తమన్నాకి ఊహించని బహుమతి ఇచ్చిన ఉపాసన.

0

సైరా నరసింహారెడ్డి’లో తమన్నా ఒక పాత్ర చేస్తోందంటే పెద్దగా ప్రాధాన్యత వున్న పాత్ర అయి వుండదని అనుకున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో కూడా మిగతా అందరూ తమదైన ముద్ర వేస్తే తమన్నా మాత్రం తన ఉనికి నిలుపుకోలేకపోయింది. అయితే ‘సైరా’లో మాత్రం తమన్నాకి పవర్‌ఫుల్‌ పాత్ర దక్కింది.సైరా నరసింహారెడ్డి కోసం ఆమె చేసే త్యాగం హైలైట్‌ సీన్స్‌లో ఒకటిగా నిలిచింది. అదే సమయంలో తమన్నా ఈ చిత్రానికి ఫుల్‌ పబ్లిసిటీ చేసింది. దీంతో ఆమెని మెచ్చి నిర్మాత రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన ఒక ఖరీదైన వజ్రాన్ని బహూకరించింది.

ఇంతకుముందు తమన్నాని అంతగా కన్సిడర్‌ చేసేవారు కాదు కానీ ‘సైరా’ తర్వాత ఆమెకి ఆఫర్స్‌ పెరుగుతున్నాయి. ఎఫ్‌ 2, సైరా విజయాల తర్వాత తమన్నాకి సీనియర్‌ హీరోల చిత్రాల పరిచయం  ఏర్పడింది. గత ఏడాది ఇక రిటైర్మెంట్‌కి దగ్గర పడుతోంది అనుకున్న తమన్నానే ఇప్పుడు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.