హైదరాబాద్; తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజయానికి ఉదాహరణగా నిలిచిన మన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు గురువారం. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు సామాజిక ఉద్యమాలను వేదికగా చేసుకొని ఎస్ ఎస్ రాజమౌళి గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మన తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి దర్శకుడు రాజమౌళి.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయినా రాజమౌళి.తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఆయన తన రెండవ సినిమా సింహాద్రి తో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశారు.ఆ తరువాత సై, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, యమదొంగ,మర్యాద రామన్న,ఈగ, బాహుబలి, బాహుబలి 2, వంటి హిట్ చిత్రాలు మనకు అందించారు.
మన తెలుగు చిత్ర పరిశ్రమ, బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకునే విధంగా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి.ఒక ఈగ ను కూడా హీరోగా పెట్టి హిట్ కొట్టిన మొట్టమొదటి దర్శకుడు మన రాజమౌళి. హాలీవుడ్ సినిమాల్లో కూడా పెద్ద పెద్ద జంతువులను పెట్టి హిట్ కొట్టారు.కాకపోతే ఒక ఈగను హీరోగా వారు కూడా చూపించలేకపోయారు.
దర్శకధీరుడు, రాజమౌళి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుపుతూ అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాబోయే కొత్త దర్శకులకు మీరు ఒక రోల్ మోడల్ గా నిలవాలని కోరుకుంటున్నాను. అని ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు.అలాగే బాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత,దర్శకుడు,అయినా కరణ్ జోహార్ మాట్లాడుతూ,భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో మొదటి స్థానం మీదే అని బాహుబలి సినిమాతో భారతదేశ సినిమా మార్కెట్ ను ప్రపంచ స్థాయి సినిమా మార్కెట్ గా మార్చిన మీకు నా సెల్యూట్. అంటూ శుభాకాంక్షలు తెలిపారు.దగ్గుపాటి రానా మాట్లాడుతూ తూ, నేను ఎన్ని చిత్రాలు చేసినా, ఎప్పటికి మీరే మా కెప్టెన్ అని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ, తెలుగు చలన చిత్ర పరిశ్రమను యావత్ భారతదేశానికి పరిచయం చేసిన దర్శకధీరుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, మా దర్శకధీరుడు జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.