Top 25 Telugu Movies Of The Decade – 2010 To 2019

0

Top 25 Telugu Movies Of The Decade/Top 25 best movies of all time in Telugu :

1.ఏ మాయ చేసావే – 2010

ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అబ్బాయి హిందువు, అమ్మాయి క్రిస్టియన్. ఇక్కడి హీరో కు డైరెక్షన్ చేయాలని పిచ్చి, మరి హీరోయిన్ ఏమో సినిమాలు చూడదు. మరల హీరో కంటే హీరోయిన్ వయసులో పెద్దది. మూవీ రిలీజ్ టైం లో జనం ఎంతగా ఇష్టపడ్డారు అంటే ఈ సినిమాని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ తో సినిమా అదిరిపోయింది. టోటల్గా ఏం మాయ చేసావే గుర్తుండిపోయేలా నిలిచిపోయింది.

2. రక్త చరిత్ర – 2010

క్రైమ్, వైలెన్స్, పవర్, పాలిటిక్స్, యాక్షన్ మరియు ఫ్యాక్షన్ అన్ని కలిపిన పరిటాల రవి జీవిత చరిత్ర. ఇలాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ చూపించినట్లుగా మరెవరూ చూపించలేదు. క్యాపబులిటీతో మాగ్నెటిజం కూడా చేయడం ఎవరి వల్ల కాలేదు. ఒక విధంగా చూసుకుంటే మంచి కమర్షియల్ సినిమా ఇది.

3. వేదం – 2010

జనరల్గా ఏ హీరో, హీరోయిన్ అయినా మల్టీ స్టారర్ సినిమా కంటే ఒప్పుకోరు.కానీ ఈ సినిమాకు ఒప్పుకున్నారు అంటే ఆ కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ నాగయ్య ఇలాంటి అందరినీ కలుపుకొని చివర్లో ఎండింగ్ పాయింట్ లో అందరినీ కల్పిన సీన్ ఇది చాలా అద్భుతంగా చేయడమైనది. ఈ సినిమా కంటతడి పెట్టించింది. అన్నిటికీ మించి క్లైమాక్స్ సూపర్గా క్రియేట్ చేశారు.

4. దూకుడు – 2011

గడిచిన పది సంవత్సరాల్లో మహేష్ బాబు ఇంత కామెడీగా ఏ సినిమాలోనూ నటించలేదు. అన్ని ఎమోషన్స్ తో కలిపి తీసిన ఫర్ఫెక్ట్ మూవీ ఇది. మాస్ కు, ఫ్యామిలీ ఆడియన్స్ కు అందరికీ నచ్చిన సినిమా ఇది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వేరియేషన్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది.

5. పిల్ల జమిందార్ – 2011

డబ్బు కన్నా మానవత్వం చాలా గొప్పది అని అభిప్రాయం ఏర్పడినటువంటి సినిమా ఇది.ఈ సినిమా ఎక్కడో తెరమీద జరుగుతున్నట్లుగా ఉండదు. మన కంటి ముందర, మన పక్కింటి ఎదురుగా జరిగిన సంఘటనలు మనకు గుర్తు చేస్తుంది.హాస్టల్ లైఫ్, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, హీరో క్యారెక్టర్ ఇలా ప్రతిదీ మనకంటి ఎదురుగా జరుగుతున్నట్టుగా క్రియేట్ చేశాడు డైరెక్టర్. నాని ఫర్ఫార్మెన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా స్క్రీన్ కు స్టిక్ అయ్యేలా అద్భుతంగా మలిచారు.

6. ఈగ – 2012

అద్భుతమైన గ్రాఫిక్స్ తో, రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ గా నిలిచింది. ఈ సినిమాలో నటనకు పర్ఫార్మెన్స్ తో పాటు జక్కన్న ఐడియాస్ కూడా చెప్పుకోదగినవి. ఒక చిన్న ప్రాణి అయిన ఈగతో రివేంజ్ తీసుకునే విధంగా ఇంత మంచి సినిమా తీసి నిరూపించి రాజమౌళి మజాకా అనిపించాడు.

7.స్వామి రా రా – 2013

గడిచిన పది సంవత్సరాల్లో వచ్చిన సినిమాలు అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్ ఏదంటే స్వామి రా రా. ఎందుకంటే ఈ సినిమాతోనే ఆడియన్స్ కొత్తరకమైన సినిమాలను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అనే భావన అందరికీ వచ్చింది. యంగ్ ఫిల్మ్మేకర్స్ కు మంచి ధైర్యాన్ని ఇచ్చింది ఈ మూవీ. మోడ్రన్ క్రైమ్ కామెడీ గా పేరు తెచ్చుకుంది.

8.ప్రేమకథాచిత్రం – 2013

మొట్టమొదటిగా కామెడీ ప్లస్ హర్రర్ తో మొదలైనటువంటి సినిమా అంటే ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమా ఆధారంగా చిత్ర పరిశ్రమలో లెక్కలేనన్ని సినిమాలు రావడం జరిగింది. వచ్చినా కూడా అవన్నీ మంచి విజయం తో దూసుకెళ్లడం కూడా జరిగిపోయింది.ఈ సినిమా చేసినంత ఎంటర్టైన్మెంట్ వేరే ఏ సినిమా చేయడం లేదు అనేది ఫ్యాక్ట్. ఇందులో సప్తగిరి కామెడీ ఎక్కడికో తీసుకెళ్ళి పోయింది. జనాలు పడి పడి నవ్వడం జరిగింది. ఈ సినిమా మారుతి ఇమేజ్ నే మార్చివేసింది.

9. 1 నేనొక్కడినే – 2014

ఎక్స్పెరిమెంట్స్ పరంగా ప్రస్తావన వచ్చే సినిమాల్లో ఎవరిని అడిగినా చెప్పేది వన్-నేనొక్కడినే. మహేష్ బాబు చాలా ఎమోషన్స్ తో నటించిన సినిమా ఇది. ఇది ఎందుకు ఇంత స్పెషల్ మూవీ అంటే ఈ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ మూవీ విడుదలైన తర్వాతనే యంగ్ స్టార్స్ అందరూ కూడా ఇలాంటి సినిమాలు తీయడం మొదలు పెట్టారని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫంక్షన్ లో గొప్పగా చెప్పడం జరిగింది.

10. మనం – 2014

విక్రమ్ డైరెక్షన్ లో వచ్చినది. చాలా సింపుల్ స్టోరీని చాలా గొప్పగా మలచడం జరిగింది.అక్కినేని నాగేశ్వరరావు గారు వెండితెరమీద చివరిసారిగా తన మెరుపులు మెరిపించి నటువంటి చిట్టచివరి సినిమా. కాన్సెప్ట్ అంతా చాలా ఎమోషనల్ గా, ఫ్రీ ఫిక్స్డ్ గా నిర్మించినటువంటి మూవీ ఇది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా క్యూట్ గా ఉంది.

11.ఊహలు గుసగుసలాడే – 2014

ఇంటిల్లిపాదీ కూర్చుని నవ్వుకుంటూ చూడగలిగే సినిమా ఏదంటే నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ సినిమా పేరు. రాశిఖన్నా, నాగశౌర్య ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశారు కానీ ఈ సినిమాలో బెస్ట్ ఆల్టర్నేటివ్ గా చేయడం జరిగింది. ఈ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే అవసరాల శ్రీనివాస్ యొక్క బెస్ట్ డైలాగ్ పెర్ఫార్మెన్స్.

12.ఘాజి – 2017

సబ్ మెరైన్ తో పోరాటం, మిక్స్డ్ ఆఫ్ పేట్రియాటిజం. డైరెక్టర్ శంకర్ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు తెచ్చుకునేలా చేసింది ఈ మూవీ. అయితే ఈ సినిమాలో రానా ని మనం ప్రత్యేకంగా అభినందనలు చేయాల్సిందే.

13. బాహుబలి 1 & 2 :-

బాహుబలి గురించి ఎంత చెప్పినా సరిపోదు ఎందుకనేది నాకంటే మీకే బాగా తెలుసు. ప్రభాస్, రానా ఆధిపత్య పోరులో సినిమా కథ మొత్తాన్ని బ్రహ్మాండంగా నిర్మించిన చిత్రం ఇది. జక్కన్న గా పేరు తెచ్చుకున్న రాజమౌళి యొక్క కీర్తి ప్రతిష్టలు మన భారతదేశానికి దక్కేలా, ప్రపంచ దేశాల దృష్టి మన మీద పడేలా చేసిన చిత్రం.

14. శ్రీమంతుడు – 2015

కమర్షియల్ ఎలిమెంట్స్ తో, సోషల్ అవేర్నెస్ కలిపి తీసిన చిత్రమిది. ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. కొరటాల శివ తీసుకున్న కాన్సెప్టు విలేజ్ అడాప్ట్ అవేర్నెస్ అనేది ఎంత హైలెట్ అయ్యింది అంటే దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఎంతో మంది ఈ సినిమా చూసిన తర్వాత చిన్నచిన్న గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సంచలనం సృష్టించింది.

15.కుమారి 21ఎఫ్ – 2015

అనుమానం అనేది అబద్ధాలకు ఎలా దారితీస్తుంది అనేది కళ్ళకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. దర్శకుడు సుకుమార్ గారు మనలాంటి సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో ఓపెన్ గా ఉన్న అమ్మాయిల మీద ఎలాంటి చెడు అభిప్రాయం ఉంటుందనేది ఈ సినిమా ద్వారా ఆయన చూపిన ప్రత్యేకత. కుమారి పాత్ర ఎక్స్ లెంట్ పర్ఫార్మెన్స్ గా ఉంది.

16. గూడచారి – 2016

తనకు తగ్గ క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వడం లేదనే కోపం నుండి పుట్టుకొచ్చిన పాత్రతోనే ఈ సినిమా మొత్తం నడిచింది. అడవి శేష్ ఎక్స్ట్రార్డినరీగా నటించడం జరిగింది. గూడచారి లో ఒక తెలివైన యాక్టర్ గా నటించడం జరిగింది.

17. పెళ్లి చూపులు – 2016

షార్ట్ ఫిలిం మేకర్స్ యొక్క హవా ఈ సినిమాతోనే ఊపందుకుంది అని చెప్పవచ్చును. తరుణ్ తన డైలాగ్ డెలివరీ మార్చివేశాడు.ఉదాహరణకు ఈ సినిమాలో హీరోయిన్ బిజినెస్ చేద్దాం అనుకుంటుంది హీరో వద్దని చెప్పాలనుకుంటాడు.మ్యాక్సిమం ఇన్ తెలుగు సినిమాల్లో హీరోయిన్ పెళ్లి అయితే చాలు అని అనుకుంటుంది.

18. ఫిదా – 2017

చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వచ్చిన సినిమా ఫిదా. తన కెరీర్లోనే ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. భానుమతి క్యారెక్టర్ లో సాయి పల్లవి ఫర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. తెలంగాణ నేటివిటీతో ప్రేక్షకులందరికీ ఫిదా అయిపోయింది.

19. అర్జున్ రెడ్డి – 2017

సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సందీప్, అర్జున్ రెడ్డి ఒక డ్రగిస్ట్ తర్వాత కథ ఎలా మార్పు చెందేది అద్భుతంగా ఎక్స్ప్లైన్ చేసాడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి సజీవ పాత్రలో నటించాడు.

20. రంగస్థలం – 2018

నా రూటే సపరేటు అని డైరెక్టర్ మన సుకుమార్ గారు.విలేజ్ నేటివిటీని ఉట్టిపడేలా చూపించారు ఈ మూవీలో. టెక్నికల్ యాస్పెక్ట్స్ బ్రహ్మాండంగా మలచిన టువంటి చిత్రం. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉంది. ఇందులో ప్రతి దృశ్యము కూడా సంథింగ్ స్పెషల్ అనేటట్టుగా ఉంది.

21. మహానటి – 2018

అలనాటి మేటి నటి సావిత్రి యొక్క బయోపిక్ గా వచ్చిన చిత్రమిది. బయోపిక్ లాంటి వరుస చిత్రాలకు ఇది పునాది లాంటిదని చెప్పవచ్చు. ఈ సినిమాలో మహానటి తో పాటు మనం కూడా ఆనంద పడతాం, బాధపడతాం, చివరగా ఏడుస్తాం. కథను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు జీవం పోసేలా ఉంది.

22. కేరాఫ్ కంచరపాలెం – 2018

లవ్ అంటే రొమాన్స్ కాదు, నవరసాల సమ్మేళనం అనేది ఈ చిత్రాన్ని బట్టి చెప్పవచ్చు. ఈ సినిమా ప్రారంభం కాగానే మనకు కంచర పాలెం లోని పాత్రలతో మమేకం కావటమే గొప్ప ప్రత్యేకత. ఈ సినిమాలో కేవలం లవ్ అనేది ఒక పాయింట్ కాకుండా అనేక విషయాలను అద్భుతంగా తెలియజేయడమైనది. అన్ని సమస్యలకు హ్యుమానిటీ సొల్యూషన్ అని చెప్పడం జరుగుతుంది.ఈ సినిమాలో నటించిన ఎవ్వరు కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు కానీ వారి నటన ప్రతిభ చెప్పుకోదగ్గది గా ఉన్నది.

23. బ్రోచేవారెవరురా – 2019

 

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఒక చిన్న కాన్సెప్ట్ తో ఎవరూ ఊహించని విధంగా తీసిన సినిమా ఇది. సినిమా మరో ప్రత్యేకత వివేక్ సాగర్ యొక్క సంగీతం.ఏందో ఉంది అబ్బా ఈ యంగ్ ఫిలిం మేకర్స్ లో అనేటట్టుగా నిర్మించారు ఈ సినిమాని.ముఖ్యంగా ఎమోషన్స్ అన్నీ వేసి మిస్ కాకుండా భలేగా తీశారు.

24. జెర్సీ – 2019

నాని ని రొటీన్ పాత్రలు నుంచి బయటకు తీసి వేసి నటువంటి సినిమా. మనం ఎప్పుడు కూడా సినిమాల్లో సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుంటాం.కానీ ఈ సినిమాలో ఒక ఫెయిల్యూర్ స్టోరీ గురించి తెలుసుకుంటాం. ఒక తండ్రి తన కొడుకును హీరోగా చూడ్డానికి ఎటువంటి శాక్రిఫైజ్ చేసాడో ఈ సినిమా మనకు చూపిస్తుంది. బెస్ట్ క్లైమాక్స్ ఆఫ్ తెలుగు సినిమాగా ప్రత్యేకత తెచ్చుకున్నది.

25.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ – 2019

 

ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటన అద్భుతం.మన పేరెంట్స్ జనరేషన్లో చంటబ్బాయి.  సినిమా ఎలాంటిదో ప్రస్తుత జనరేషన్ లో ఈ సినిమా అలాంటిది.ఏ గుడ్ పొలిటికల్ డ్రామా ఎక్స్ట్రార్డినరీ ఫర్ఫార్మెన్స్ బై సాయి కుమార్.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి.