Ujjwala yojana free gas cylinder : కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం కింద ఒక లక్షా 60 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకున్నది. ముఖ్యంగా ఇందులో భాగంగానే ఎవరైతే వంట చేయడానికి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో అలాంటివారికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నది.
ఉచితంగా ఈ మూడు సిలిండర్లు ఎవరికి ఇస్తారు ?
ఉదాహరణకు కృష్ణా జిల్లా కంకిపాడు కు సంబంధించి అర్హుల జాబితాను గుర్తించడం జరిగింది. మొత్తంగా కృష్ణాజిల్లాలో 22 లక్షల మంది గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తుండగా 12,433 మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది.
అర్హులను ఎలా గుర్తించారు:-
ఎవరైతే ఉజ్వల పథకం కింద గ్యాస్ ను ఉపయోగిస్తున్నారో అలాంటి వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రకారం వారికి ఉచితంగా ఇవ్వబోతున్నారు.అయితే చాలా మందికి అనుమానంగా ఉంది ఏ నెలకు సంబంధించి ఈ గ్యాస్ ను ఉచితంగా ఇవ్వబోతున్నారు అనే విషయం మీద ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి గ్యాస్ సిలెండర్లను అర్హులైన వారికి ఉచితంగా ఇవ్వబోతున్నది. ఇలా మూడు నెలలకు మూడు సిలిండర్లు ఉచితంగా రాబోతున్నాయి. అర్హులుగా ఎంపికైనవారు ఈ మూడు సిలిండర్లు కు సంబంధించి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
షరతులు:-
ఇందులో భాగంగా ఒక నెలకు సంబంధించి మొదటగా ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తేదీ నుంచి సరిగ్గా పదిహేను రోజులకు మరొక సిలిండర్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయి. ఏమనగా ఎవరైతే తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ శాఖ వారు దీనికి సంబంధించి వివరణ అడిగితే ఎవరైతే వంటగ్యాస్ కోసం ఉజ్వల యోజన పథకం కింద రిజిస్టర్ చేయించుకున్నారో వారికి మాత్రమే ఉచితంగా ఈ మూడు సిలిండర్లు రాబోతున్నాయని వాళ్ళు వివరంగా తెలియజేయడం జరిగింది.
ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు అని కూడా తెలిపింది.ఈ ఉచితం అనేది కూడా కేవలం ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి మాత్రమే వర్తిస్తుందని మిగిలిన ప్రతినెల ఉచితంగా ఇవ్వడం జరగదని కూడా తెలియజేశారు. ఉదాహరణకు ఏ జిల్లా కి సంబంధించి ఆ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కోసం ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో అలాంటి వారందరికీ కూడా తప్పనిసరిగా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు.
Some Useful Links :
- మీకు జన్ధన్ అకౌంట్ ఉందా? అయితే మీరు డబ్బులు డ్రా చేయలేరు?
- మీ EMI లు కట్టాలా వద్దా ? పూర్తిగా తెలుసుకోండి. లేదంటే చాలా నష్టపోతారు