స్వచ్ఛ భారత్ వ్యాసం | Swachh Bharat Essay In Telugu
Swachh Bharat Goppatanam In Telugu :- 02 అక్టోబర్ 2014 గాంధీ జయంతి రోజున ఢిల్లీలోని ఒక దళిత వాడలో ప్రధానిమంత్రి నరేంద్రమోడీ స్వయంగా చీపురు పట్టుకొని ఉడ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని ప్రధాని ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలియజేశారు.
ఈ స్వచ్ఛ భారత్ ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, వివిధ గ్రామాలలో, పట్టణాలలో అనేక చోట్ల శుభ్రంగా ఉండకుండా, ఆశుభ్రంగా ఉండడం వలనే ప్రజలందరు రోగాలకు, వ్యాధులకు గురి కావడం ప్రాణాలను కోల్పోవడం .
ఆశుభ్రంగా ఉండడం వల్ల చిన్న పిల్లలకి దోమలు కుట్టి వారికి జ్వరాలు రావడం జరుగుతున్నాయి, అనేక చోట్ల గలిజ్ గా ఉంచుకోవడం వల్ల అక్కడ నివసించే దోమలు వాళ్ళు తినే ఆహరం మీదకు చేరి ఆహరంను విషపూరితoగా మారుస్తున్నాయి. విషపూరితమైన ఆహరం తినడం వల్ల ప్రజలందరు రోగాలకు బానిసలు అవుతున్నారు.
గ్రామాలూ,ప్రాంతాలు, పట్టణాలలో ఉండే కాలువలు, ఖాళి స్థలం, మరుగుదోడ్లును క్లీన్ గా పెట్టుకోకపోవడం వలనే రోగాలు వస్తున్నాయి, ఇవన్నీ చూసే ప్రధాని మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మనం నివసించే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తెలియజేశారు. ఇంటిలో ఉండే చెత్త రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి పొడి చెత్త, రెండోది తడి చెత్త. ఈ రెండు చెత్తలను వేరు వేరు సంచులలోకి వేసుకొని ఉదయానే చెత్త బండి రాగానే అందులోకి వేయాలని ప్రధాని మంత్రి తెలిపారు.
ఈ చెత్త ఇంటిలో అలాగే ఉంచుకోవడం వల్ల క్రిమీ కీటకాలు ఎక్కువ అయ్యి వాటివలన మన ప్రాణాలకి ప్రమాదంగా మారుతుంది. ప్రజలు ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
మురికి కాలువలు ఎప్పటికపుడు శుభ్రం చేస్తుండాలి. ఎక్కువగా మురికి కాలువల వలనే రోగాలు వ్యాపిస్తాయి. మురికి కాలువలో అనేక క్రిములు నివసిస్తూ ఉంటాయి. వీటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ప్రాణాలకి ఎలాంటి హాని కలగదు.
ప్రజలు నివసించే ఇంటిలో మరుగుదోడ్లు తప్పని సరిగా ఉండాలి. వాష్ రూమ్ కోసం బయట ప్రాంతాలకి వెళ్ళకూడదు, వీటి వలన కూడా వ్యాధులు సోకుతాయి, మరుగుదోడ్లు ఉండడమే కాకుండా వీటిని శుభ్రంగా కూడా ఉంచుకోవాలి. మరుగుదోడ్లులలో ఉండే బ్యాక్టీరియా కూడా విషపురితమైనది. వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత చేతులని, కాళ్ళని కూడా క్లీన్ గా శుభ్రంగా కడుగుకోవాలి. అలాగే హ్యాండ్ వాష్ ను ఉపయోగించాలి.
ఇంటిలో ఉండే తొట్టిలు, సొంపులు, నీటి బిందెలు అన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు అయిపోయే కొద్ది వాటిని క్లీన్ చేసుకొంటూ ఉండాలి, వాటిని అలానే ఉంచితే అందులో దోమలు ఉత్పతి అవ్వడం జరుగుతుంది. ఆ దోమలు మనుషులను కుట్టడం వల్ల చికెన్ గునియా, టైఫాయిడ్ వివిధ రకాల జ్వరాలు వస్తాయి.
ఇండ్ల మధ్యలో ఖాళి స్థలం ఉంటె అందులోకి నీరు చేరకుండా చూసుకోవాలి. అలాగే అందులోకి చెత్త చెదారం వేయకూడదు. ఒకవేళ నీరు చేరి కొన్ని రోజులుగా అలాగే నిల్వ ఉంటె, కొన్ని వేల దోమలు ఉత్పతి అయ్యి ప్రజలందరి ప్రాణాలకి ప్రమాదకరంగా మారుతాయి. నీరు ఉన్న చోట మట్టి వేయడం మంచిది. మట్టి నీటిలోకి వేయడం వలన దోమలు ఉత్పతి కావు.
ఈ స్వచ్ఛభారత్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. అమృత్ 2.0 కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లి కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తుంది. 500 అమృత్ పట్టణాల్లో ఇళ్లకు మరుగు వ్యర్థాల కనెక్షన్లు ఇస్తున్నారు.
దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఉండే ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగ్యస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుకొన్నారు. చివరిగా అన్ని గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాలలో తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
మాకి అందిన information ప్రకారం, మీకు తెలియచేస్తున్నాం, మీకు ఎలాంటి సమాచారం కావాలి అనుకొన్న తెలుగు న్యూస్ పోర్టల్. కాంని రోజు విజిట్ చేస్తూ ఉన్నండి. మీకు అవసరమైన విషయాలను రోజు తెలియచేస్తూ ఉంటాం.
ఇవి కూడా చదవండి :-