Top 15 WhatsApp Tips and Tricks 2019 ( తెలుగు లో )

0

ఇప్పటి జనరేషన్ లో WhatsApp లేకుండా మన ప్రపంచాన్ని ఊహించుకోలేం. అంతలా ఈ సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ అందరితో అల్లుకుపోయింది. మరి మీరు కేవలం WhatsApp అప్లికేషన్ వాడుతున్నట్లయితే సరిపోదు అందులో ఇలాంటి కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయో తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వాట్సాప్ ను మీరు సమర్థవంతంగా ఉపయోగించగలరు. మరి నేను ఇక్కడ  వాట్సాప్ లో వచ్చిన మంచి ఫీచర్స్ మరియు tips and tricks పూర్తిగా వివరిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో కూడా ఫిట్స్ ను షేర్ చేయండి. మరి ఒక్కొక్కటిగా వాట్సాప్ లో దాగి ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందామా.

ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే   వాట్సాప్ ఫీచర్స్ లో కొన్ని వాట్సాప్ బీటా అప్లికేషన్ కి వర్తిస్తాయి. మరి మీరు WhatsApp Beta ఇన్స్టాల్ చేయకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి.

1.Request Account Info :

మన వాట్సాప్ ప్రొఫైల్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఒక చిన్న రిక్వెస్ట్ నీ మనం వాట్సాప్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మనం వాట్సాప్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నామో  అప్పటినుండి ఇప్పటివరకు మనం ఎవరి తో చాట్ చేశాము, వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఏంటి, మన ప్రొఫైల్ ఫోటో, మనం వాడే మొబైల్ ఏంటి, ఐపి అడ్రస్ ఇలాంటి మరెన్నో విషయాలు మనం పొందే కలం అవకాశం ఉంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే..

  Menu ( 3 dots on Top Right Corner ) > Settings > Account > request Account Info

దాదాపు మూడు రోజుల తర్వాత  మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తారు. వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకుని మరీ చూడవచ్చు.

2.Two Step Verification :

మనం కేవలం వాట్సాప్ ని వాడితే సరిపోదు, దాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి కూడా తెలిసి ఉండాలి. లేదంటే మనం ఎవరి తో చాట్ చేస్తున్నాము ఎంతసేపు చాట్ చేస్తున్నాము వాటి వివరాలు ఏంటో కొంతమంది హాకర్స్ చేతిలో పడే అవకాశం ఉంది. కాబట్టి వాట్సప్ అప్లికేషన్ లో ఒక మంచి అవకాశం ఇచ్చారు అదేంటంటే ప్రపంచంలో ఎవరూ కూడా మన వాట్సాప్ ను hack చేయడానికి వీలులేకుండా  2 step వెరిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోవాలి. అదెలాగంటే..

Menu> Settings >Account > Two Step verification > Enable > Enter 6 Digi pin > Confirm pin > add email address > Done

3.Don’t show Personal Images in Gallery :

 ఒక్కొక్కసారి  వాట్సాప్ లో లో కొన్ని పర్సనల్ విషయాలు షేర్ అవుతుంటాయి అవి ఫోటోలు కావచ్చు లేదా వీడియోలు కావచ్చు లేదా మరేదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మొబైల్ యొక్కగ్యాలరీలో సేవ్ అయిపోతుంటాయి.మరి అలా కాకుండా ఉండాలంటే వెంటనే దీన్ని డిసేబుల్ చేయండి..

Menu > Settings > Chats > Media visibility > Disable

4.Turn Off read receipts :

కొన్ని సందర్భాల్లో మీకు వాట్సాప్ లో వచ్చిన మెసేజెస్ ని  మీరు చదివినా కూడా అవతలి వారికి తెలియ కూడదు అనుకుంటూ ఉంటారు. దీనికోసం వాట్సాప్ లో ఒక మంచి  ఆప్షన్ ఇచ్చారు. అదేంటంటే..

Menu > Settings > Account > Privacy > Read receipts > disable

5.Don’t want to join in any group :

మనకు తెలియకుండానే ఇదే మన వాట్సాప్ నెంబర్ చాలా గ్రూపుల్లో యాడ్ చేయబడి ఉంటుంది. అనవసరమైన గ్రూపుల్లో వచ్చే మెసేజ్ ల వల్ల విసుగు పుడుతుంది. మరి మన నెంబర్ ని మన పర్మిషన్ లేకుండాe ఎ  గ్రూప్లో కూడా ఆడ్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Menu > Settings > Account > Privacy > Groups > Select Nobody

6.Share Live Location with your friends :

 ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో  ఖచ్చితమైన ప్లేస్ ని లేదా లొకేషన్ని మీ ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎనిమిది గంటలపాటు మన లొకేషన్ షేర్ అవుతుంది.అది ఎలాగంటే..

Open a chat > type a message > select document icon > select location > share live location > select time duration.

7.Share live location through WhatsApp status :

సాధారణం గా వాట్సాప్ స్టేటస్ లో ఫోటోలను అప్లోడ్ చేస్తుంటాం కదా మై ఈ ఫోటో ద్వారా కూడా మనం మన లైవ్ లొకేషన్ ని మన ఫ్రెండ్స్ కి కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ షేర్ చేయవచ్చు. ఎలాగంటే ఫోటో అప్లోడ్ చేయగానే పైన emoji ఆప్షన్ కనబడుతుంది కదా అందులో లైవ్ లొకేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తద్వారా మన ప్రజంట్ లొకేషన్ ని మన ఫ్రెండ్స్ తో ఈజీగా షేర్ చేసుకోవచ్చు.

8.Pause WhatsApp status videos :

మనం సాధారణంగా వాట్సాప్ స్టేటస్ వీడియోలను చూసినప్పుడు దాన్ని క్లిక్ చేసామనుకోండి అక్కడ మనకు నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది కానీ మనకు పాస్ అనేది అవ్వదు, మరి వీడియోస్ ని పాస్ చేయాలంటే సింపుల్ ట్రిక్స్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది, అదేంటంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు మనం  ఫింగర్స్ ని use చేసి స్క్రీన్ పైన Zoom అవుట్ చేయగానే వీడియో pause అవుతుంది.

9.Only play audio in WhatsApp status video :

 ఒక్కొక్కసారి మనం వాట్సాప్ స్టేటస్ లో వీడియో ని అప్ లోడ్ చేస్తుంటాం కానీ అందులో గమ్మత్తుగా వీడియో కాకుండా ఓన్లీ ఆడియో ని ప్లే అవ్వాలి అంటే ఒకటి ఉంది. అదేంటంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే టాప్ లో మనకి ఎడిటర్  ఆప్షన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇ అందులో ఏదో ఒక కలర్ ని సెలెక్ట్ చేసి మన వీడియో స్క్రీన్ పైన రెండు ఫింగర్స్ తో లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీడియో మొత్తం మనం సెలెక్ట్ చేసిన కలర్ లోకి మారిపోతుంది. సో వీడియో కాకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినపడుతుంది.

10.Send whatsapp an messages through Google Assistant :

కొంతమందికి వాట్సాప్ లో మెసేజ్ ఎలా చేయాలో తెలియదు, మరికొంతమందికి చదువు సరిగా  రాకపోవడం వల్ల వాట్సాప్ లో మెసేజ్ లను సెండ్ చేయలేరు. ఇలాంటి వారి కోసం ఒక సూపర్ ట్రిక్ తెలుసుకుందాం. మనం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ ను చేయవచ్చు అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఓకే గూగుల్ అని కమాండ్ ఇచ్చిన తర్వాత సెండ్ వాట్స్ అప్ మెసేజ్ అని చెప్పాలి.  వెంటనే గూగుల్ అసిస్టెంట్ ఎవరికి వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయాలో వాళ్ల పేరు అడుగుతుంది. మనం పేరు తర్వాత మెసేజ్ చెప్తే ఆటోమేటిక్గా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వాళ్లకు వాట్సాప్ మెసేజ్ ను సెండ్ చేస్తుంది.

11.Recover Deleted WhatsApp messages :

 కొన్ని సందర్భాల్లో మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ లు అవతలి వ్యక్తి మీరు చదవకుండానే డిలీట్ చేస్తూ ఉంటారు. మరి అతను ఏం సెండ్ చేశారు మనకు తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకోసం వాట్సాప్ లో ఇలాంటి ఆప్షన్ లేదు, కాబట్టి మనం ఒక చిన్న అప్లికేషన్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దానిద్వారా అవతలి వ్యక్తి మన వాట్స్అప్ లో పంపించిన ఇలాంటి మెసేజ్ అయినా సరే అది ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, మరేదైనా డాక్యుమెంట్ కావచ్చు అన్నీ కూడా డిలీట్ అయిన తర్వాత కూడా తిరిగి మనం చూసుకోవచ్చు. కింద ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. 

Download APK 

12.Send private reply to a person in group :

 వాట్సాప్ గ్రూపు లో నుండి మనకు చాలా మెసేజెస్ వస్తుంటాయి. అందులో మనం కొన్నిటికి మాత్రమే రిప్లై ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రిప్లై అనేది పర్సనల్గా ఇవ్వాల్సి వస్తుంది, అలాంటి సందర్భాల్లో గ్రూపులో మన ఫ్రెండ్ పెట్టిన మెసేజ్ కి ప్రైవేట్ గా రిప్లై ఇవ్వచ్చు. అదెలాగంటే.. 

Long press on message > click on menu ( 3 dots on top ) > select private reply

13.Convert audio into text :

వాట్సప్ లో మనకు వచ్చిన ఆడియో రికార్డ్ ని చాలా ఈజీగా టెక్స్ట్ లోకి మార్చుకోవచ్చు. ఇది చాలా సందర్భాల్లో మనకు ఉపయోగపడే  గొప్ప ట్రిక్. ఒక్కోసారి మనం ఆడియో రికార్డ్ ని ప్లే చేసి వినలేం అలాంటి సందర్భాల్లో ఇది పనికొస్తుంది. అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. అందులో మనం ఎలాంటి సెట్టింగ్స్ చేయాల్సిన పనిలేదు, సింపుల్ గా మీరు వాట్సాప్ ని ఓపెన్ చేసి  ఎవరి వాయిస్ రికార్డ్ ని టెక్స్ట్ బుక్ లో మార్చాలి అనుకుంటున్నారు దానిపై లాంగ్ ప్రెస్ చేయండి. వెంటనే షేర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి transcribe అప్లికేషన్ ను క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీ వాయిస్ టెక్స్ట్ లోకి మారిపోతుంది. లింక్ కోసం కింద క్లిక్ చేయండి. 

Download APK

14.hide secret chats :

మీ పర్సనల్  చాటింగ్ ని దాచుకోవడానికి ఒక మంచి ఆప్షన్ వాట్సాప్ లోనే ఉంది. సింపుల్ గా మీరు ఎవరి  చాటింగ్ ని హైడ్ చేయాలి అనుకుంటున్నారో దానిపై లాంగ్ ప్రెస్ చేయండి.టాప్ లో లో మనకు archive  ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మీ ఫ్రెండ్ చాటింగ్ hide అయిపోతుంది. మళ్లీ మీరు ఆ చాటింగ్ చూడాలి అనుకున్నట్లయితే మీ వాట్సాప్ మెసేజ్ మొత్తాన్ని కిందవరకు scroll చేసేయండి, అక్కడ మీకు archived  అని కనబడుతుంది. తద్వారా మీరు మళ్లీ ఆ చాటింగ్ ని unhide కూడా చేయవచ్చు. 

15.Lock a specific whatsapp chat :

ఎప్పుడైనా  మన వాట్సాప్ మెసేజ్ లను  ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ  చూసినప్పుడు కొన్ని చాటింగ్ లను మనం సీక్రెట్ లాక్ వేసుకోవచ్చు.ఒక చిన్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని  పర్సనల్ చాట్ లను లాక్ చేసుకోవచ్చు. చాటింగ్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి భయం లేకుండా మన మొబైల్ ఎవరికైనా ఇవ్వవచ్చు. అప్లికేషన్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

Download APK

ఫ్రెండ్స్ Whatsapp కి సంభందించి  పైన చెప్పిన ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. కొత్త ఫీచర్ వచ్చిన వెంటనే ఒక్కొక్కటిగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను.ఇంకా మీకు whatsapp tricks 2019 కి చెందిన ఎలాంటి  డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో రాయండి. తప్పకుండ వాటికీ నేను ఆన్సర్స్ ఇస్తాను. థాంక్స్ for visiting.