Vegetable soup health benefits in telugu : సాధారణంగా మనం ఇళ్లలో కూరలు చేసుకునే టప్పుడు కుక్కర్లో వేసి కూరలు ఉడికిస్తూ ఉంటాము. కుక్కర్ లో కూరగాయలు ఉడికించిన నీళ్లను మీరు బయటకు పార వేస్తారు. ఎందుకంటే కూర నీళ్ళగా ఉంటే రుచి రాదు అని ఇలా చేస్తూ ఉంటారు.
మీరు ఈ విధంగా బయటకు పారవేసే ఆ నీళ్లలో మినరల్స్ అనేక సంఖ్యలో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. శరీర పోషణకు అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఇందులో అధిక సంఖ్యలో ఉంటాయి.
ఈ ఆధునిక రోజుల్లో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మొదటగా సూప్ ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే సూప్ తాగిన కొంత సమయానికి మనకు విపరీతంగా ఆకలి వేస్తుంది. ఈ సూప్ ఆకలి పెరిగేలా చేస్తుంది.
ఇలా బయట కాస్ట్లీ సూప్ తాగే బదులు మనమే కూరగాయలు ఉడికించి ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది కదా!
సూప్ తయారీ ఇలా చేయవచ్చు
- ఇళ్లలో కుక్కర్లో ఉడికించిన నీళ్లు కానీ, ఏదైనా పాత్రలో కూరగాయలు ఉడికించిన నీళ్లు కానీ, ఆ నీటిని పారవేయకుండా శుభ్రంగా సూప్ తయారు చేసుకుని తాగండి.
- ఈ సూప్ లో అనేక సంఖ్యలో పోషకాలు ఉంటాయి. ఇంకా ఈ సూప్ లో కి కాస్త మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపి వేడి చేసి అందరూ తాగండి.
- బీన్స్ ముక్కలు మరియు స్వీట్ కార్న్ గింజలు కొద్ది చుక్కలు నిమ్మరసం మరియు తేనె కలిపి సూప్ తయారు చేయండి.
- మరో విధంగా అయితే కూరగాయలు ఉడికించిన రసం లోకి టమాటా ముక్కలు, ఉల్లికాడ ముక్కలు కూడా వేసి వేడి వేడి సూప్ చేసుకోవచ్చు.
- పొట్ల, దోస, సొర కాయ వంటివి ఉడికించగా వచ్చిన రసం తో కూడా చేసుకోవచ్చు. ఇందులో కి కొత్తిమీర వేసి కొద్దిసేపు వేడి చేసి తాగవచ్చు.
- ఈ విధంగా చేసిన సూప్ లలో అధిక సంఖ్యలో పోషకాలు మినరల్స్ విటమిన్స్ అన్ని ఉండడం వల్ల ఎలాంటి జబ్బులు మీ దరి చేరవు.
ఇవి కూడా చదవండి :-