హైదరాబాద్; ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని,చెప్పారు.ఆర్టీసీ కార్మికులతో ఎటువంటి చర్చలు జరపమని తేల్చి చెప్పేశారు.చట్టవిరుద్ధమైన సమ్మెకు, అది పండుగ సమయంలో, సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ పడే సమస్య లేదని,వారు చేసింది ఇది చాలా పెద్ద తప్పు అని అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు లోపల హాజరుకాని కార్మికులని తిరిగి ఉద్యోగాలలోకి తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రకటించారు.అయితే ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది సిబ్బంది అని సీఎం గారు చెప్పారు.తాను ఎన్ని చెప్పినా సమ్మెకు దిగారని అందులోనూ దసరా వంటి పండుగ ముందు ప్రజలను ఇబ్బంది పెట్టారని సీఎం చంద్రశేఖర రావు గారు భావిస్తున్నారు.
అలాగే ఆయన మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఆర్టీసీ లేదన్నారు. అందులో ముఖ్యంగా, మధ్యప్రదేశ్, చతిస్గడ్, మణిపూర్,ఝర్ఖoడు, రాష్ట్రాల్లో కాగా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్, ఒరిస్సా,రాజస్తాన్ ,లాంటి రాష్ట్రాలలో ఆర్టీసీ నామమాత్రంగానే నడుస్తున్నాయని చెప్పారు.ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఆర్ టి సి కార్మికులని ఇంత బాగా చూసుకున్న వారు సమ్మెకు దిగడం సరికాదని సీఎం అన్నారు.
అందుకే ఈ ప్రభుత్వం తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ మనుగడ సాగాలంటే కొన్ని చర్యలు తప్పవని,భవిష్యత్తులో ఆర్టీసీ కి సంబంధించి,క్రమశిక్షణా రాహిత్యం, బ్లాక్మెయిల్ వంటి విధానాలు, శాశ్వతంగా ఉండకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.