Ugadi Rasi Phalalu 2020- 12 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

0

Table of Contents

Ugadi Rasi Phalalu 2020

మన తెలుగువారి కోసం, తెలుగు ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూసే రాశి ఫలాలు మరియు గ్రహ ఫలితాలు. ఈ శ్రీ శార్వరి నామ ఉగాది పండుగకు వారి వారి జాతక ఫలాలు గురించి “తెలుగు న్యూస్ పోర్టల్ “ లో ఈ ఆర్టికల్ ను మీకోసం పోస్ట్ చేస్తున్నాం.

ప్రస్తుతానికి మొత్తం 12 రాశుల గురించి ఈ క్రింద వివరంగా తెలియజేశాం. ఒకవేళ మీకు ఏదైనా ఒక రాశి గురించి మాత్రమే పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉంటే కింద ఉన్నకామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము తప్పకుండా మీ కోసం పోస్ట్ చేస్తాం. మరి ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందామా!

రాబోయే ఉగాది ని శ్రీ శార్వరి నామ సంవత్సరం ( sri sarvari nama samvatsara ) గా పేర్కొంటారు. ఈ ఉగాది రోజున రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ పన్నెండు రాశుల రాశిఫలాలు వారి యొక్క ఆదాయవ్యయాలు మరియు వారి యొక్క రాజపూజ్యం అవమానాల గురించి తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటారు.

sri sarvari nama samvatsara panchangam

1.మేష రాశి:- (mesha rasi 2020 telugu panchangam)

  1. ఈ రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 గానే ఉన్నది. అంటే ఈ రాశి వారు ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది అన్న మాట. అంటే పొదుపు ఉండదు.
  2. ఇక రాజపూజ్యం 3 అవమానం 1.ఇక్కడ రాజపూజ్యం అంటే సమాజంలో మనం ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడిన మాటలను ముగ్గురు అభినందిస్తారు ఒకరు విమర్శిస్తారు అని అర్థం. అంటే మేష రాశి వారికి రాజపూజ్యం 3 ఉన్నందున వారికి గౌరవ మర్యాదలు ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తున్నది.
  3. ఇక అందరూ ఆలోచించే ఆదాయం గురించి చూస్తే ఇక్కడ 50,000 సంపాదిస్తే యాభై వేలు ఖర్చవుతుంది అనే రీతిలో ఉంది మేష రాశి వారికి. మరి దీని గురించి మేషరాశి వారు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి తగ్గట్లుగా పరిహార మార్గాలను కూడా పంచాంగ గ్రంథాలు తెలుపుతున్నాయి.ఈ పరిహారం మార్గాలను నిర్లక్ష్యం చేయకుండా మనం పాటించినట్లయితే మన ఆదాయ మార్గాన్ని కూడా తప్పకుండా పెంచుకోవచ్చు.
  4. మేష రాశి వారు వారి ఆదాయ మార్గం పెంచుకోవడానికి వారంలో ప్రతి బుధ మరియు శనివారం రోజున గోవుకు స్వయంగా మీరే బెల్లం తినిపించాలి. ప్రతి వారము ఈ పని చేయడానికి ఇబ్బందులు ఉన్నవారు కనీసం నెలలో ఏదైనా ఒక వారం రోజుల్లో బుధ మరియు శనివారం తప్పకుండా ఆవుకు బెల్లం తినిపించినట్లయితే వారి యొక్క ఆదాయ మార్గం తప్పకుండా పెరుగుతుంది.
  5. చాలామంది గోశాలకు వెళ్ళలేక గోవులను వెతకలేక ఎవరికో డబ్బులు ఇచ్చి ఈ పరిహారం మార్గాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఇది చాలా తప్పు , ఎందుకంటే స్వయంగా వెళ్లి బెల్లం మాత్రమే తినిపించాలి మరే ఇతర తీపి పదార్థాలు పెట్టినా కూడా ఈ పరిహారం వర్తించదు.గోవుకు బెల్లం తినిపించేటప్పుడు గోవుని సాక్షాత్తు విష్ణు రూపం తో భావించి భయము, భక్తి, గౌరవంతో తినిపించడం వలన దీని ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది.
  6. ఇక రెండవ పరిహార మార్గం ఏమిటంటే నెలలో ఏదైనా బుధ కానీ శనివారం నాడు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి మరియు పూలతో మాల గాని దండగా గాని మీరే స్వయంగా కుట్టి స్వామి వారి మెడలో వేయాలి. ఇలా చేయడం వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేష రాశి వారికి తప్పకుండా ఆదాయం మార్గం పెరుగుతుంది ఇందులో సందేహం లేదు.
  7. గ్రహసంచార పరిస్థితులను బట్టి మేష రాశి వారు ఈ రెండు పరిహార మార్గాలు పాటించితే వారి ఆదాయం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

2. మిధున రాశి:- (mithuna rasi 2020 telugu panchangam)

  1. మిధున రాశి వారికి ఈ శార్వరి నామ సంవత్సరంలో ఆదాయం 2 వ్యయం 11 గాను ఉన్నది. అంటే మిధున రాశి వారు 2000 సంపాదిస్తే పదకొండు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అర్థం.
  2. రాజపూజ్యం 2 అవమానం 4 గా ఉన్నది.అంటే మనం ఏదైనా విషయం మీద మాట్లాడితే మనల్ని పొగిడే వాళ్లు ఇద్దరు ఉంటే మనల్ని విమర్శించే వాళ్ళు నలుగురు ఉంటారు అని అర్థం.
  3. ఈ శార్వరి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఆదాయం చాలా తక్కువగా ఉన్నది. ఇందుకు మిధున రాశి వారు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి కొన్ని పరిహార మార్గాలు ఉన్నాయి. ఇవి తప్పకుండా పాటిస్తే వారి ఆదాయ మార్గం పెరుగుతుంది.
  4. వీరి పంచాంగం ప్రకారం గ్రహస్థితులు ఈ మిధున రాశి వారికి ఆదాయానికి ఇలా తోడ్పడుతున్నాయి అని అర్థం. గ్రహాలు అననుకూలం గా ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాల కు పరిహార మార్గం మనం చేయాలి.
  5. ముఖ్యంగా ఈ రాశివారు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా డబ్బులు పొదుపుగా వాడుకోవాలి.
  6. ఈ సంవత్సరం మిధున రాశి వారు ఉద్యోగ విషయంలో పొరపాటున కూడా వేరొక ఉద్యోగానికి మారకూడదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే ఎక్కువ జీతం వస్తుందనే ఆలోచనతో వేరే ఉద్యోగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు.

అనుకూలాలు:-

  • అయితే ఈ సంవత్సరం మిధున రాశి వారు భూమి మీద పెట్టే పెట్టుబడి భారీగా లాభాన్ని చేకూరుస్తుంది.
  • ఇంకా ఈ రాశి వారు జీవిత భాగస్వామిని కానీ వ్యాపార భాగస్వామ్యం కానీ ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.

మిధున రాశి వారికి పరిహార మార్గాలు:-

  • దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్లి శెనగలతో చేసిన ప్రసాదాన్ని పంచి పెట్టాలి.
  • రెండవ పరిహారంగా స్వచ్ఛమైన పసుపు కొమ్ములు కొని పిండి ఆడించి ఆ పసుపు పొడి తో శివునికి అభిషేకం చేయించాలి ఇలా నెలకు ఒక్కరోజైనా తప్పకుండా చేయించాలి.
  • ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితులను బట్టి మిధున రాశి వారు ఈ పని చేస్తే వారికి తప్పకుండా ఆదాయ మార్గం పెరుగుతుంది.
  • ఈ సంవత్సరం శని అష్టమంలో ఉండి గురువుతో కలిసి ఉంటాడు. రాహు కేతువులు లో కూడా గ్రహ మార్పులు జరుగుతాయి.
  • మూడో పరిహారం ఏమిటంటే గోశాల కు వెళ్లి గోవులకు అరటి కాయలను ముక్కలుగా చేసి పెట్టాలి. గోవుకు అరటికాయ ముక్కలు పెట్టేటప్పుడు గోవుని సాక్షాత్తు అమ్మవారు గా భావించి నైవేద్యం పెట్టాలి. ఇలా చేసినట్లయితే మీ ఆదాయం రెండు ఉన్నప్పటికీ కూడా మంచి లాభాలతో ఈ సంవత్సరం నడుస్తుంది.
  • ఇక అవమానం తగ్గాలంటే మన జాతకంలో మూడవ అధిపతి ఎవరు అనేది తెలుసుకోవాలి .
  • మీకు మూడవ అధిపతి రవి అవుతాడు కాబట్టి మీరు గోధుమలు దానం చేస్తే మీకు అవమానం తగ్గి రాజపూజ్యం పెరుగుతుంది.

3. వృషభ రాశి :- (vrishabha rashi 2020 telugu panchangam)

  1. ఈ శార్వరి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం ఇలా ఉంటాయి.
    ఆదాయం 14 వ్యయం 11 గా ఉంది.
  2. రాజపూజ్యం 6 అవమానం 1 గా ఉంది.మొత్తంగా ఈ రాశివారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే గ్రహసంచార పరిస్థితులను బట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
  3. వృషభ రాశి వారికి 9వ స్థానంలో శని సంచారం జరుగుతున్నది. గురువు యొక్క సంచారము కూడా ఉన్నది. అదేవిధంగా రెండవ స్థానంలో రాహు సంచారం అష్టమంలో కేతువు సంచారం ఉన్నది.

పరిహార మార్గాలు :

  • స్నేహితుల ద్వారా జరిగే కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా దూరప్రయాణాలు, దూరప్రాంతాలు  చూసి రావడానికి వెళ్లడం వంటి విషయాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి.
  • వీరికి సినిమా రంగంలో, క్రియేటివ్ ఫీల్డ్ లో చాలా బాగా కలిసి వస్తుంది.
  • సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం బాగా ఉంటుంది.
  • గోవులకు క్యారెట్స్ తినిపించడం వల్ల గ్రహ సంచార ఫలితాలు మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు.
  • గోవుకు క్యారెట్స్ తినిపించేటప్పుడు గోవుని కార్తికేయుని గా లేదా షణ్ముఖుని గా భావించి భక్తిభావంతో తినిపించినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చు.
  • ముఖ్యంగా స్నేహితులతో గడిపినప్పుడు వచ్చే అనవసర మనస్పర్థల నుంచి తొలగిపోవడానికి ఈ పరిహార మార్గం ఉపయోగపడుతుంది.
  • ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని రకాలుగానూ బాగుంది కానీ కేవలం గ్రహ సంచార ఫలితాలు ఒక్కటే జాగ్రత్తగా చూసుకోవాలి.

అనుకూలాలు:-

నూనె వ్యాపారం, ఇనుము వ్యాపారం చేసేవాళ్లు షేర్లలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్త వహించాలి.


4. సింహరాశి :- (simha rasi 2020 telugu panchangam)

  1. సింహ రాశి వారికి ఆదాయం 14 వ్యయం రెండు గా ఉంది. సింహ రాశి వారికి ఈ ఉగాది సంవత్సరం చాలా బాగుంది.
  2. రాజపూజ్యం 1 అవమానం 7 గా ఉంది.
  3. ఈ రాశివారు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడితే ఏడు మంది ఎదురుతిరిగి విమర్శించే అవకాశం ఉంటుంది.
  4. రాజపూజ్యం , అవమానం గురించి జాతక గ్రంథ రచయితలు ఎందుకు రాస్తారు అంటే ఎవరైనా సరే నోటిని అదుపులో పెట్టుకో కుండా ఎలాగంటే అలాగా మాట్లాడితే అవమానానికి గురి కావాల్సి ఉంటుందని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మీకు ఒక హెచ్చరికగా మీ జాతక ఫలాన్ని బట్టి ఇలా రాస్తారు.
  5. ముఖ్యంగా ఈ సంవత్సరం సింహ రాశి వారు అనవసరమైన విషయాలు అస్సలు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది.
  6. సింహ రాశి వారు ఈ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు.పూర్వీకుల ఆస్తి విషయంలో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి లేకపోతే పూర్వీకుల ఆస్తిని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది.
  7. భూమి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

సింహ రాశి వారు చేయాల్సిన దేవతార్చన:-

వీరు తప్పకుండా విష్ణు సహస్రనామాలు వినాలి. గోశాలకు వెళ్లి ముల్లంగి ని ముక్కలుగా కోసి తినిపించాలి తినిపించేటప్పుడు గోవుని లక్ష్మీ దేవతలా భావించి తినిపించాలి.


5.తులారాశి :- (tula rashi 2020 telugu panchangam)

  1. తులా రాశి వారికి ఆదాయం 14 వ్యయం 11 గా ఉంది.అంటే వీరు 14000 సంపాదిస్తే పదకొండు వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని అర్థం.
    ఇంకా 3000 పొదుపు మిగులుతుంది.
  2. రాజపూజ్యం 7 అవమానం 7 సమానంగా ఉంది.

తులా రాశి వారు ఈ సంవత్సరం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-

  • తులా రాశి వారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో కూడా క్రెడిట్ కార్డు వాడకూడదు.
  • బ్యాంకులకు సంబంధించిన లోన్ లకు అసలు వెళ్ళకూడదు.
  • ఏదైనా స్నేహితులకు సంబంధించిన గొడవలు విషయంలో, పోటీ పడే విషయాల్లో, కోర్టు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

అనుకూలాలు:-

  • తులా రాశి వారికి ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ విషయంలో బాగా కలిసి వస్తుంది.
  • పెండింగ్లో ఉన్న పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వస్తుంది. విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లే వారికి, విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారికి చాలా బాగా అనుకూలిస్తుంది.
  • అమ్మవారికి కానీ ఈశ్వరుడికి కానీ అన్నంతో అభిషేకం చేయాలి.
  • తులా రాశి వారు ఈ శార్వరి నామ సంవత్సరంలో ఇలా చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
  • తులా రాశి వారు గోశాల కి వెళ్లి బియ్యప్పిండి కి బెల్లపు ముక్కలు కలిపి గోవుకు తినిపించాలి.
  • ఇలా చేస్తే అప్పుల విషయంలో గానీ శత్రువుల విషయంలో కానీ ఇబ్బంది ఉండదు.

6.వృశ్చిక రాశి :- (vruschika rasi phalalu 2020 in telugu)

  1. ఈ రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 గా ఉంది. అంటే సంపాదన మరియు ఖర్చు రెండు సమానంగా ఉంటుంది.
  2. అవమానం 3 రాజపూజ్యం 3 గా ఉంది.

జాగ్రత్తలు:-

  • ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగేయాలి.
  • రాజకీయాల్లో అడుగుపెట్టేటువంటి వారు, సంతానంకోసం నిర్ణయం తీసుకునే వాళ్ళు,
  • క్రియేటివిటీ ఫీల్డులో ఉండే వాళ్ళు మూడో స్థానంలో శని ఉండడం వల్ల వీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా అడుగుపెట్టాలి.
  • మీ జీవిత భాగస్వామి గానీ వ్యాపార భాగస్వామిని గాని ఎంపిక చేసేటపుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
  • ఈ రాశివారికి గత సంవత్సరం వివాహం కాని వారికి ఈ సంవత్సరం మంచి అనుకూలమైన సంబంధాలు దొరుకుతాయి.

పరిహార మార్గాలు:-

  • ప్రతిరోజు సూర్యునికి ఆరాధన చేయడం ద్వారా వీరి యొక్క ఆదాయ మార్గం పెరుగుతుంది.
  • అదేవిధంగా కార్తికేయ లేదా కుమార స్వామి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో పూజలు, అర్చనలు చేయించాలి.
  • నెలలో మంగళ, సోమ, ఆదివారాల్లో తప్పకుండా పూజలు చేయించాలి.
  • గోవుకు బెల్లం ముక్కలను తినిపించాలి.
  • గోవుకు తినిపించేటప్పుడు గోవుని సాక్షాత్తు అమ్మవారు గా భావించి తినిపించాలి.

7. ధనస్సు రాశి :- (dhanush rasi phalalu 2020)

  1. ధనుస్సు రాశి వారికి ఈ శార్వరి నామ సంవత్సరంలో జాతకపరంగా ఆదాయము 8 వ్యయం పదకొండు గా ఉంది.
  2. రాజపూజ్యం 6 అవమానం 3 గా ఉంది.
  3. ఈ రాశివారు వ్యయం ఎక్కువ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఆదాయం పెంచుకునే మార్గాలు చూసుకోవాలి.

జాగ్రత్తలు:-

  • ధనుస్సు రాశి వారికి రెండవ సంచారంలో శని తిరుగుతున్నాడు.
  • వస్తు వాహనాల కు సంబంధించి భూమికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులైతే కొంత వరకు వారి చదువుల విషయాల్లో బద్ధకం లేకుండా చదువు పెండింగ్ పెట్టుకోకుండా జాగ్రత్త పడేవారు చదువును పూర్తి చేసుకోవాలి.
  • పోటీ పరీక్షల విషయంలో ఈ రాశి వారు చాలా బాగా పార్టిస్పేట్ చేస్తారు.
  • శని మరియు గురువు ఇద్దరూ కూడా రెండవ సంచారం చేస్తూ ఉండడం వల్ల వీరికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి.
    వివాహ ప్రయత్నాలు సఫలమౌతాయి.

పరిహార మార్గాలు:-

  • లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి.
  • గోవుకు గరికను తినిపించాలి ప్రతి మంగళ మరియు బుధవారం ఇలా తినిపించాలి వీలు కాకపోతే కనీసం నెలకు ఒక రోజైనా తినిపించాలి. ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఆదాయ మార్గం పెరుగుతుంది.
  • వస్తు, వాహన, భూములు వంటి విషయాలలో కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.

8. కన్య రాశి :- (kanya rashi 2020 in telugu)

  1. ఈ శార్వరి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 2, వ్యయం11 గా ఉంది.
  2. రాజపూజ్యం 4 అవమానం 7 గా ఉన్నది. ఈ రాశి వారికి ఆదాయం తక్కువ గా ఉంది కాబట్టి
  3. వీరు ఆదాయ మార్గం తప్పకుండా పెంచుకోవాలి. ఇందుకోసం కొన్ని మార్గాలు ఉన్నాయి.
  4. శివాలయానికి వెళ్ళి శివుని సమక్షంలో విష్ణు సహస్రనామాలు దాదాపు 25 లేదా  30 నిమిషాలు వినాలి (You tube లో డౌన్లోడ్ చేసి ఇయర్ ఫోన్స్ ద్వారా వినాలి లేదా చదవాలి.
  5. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. రెండవది గోశాలకు వెళ్లి గోవు కు గోంగూర ప్రతి బుధ లేదా శనివారాల్లో తినిపించాలి.
  6. ఇలా తినిపించేటప్పుడు గోవుని సాక్షాత్తు అమ్మవారి గా భావించి తినిపించాలి. ఇలా చేస్తే తప్పకుండా ఆదాయం మార్గం పెరుగుతుంది.
  7. రాజపూజ్యం 4 అవమానం-7 గా ఉంది.నలుగురిలో నిలబడి మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడిన ఆ విషయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఈ విషయం తెలుపుతుంది.

కన్యా రాశి వారికి జాగ్రత్తలు :-

  • వ్యాపార భాగస్వాములను చేర్చుకునే విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయాలి.
  • క్రియేటివ్ ఫీల్డ్, టీచింగ్ ఫీల్డ్, లా రిలేటివ్ ఫీల్డ్ మరియు పూజా సామగ్రి దైవ కార్యానికి సంబంధించిన వస్తువులు అమ్మే వాళ్ళు వీటికి సంబంధించిన ఆదాయ మార్గాల్లో ఉండే వారికి ఎలాంటి సందేహం లేకుండా ఆదాయ మార్గం పెరుగుతుంది.

9. కర్కాటక రాశి :- ( karkataka rasi phalalu 2020 )

  1. ఈసారి శార్వరి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 11 వ్యయం 8 గా ఉంది.
  2. రాజపూజ్యం 5 అవమానం 4 గా ఉన్నది.
  3. కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతోంది అలాగే గురువు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  4. సంతానంకోసం ప్రయత్నించేవారు ఆగస్టు కంటే ముందే చేస్తే మంచిది.
  5. ఒకవేళ ఆగస్టు తర్వాత ప్రయత్నం చేసేవారు గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేయాలి.
  6. దూరప్రయాణాలు, విదేశీయానం వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి.
  7. తొమ్మిదవ ఆధిపత్యంలో శని సంచారం ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దేవతార్చనలు, పూజలు చేయాలి.

పరిహార మార్గాలు:-

  • కర్కాటక రాశి వారు కందులు మరియు కందులతో తయారు చేసిన ఏదైనా తీపి పదార్థం లేదా కందులను నేరుగా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
  • గోశాలకు వెళ్లి గోవుకు క్యారెట్లు తినిపించాలి.
  • కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు అవుతాడు కాబట్టి క్యారెట్లు తినిపించడం వల్ల మంచి పరిహారం జరుగుతుంది.
  • ఇంకా పెసలు దానం చేసినట్లయితే అవమానించే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది.

10. కుంభ రాశి :- ( kumbha rasi phalalu 2020) 

  1. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి పంచాంగం ప్రకారం ఆదాయం 11 వ్యయం 5 గా ఉంది.
  2. రాజపూజ్యం 5 అవమానం 6 గా ఉంది.
  3. కుంభ రాశి వారికి శని ,రాహు కేతు సంచారం ని బట్టి ముఖ్యంగా వీరు (ధనం ) డబ్బులు విషయంలో ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.
  4. లాభం వస్తుందని ఎవరో చెప్తే వెంటనే ఆలోచించకుండా పోయి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు.
  5. లైఫ్ పార్ట్నర్ కానీ , వ్యాపార భాగస్వామిని కానీ ఎంపిక చేసుకునేటప్పుడు వీరు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  6. రియల్ ఎస్టేట్, వాహనాల కొనుగోలు విషయాల్లో చాలా మంచి ఫలితం చక్కగా ఉంది.
  7. ఉన్నత చదువులు, కాలేజీలు, ప్రైవేట్ స్కూల్ నడిపే వారికి ఈ సంవత్సరం మంచి ఆదాయం ఉంటుంది.

జాగ్రత్తలు:-

  • కార్తికేయ స్వామి ప్రతిమను పెట్టుకుని ప్రతి రోజు అభిషేకం చేయాలి లేదా అయ్యప్ప స్వామి బొమ్మను పెట్టి అభిషేకం చేయాలి నెయ్యి తో గాని పాలతో గాని పంచామృతంతో గాని అభిషేకం చేస్తే కుంభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది.
  • గణపతికి తర్పణ చేసినట్లయితే అవమానం తగ్గి ఆదాయం పెరుగుతుంది
  • గోశాల కి వెళ్లి గోవుకు పిండితో చేసిన పదార్థాలు, బెల్లం ముక్కలు , బియ్యం పిండి కలిపి ఉండలు చేసి తినిపించాలి నెలలో ఒక రోజు ఇలా చేస్తే అవమానాలు తగ్గి ఆదాయం పెరుగుతుంది.
  • కార్తికేయ, అయ్యప్ప స్వాముల ను మనసులో ప్రతిష్ఠించి ధ్యానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.

11.మకర రాశి :- ( makara rasi 2020 in telugu ) 

  1. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మకర రాశి వారికి వారి పంచాంగం రీత్యా ఆదాయం 11 వ్యయం 5 గా ఉంది.
  2. రాజపూజ్యం 2 అవమానం 6 గా ఉంది.
  3. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  4. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  5. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు.
  6. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి వాళ్లు అనుకున్నది సక్సెస్ అవుతుంది.
  7. వీరికి అవమానం తగ్గాలి అంటే మూడు లో శని సంచారం ఉండడం వల్ల వీరు శని భగవానునికి దానం చేయాలి. తెల్ల నువ్వులు దానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల నువ్వులు దానం చేయకూడదు.
  8. ముఖ్యంగా ఈ రాశి వారికి నిందలు తగ్గాలి మరియు అవమానం తగ్గాలి అంటే గోవుకు బెల్లం తినిపించాలి. ఆదాయం పెరగాలంటే తెల్లటి పుష్పాలతో శ్రీ విష్ణువును ఆరాధించాలి.
  9. ధనాదాయం తప్పకుండా పెరుగుతుంది.
  10. తోబుట్టువులతో చాలా జాగ్రత్త వహించాలి.
  11. గోశాల కి వెళ్లి గోవుకు బెల్లం తినిపించేటప్పుడు ఆ గోశాలలో గోవు ముందు కూర్చుని పదినిమిషాలు వెంకటేశ్వర నామాలు జపించాలి. దీనివల్ల చక్కటి శుభ ఫలితాలు అందుతాయి.

12. మీన రాశి :- ( meena rasi 2020 panchangam telugu )

  1. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మీన రాశి వారికి వారి యొక్క జాతకం రీత్యా ఆదాయం 8 వ్యయం 11 గా ఉంది. ఇక
  2. రాజపూజ్యం 1 అవమానం 2 గా ఉంది.
  3. మీన రాశి వారికి వ్యయం 11 గా ఉండడం వల్ల వీరి ఆదాయం పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

జాగ్రత్తలు:-

  • అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.
  • మనల్ని అవమానించే వాళ్ళిద్దరు ఉన్నారు మనల్ని ప్రశంసించే వారు ఒక్కరు మాత్రమే ఉన్నారు కాబట్టి నలుగురు కలిసినప్పుడు మనం ఏదైనా ఒక విషయం మాట్లాడాలా వద్దా అనేది సొంత నిర్ణయం తీసుకోవాలి.
  • అనవసరంగా ఖర్చు పెడితే అప్పుల పాలు కావాల్సి వస్తుంది.
పరిహార మార్గం:-
  1. మీన రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
  2. ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయాల్లో, దూరప్రయాణాల విషయాల్లో జాగ్రత్త ఉండాలి.
  3. ఫిక్స్డ్ డిపాజిట్లను తీసివేసి అప్పుగా ఇస్తే వెనక్కి రావు కాబట్టి అప్పు లో విషయం లో చాలా అలెర్ట్ గా ఉండాలి.
  4. ఇన్సూరెన్స్ విషయాల్లో, అన్నదమ్ముల ద్వారా మరియు వ్యాపారంలో తప్పకుండా లాభాలు కలుగుతాయి.
  5. పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వస్తుంది.
  6. మూలధనం మిత్రులకి అప్పుగా అసలు ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే వసూలు చేయడం ఇబ్బంది అవుతుంది.
  7. దత్తాత్రేయ యొక్క ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పఠించాలి.
  8. శనగపిండితో చేసిన లడ్డులు 20 లేదా 25 తయారు చేసి వాటిని నైవేద్యంగా పెట్టాలి.
  9. దక్షిణామూర్తి ఆలయాల్లో పిల్లలకు, పెద్దలకు ప్రసాదంగా పంచి పెట్టాలి. ఇలా చేస్తే తప్పకుండా ఆదాయం పెరుగుతుంది.
  10. పసుపు ఎరుపు రంగు పూలతో మీరే స్వయంగా మాల కట్టి దక్షిణామూర్తికి మాలగా వేయాలి.
  11. ప్రతి గురువారం నాడు గోవుకు లేదా ఆదివారం అయినా సరే క్యారెట్లు తినిపించాలి.
  12. వీలుకానప్పుడు మంగళవారం అయినా సరే గోవుకు క్యారెట్లు తినిపిస్తే తప్పకుండా ఆదాయం పెరుగుతుంది అవమానం తగ్గుతుంది.
  13. దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకుంటూ ధ్యానం చేయడం వల్ల అవమాన భారం తగ్గి పోతుంది.
  14. ఇలా చేస్తే తప్పకుండా నూటికి నూరుపాళ్లు ఆదాయం పెరిగి అవమానం తగ్గుతుంది. అయితే మెడిటేషన్ తప్పకుండా గోశాల లోనే చేయాలి.
  15. సకల దేవతలు గోవులో ఉంటారని మీకు మనకు తెలుసు కాబట్టి గోశాలలో చేయడం వల్ల మనలో ఉండే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా మీన రాశి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

సర్వే జనా సుఖినోభవంతు

మన తెలుగు వారి కోసం తెలుగువారి “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్” లో మొట్టమొదటిగా మీకోసం 12 రాశుల గురించి తెలియజేశాము.ఇక్కడ మీకు ఎవరికైనా ప్రత్యేకించి ఏదైనా ఒక రాశి గురించి పూర్తి వివరాలు కావాలంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము ప్రత్యేకంగా ఆ రాశి గురించి మాత్రమే ఈ కొత్త తెలుగు సంవత్సరమంతా ఆ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మీకు పోస్ట్ చేస్తాం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు వాట్సాఫ్ మరియు ఫేస్బుక్ ల ద్వారా తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాం.