Table of Contents
ఉగాది పండుగ గురించి వ్యాసం | Ugadi Essay Writing In Telugu
Ugadi Festival Essay In Telugu :- చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాది రోజున సృష్టి జరిగిందని నారదుడు పురాణంలో తెలియజేశారు. వసంతం రుతువు ప్రారంభమైన చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడని పెద్దలు అంటారు.
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా చెప్పవచ్చు. పరిపాటి తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఉగాది జరుపుకుంటారు. కాబట్టి దీనిని తెలుగు నూతన సంవత్సరం అనికూడా అంటారు.
ఉగాది పండుగ రోజును ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ఈ పండుగ నాడు మహిళలు అందరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి,నూతన దుస్తులు వేసుకొని,ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి, దేవునికి పూజ చేసి, ఇంటిలో రకరకాల పిండి వంటకాలు చేసుకొని ఆనందంతో అందరు కలిసి భోజనం చేస్తారు.
ఉగాది పచ్చడి ఎలా చేయాలి | Ugadi Pachadi Ela Tayaru Cheyali
ఉగాది పండుగలో ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి, షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవాని కలిగి ఉంటుంది.
- ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి.
- అందులోకి కొద్దిగా బెల్లం తురిమి వేసుకోవాలి.
- బెల్లం వేసిన తర్వాత పచ్చిమిర్చి, వేపా పూత, మామిడి ముక్కలు, చిటికెడు ఉప్పు, చింత పండు రసం, వేసుకొని అందులోకి కొన్ని నీరు కలుపుకొని ఈ పచ్చడిని బాగా కలిపి దేవునికి నైవేధ్యంగా పెట్టిన తర్వాతే ఈ పచ్చడినికి మనం తినాలి. ఈ పచ్చడిని తినడం వలన ఆరోగ్యంగా ఉంటారు అని పెద్దలు తెలియచేస్తారు.
- ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు కలిగి ఉండాలి అవి :- తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు.
ఉగాది పండుగ విశిష్టత ఏమిటి ? Ugadi Panduga Visistatha
ఉగాది పండుగ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వివిధ రకాలుగా వివరించడం జరిగినది. అంది ఏంటో తెలుసుకుందాం.
సృష్టికర్త అయిన బ్రహ్మ. ఉగాది పండుగ రోజునే సృష్టిని ప్రారంభించాడు అని, ఆ నమ్మకం వలనే కొత్త సంవత్సరం ప్రారంభం అయిన దినంగా ఉగాది పండుగను జరుపుకొంటారు, అలాగే ఈ రోజునే ఉగాది అని పిలవడం జరిగింది.
పురాణ గ్రంధాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు గడిచింది అని. అలా మనం జరుపుకొనే ప్రతి ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుంది అని పురాణం ప్రకారం తెలియజేయడం జరిగినది.
పురాణ గాధల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు. తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణు మూర్తి మత్యవతారములో వెళ్లి సముద్రములో ఉన్న సోమకాసురుడుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు.
అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ద పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలు పెట్టారు. తెలుగు వారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుట అనేది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వస్తోంది.
ఉగాది పండుగ ఏ ఏ ప్రాంతాల్లో జరుపుకుంటారు | Ugadi Festival In Telugu
ఉగాది పండుగను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకొంటారు, తెలుగు ప్రాంతాలలో వివిధ రకాలుగా ఈ పండుగా యొక్క వేడుకలు జరుపుకుంటారు . ఈ పండుగ నాడు చనిపోయిన వారికి తమ వారసులు బట్టలు పెట్టుకొంటారు. ఇంటిలో చేసిన వంటకాలు అన్ని వారి సమాధి వద్దకు వెళ్లి సమర్పిస్తారు.
ఈ పండుగ నాడు గ్రామదేవతలకి అందంగా అలంకరణ చేసి ఊరు మొత్తం తిప్పుతారు, మరుసటి రోజు ఉదయాన్నే దేవతలకి జోతులు చేసి అమ్మవారి ముందుర నాట్యం చేస్తారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగని జరుపుకొంటారు.
ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ పండుగని జరుపుకొంటారు. బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పత్వాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్ లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు.
ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, దేవుడికి పూజ చేస్తారు , దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్బంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సంభ్యులందరు దానిని తింటారు.
నోట్ :- పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించినది, ఇది కేవలం మీకు అవగాహనా కల్పించడం కోసమే తెలియచెస్తున్నాం. ఇందులో మీకు సందేశాలు ఉంటె కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాం.
ఇవి కూడా చదవండి :-
- కరోనా గురించి వ్యాసం – Corona Virus Essay Writing In Telugu !
- సంక్రాంతి పండుగ గురించివ్యాసం -Sankranti Panduga Essay Writing In Telugu !