నవంబర్ 4న దీపావళి పండుగ రోజు తెల్ల జిల్లేడు తో ఇలా చేయండి మీ పేదరికాన్ని తొలగించుకోండి.

0
Tella jilledu chettu in telugu 2021
Tella jilledu chettu in telugu 2021

Tella jilledu chettu in telugu : తెల్ల జిల్లేడు దైవ వృక్షం పరమశివుడు ఈ చెట్టు లో నివసిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. పూర్వకాలం నుండి శ్వేతార్క గణపతిని పూజించడం ఆనవాయితీగా వస్తున్నది అందుకే తెల్ల జిల్లేడు(శ్వేతార్క గణపతి) వేరు ను ఇంట్లో ఉంచుకుని పూజలు చేస్తూ ఉంటారు.

ఈ తెల్ల జిల్లేడు పూలతో ఆంజనేయస్వామికి 108 పూలు కుట్టి మాల వేస్తారు. తెల్ల జిల్లేడు ఆకులతో మాల కట్టి ఆంజనేయ స్వామి మెడలో వేయడం వల్ల శని దోషం పోతుంది మరియు రాహు కేతు దోషం కూడా పోతుంది. ఈ తెల్ల జిల్లేడు ఆకులతో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి కి పూజ చేయడం వల్ల, స్వామి కలలో కనిపిస్తాడు.

ఎందుకంటే దేవతా వృక్షం గా భావించే ఈ తెల్లజిల్లేడు చెట్లు అరుదుగా కనిపిస్తాయి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు కనుక ఇంటి ముందు ఉంటే ఆ ఇంటిలో ఎలాంటి బాధలు ఉన్నా, వాస్తు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఎందుకంటే తెల్ల జిల్లేడు చెట్టు సాక్షాత్తూ గణపతి తో సమానం.

12 సంవత్సరాలు గా పెరిగిన తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఆ తర్వాత విఘ్నేశ్వరస్వామి ఆకృతి లో కి మారుతుంది. కాబట్టి ఇలాంటి తెల్ల జిల్లేడు చెట్టు మన ఇంటి ముందు ఉంటే మన ఇంటి నుంచి చేసే ప్రతి పని కూడా విజయం సాధిస్తుంది.

ఈ తెల్ల జిల్లేడు పూలను మాలగా కట్టి, కార్తీక సోమవారం రోజు శివుడికి తమ భర్త చేత అర్పిస్తే, వారు నిండు సౌభాగ్యంతో వంద సంవత్సరాలు సౌఖ్యంగా జీవించగలుగుతారు. ఆ స్త్రీ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుంది.

ఈ తెల్లజిల్లేడు వేరు మీ దగ్గర పెట్టుకుని మీరు ఏ పని చేసినా ఆ పని 100% విజయం సాధిస్తుంది. ప్రాణప్రతిష్ట చేసిన తెల్లజిల్లేడు వేరు కు అద్భుత శక్తులు చేకూరుతాయి.

కాబట్టి ఇందుకోసం మొదటగా ఒక పట్టుబట్టలో తెల్లజిల్లేడు వేరు ఉంచి, దీనిని రాగి ప్లేటు లేదా వెండి ప్లేట్ లో ఉంచి, 21 రోజులు లేదా 41 రోజు లు లేదా 108 రోజుల పాటు తెల్ల అక్షింతలు తీసుకుని శివ స్తోత్రం తో పూజించాలి.

ఇలా ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తూ, రాత్రిపూట పచ్చ కర్పూరం తో అర్చన చేయాలి. ఇలా 21 రోజులు లేదా 41 రోజులు లేదా 108 రోజులు చేసేటప్పుడు ఒక్కపూటే భోజనం చేయాలి. కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

ఇది దేవతా వృక్షం కాబట్టి చాలా నిష్ఠగా, పవిత్రం గా చేపట్టాలి. తర్వాత ఆ తెల్ల అక్షింతలు అన్నింటిని ఒక బట్టలో కట్టుకుని, ప్రాణప్రతిష్ట చేసిన జిల్లేడు వేరు ను ఆ బట్ట లో ఉంచి దానిని కర్పూరంతో అర్చన చేసి, ఆ తర్వాత దీన్ని ఒక మూటగా కట్టి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ తప్పనిసరిగా ఉంచుకోవాలి.

ఇప్పుడు మీరు ఏ పని కోరుకున్నా 100% ఆ పని సక్సెస్ అవుతుంది. కానీ మంచి పనికి మాత్రమే ఈ విజయం చేకూరుతుంది. అధర్మంగా చేసే చెడు పనులకు విజయం వాటిల్లదు. ధర్మ పరంగా మాత్రమే మీకు రావాల్సిన మొండిబకాయిలు కానీ, లోన్లు కానీ నీ దగ్గరకు చేరుతాయి.

అధర్మ పరంగా మీకు ఎలాంటి పనులు జరగవు. వివాహ సంబంధాలు కుదరని వాళ్ళు, ఈ వేరు మీ దగ్గర ఉంచుకుని, వివాహ సంబంధాని కి వెళితే ఆ వివాహం తప్పకుండా కుదురుతుంది.

ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులు ఈ వేరు దగ్గర ఉంచుకునే పరీక్ష రాస్తే వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది. పై సూచనలు తప్పకుండా పాటిస్తే, మీ పేదరికాన్ని తొలగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :-

  1. బల్లి శాస్త్రం – దోషలేంటి ?
  2. ఆడవారిపై బల్లి పడిందా ? అయితే ఇవి తెలుసుకోండి.
  3. మగవారిపై బల్లి పడితే ఏమ చేయాలో మీకు తెలుసా ?