టైఫాయిడ్ జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి ? ఈ జ్వరానికి నివారణ చర్యలు ఏమిటి !

0
Typhoid Fever In Telugu

టైఫాయిడ్ జ్వరం అంటే ఏమిటి ఈ జ్వరం ఎలా వస్తుంది ?

Typhoid Fever In Telugu :- కాలుష్యం అయిన నీరు లేదా ఆహార ప‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు వాటిల్లో ఉండే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వ‌రం వ‌స్తుంది. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ జీర్ణ‌వ్య‌వ‌స్థ నుంచి ర‌క్త ప్ర‌వాహంలోకి చేరుతుంది. ఫ‌లితంగా జ్వరం, త‌ల‌నొప్పి, క‌డుపునొప్పి, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వ‌స్తుంది.

టైఫాయిడ్ జ్వరం, ఎంటర్టిక్ ఫీవర్ పేగులకు సంభవిస్తుంది లేదా సంభవిస్తుంది అని కూడా పిలుస్తారు, ఇది గ్రామ్-నెగటివ్ బాక్టీరియం అయిన సాల్మొనెల్లా టైఫీ వలన కలిగే ఒక రకమైన బ్యాక్టీరియా సంక్రమణ. సంక్రమణ సాధారణంగా కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది.

టైఫాయిడ్ జ్వరం రావడానికి కారణాలు ఏమిటి  | Typhoid Fever Causes 

టైఫాయిడ్ జ్వరంకు ప్రధాన కారణమైన బ్యాక్టీరియా సాల్మొనెల్లా జాతికి చెందినవి. సాల్మొనెల్లా టైఫి మరియు సాల్మొనెల్లా పారాటిఫి. ఈ రెండు టైఫాయిడల్ సాల్మొనెల్లే తీసుకున్నప్పుడు మానవులలో తీవ్రమైన జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుందని అంటారు, అయితే టైఫాయిడ్ కాని సాల్మొనెల్లా గ్యాస్ట్రోఎంటెరిటిస్కే పరిమితం మరియు తీవ్రమైన లక్షణాలను కలిగించదు.

 • కలుషితమైన ఆహారాలు తినడం వలన.
 • కలుషిత నీరు తాగడం వలన.
 • వండని లేదా ఉడికించని ఆహారాలు అలానే తినడం.
 • సోకిన రోగుల ఫోమిట్స్.
 • పరిశుభ్రత లోపం.
 • టైఫాయిడ్ క్యారియల్లు.
 • పర్యాటకం.
 • లైంగిక సంభంధం.
 • మలం.
 • మూత్రం.

పైన పేర్కొన్న విధంగా వారి లక్షణాలు సమర్థవంతమైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందినప్పటికీ, అవి చాలా కాలం పాటు బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, లక్షణం లేకుండా ఉంటాయి మరియు వాటిని వారి మలం మరియు మూత్రంలో చిమ్ముతాయి, ఇవి మళ్లీ ఇతరులకు సోకుతాయి. దినివల టైఫాయిడ్ రావడానికి చాల అవకాశం ఉంది.

టైఫాయిడ్ జ్వరం లక్షణాలు ఏంటి | Typhoid Fever Symptoms

టైఫాయిడ్‌ ఫీవర్ ను చాలా సులభంగా గుర్తించవచ్చు. ఒళ్లువేడిగా అయిపోతుంది, తలనొప్పి, విపరీతమైన నీరసం వంటి లక్షణాలుంటాయి. అంతేకాదు జ్వరంలో తీవ్రత ఉంటుంది. అలాగే తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు ఉంటాయి.

కొంతమందిలో విరేచనాలు కాకుండా మలబద్దకం ఉoటుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే అది టైఫాయిడ్ గా గుర్తించాలి. టైఫాయిడ్ఎంటర్టిక్ ఫీవర్ పేగులకు సంభవిస్తుంది లేదా సంభవిస్తుంది అని కూడా పిలుస్తారు.

ఇది గ్రామ్-నెగటివ్ బాక్టీరియం అయిన సాల్మొనెల్లా టైఫీ వలన కలిగే ఒక రకమైన బ్యాక్టీరియా సంక్రమణ. సంక్రమణ సాధారణంగా కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది.

 • ఎక్కువ కాలం కొనసాగే జ్వరం
 • తలనొప్పి
 • వాంతులు
 • ఆకలి మందగించటం
 • మలబద్ధకం
 • అతిసారం
 • కడుపు నొప్పి
 • అలసట
 • ఆకలి లేకపోవడం
 •  చర్మ దద్దుర్లు
 • దగ్గు, చెమట
 • కడుపు వాపు మొదలైనవి లక్షణాలు…

టైఫాయిడ్ జ్వరం వచ్చినపుడు ఏమి తినకూడదు  

టైఫాయిడ్ జ్వరం వస్తే జీర్ణశక్తి తగ్గిపోతుంది. అందుకే త్వరగా జీర్ణం అయ్యే తేలికపాటి ఆహారాలు తినాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్‌ను పుట్టించే కొన్ని రకాల కూరగాయలు అంటే క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్‌ వంటివి అస్సలు తినకూడదు. అలాగే ఘాటులగా ఉండేవి అంటే ఉల్లి,వెల్లుల్లి వంటి కూడా తినకూడదు.

టైఫాయిడ్ జ్వరం వచ్చినపుడు ఎలాంటి ఆహరం తీసుకోవాలి 

టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు.  సోయా బీన్స్‌, వివిధ రకాల గింజలు నట్స్‌, భిన్న రకాలైన విత్తనాలు, గుడ్లు వంటివి తినాలి.

ఆలుగడ్డ వేపుడు, ఉడికించిన అన్నం వంటి కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పాలు, పన్నీర్‌ వంటి పాల ఉత్పత్తులు కూడా తినొచ్చు. అలాగే టైఫాయిడ్‌ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం మర్చిపోకూడదు.

టైఫాయిడ్ జ్వరం రాకుండా ఎలాంటి జాగ్రతలు పాటించాలి !

 • టైఫాయిడ్ వస్తే ఒంట్లో శక్తి హరించుకుపోతుంది.నీరసరం నిస్సత్తువ ఆవరిస్తుంది.
 • తరచు ఏదో ఒక ఆహరం తినాలని.
 • తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
 • ద్రవాహారాలు తరచుగా తీసుకోవాలి.
 • నీరసరం రాకుండా టైఫాయిడ్ సమయంలో శరీరంలో ఉండే నీటిశాతం హరించుకుపోతుంది. అలాగే జ్వరం తీవ్రతో చెమటపడుతుంది.
 • అలాగే వాంతులు విరేచనాలతో డీ హైడ్రేషన్ వస్తుంది, కాబట్టి ద్రవాహారాలు తప్పకుండా తీసుకోవాలి.
 • ఆ సమయంలో శరీరం చైతన్యవంతం చేయడానికి హైడ్రేట్ చేయడానికి మరియు ఎలెక్ట్రోలైట్ బ్యాలన్స్ కొనసాగించడానికి ఆరోగ్యకరమైన ద్రవాలను త్రాగాలి.
 • టైపాయిడ్ సమయంలో కొన్నిరకాల పదార్థాలు జీర్ణం కావు. కాబట్టి మెత్తగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా టైఫాయిడ్ కు పలు ఆహార జాగ్రత్తలు చాలా చాలా అవసరం.

మీకు గాని టైఫాయిడ్ జ్వరానికి సంభందించిన టాబ్లెట్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Typhoid Fever Tablet Online Link 

గమనిక :- పైన ఇచ్చిన టాబ్లెట్ మీరు వాడె ముందుగా వైదుడిని సంప్రదించిన తర్వాతే మీరు వాడండి.

గమనిక :- మీరు టైఫాయిడ్ కి సంభందించిన మందులు గని వాడితే, టాబ్లెట్స్ వాడె ముందు డాక్టర్ ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-