధితులకు అందజేస్తే చాలా మంచిదని ఆయన తెలిపాడు.భారత్ పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచానికి ఒక గొప్ప క్రేజ్ ఉన్నది.
ఒకవేళ ఈ సిరీస్ జరిగితే ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే మేము తప్పకుండా సంతోషిస్తాం, అదే బాబర్ ఆజామ్ కనుక సెంచరీ చేస్తే మీరు కూడా ఆనంద పడాలి.
ఈ సిరీస్లో పాల్గొనే రెండు దేశాలను విజేతలు గానే భావించాలి. ఈ సిరీస్ కోసం భారీగా వచ్చే సొమ్మును సమానంగా పంచుకోవాలి. కరోనా వైరస్ కట్టడికి ఈ డబ్బును ఉపయోగించాలని నా అభిప్రాయం అని అన్నాడు.
కరోని మహమ్మారి కలిగిస్తున్న ఈ భయంకర వాతావరణానికి ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు ఇలాంటి సిరీస్ జరగాలని ఆశిద్దాం.