prithviraj audio tape reactoin :
- telugu actor prithviraj controversy పై ఓ విలేఖరి అడిగిన ప్రశ్న- ఆడియో కాల్ ప్రకారం అందులో ఉన్నది మీ వాయిస్ కదా అని విలేకరి అడిగాడు. దానికి పృథ్వీరాజు అది ఫేక్ అండి ఎందుకంటే లౌక్యం సినిమాల్లో ఒక షాట్ ఉంది ఆ షాట్లో మామూలుగా మేము డబ్బింగ్ చెప్పి మా ఊరికి వెళ్ళి పోతూ ఉంటాము. అయితే ఆ రోజు షాట్లో తీసిన ఒక సన్నివేశానికి ఒక చిన్న కరెక్షన్ చేయాల్సి వచ్చింది అప్పుడు వేరే వారిని తీసుకెళ్లి నాలాగా మాట్లాడించి అందులో సిస్టర్ క్యారెక్టర్ తెలుగు అమ్మాయా, కన్నడ అమ్మాయా అని వేరే ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించి నా మీదకు తోసేశారు.
ఆ తర్వాత నేను దాని మీద చాలా ఫైట్ చేసి పోరాడి ఇది నా వాయిస్ కాదని అప్పుడే నేను చాలా ఇబ్బందులు పడినాను. దానిమీద కమిటీ వేశారు కమిటీ కి కంప్లైంట్ చేశాను పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించాలని త్వరలోనే పూర్తి వివరాలు బయట పడే అవకాశం ఉంది.
- పద్మావతి గెస్ట్ హౌస్ లో మీరు తాగే నానా వీరంగం చేసి రైతులను దుర్భాషలాడారని చెబుతున్నారు దీని మీద మీ కామెంట్? నేను ఏ ఒక్క రైతు ని పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదు కానీ బినామీ రైతుల ని మాత్రమే అన్యాయం నేనొక్కడినే కాదు బొత్స సత్యనారాయణ గారు, రోజా గారు కూడా రైతుల గురించి మాట్లాడారు నా గురించి మాత్రమే ఇలా పెద్ద తతంగం చేస్తున్నారు. అన్నదాత అయిన రైతు అంటే నాకు చాలా భక్తి గౌరవం మీ సందర్భంలోనే రైతులందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.
- మీరు ఈ మధ్యకాలంలో అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు మీ కామెంట్? మీడియా మిత్రులారా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నిన్నమొన్నటి వరకు జరిగిన సంఘటనల వల్ల నా ఆరోగ్యం దెబ్బతిని రెస్టు తీసుకుంటున్నాను . మీరు ప్రెస్ మీట్ అనగానే మీ కోసమే నేను బెడ్ మీదనుంచి లేచి వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నాను. సత్య ప్రమాణంగా నేను ఎవరి మీదైనా ఏదైనా దుర్భాషలాడి ఉంటే ఇదిగో నా కాలు చెప్పు తీసుకుని మీరే అందరు నన్ను కొట్టండి. అనేక శక్తులు నా మీదికి ఒకటిగా వచ్చి ఈ విధంగా దాడి చేస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను.