సినీ నటుడు వేణు మాధవ్ ఇక లేరు.

0

 ప్రముఖ సినీ నటుడు వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6 వ తేదీన ఆస్పత్రిలో చేరారు కొన్ని రోజుల నుంచి వేణుమాధవ్ డయాలసిస్ చేస్తున్నారు మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటరపై ఉంచి వైద్యం  అందిస్తున్నారు.

గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో  బాధపడుతున్న వేణు మాధవ్ గారికి ఇప్పుడు కిడ్నీ సమస్య ఉండటం వలన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు ఆయన ఆరోగ్యం సరిగా లేకో పోవడం వల్ల.

సినీనటులు జీవిత, రాజశేఖర్, ఉత్తేజ్ లు ఆయనను పరామర్శించారు ప్రముఖ నటుడు వేణుమాధవ్ ఆయన ఇంతకుముందు ఎన్నో చిత్రాలలో మనకు హాస్యాన్ని అందించారు అంతేకాకుండా సినీ హీరోగా కూడా నటించారు అలాంటి ఆయన ఆస్పత్రిలో చేరడం వలన సినీ పరిశ్రమ లోని  కొంతమంది ప్రముఖులు ఆయన పట్ల ఆందోళనకు గురవుతున్నారు.

చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు వేణు మాధవ్.తన తుది శ్వాసను ఈరోజు ఉదయం ఆస్పత్రిలోనే విడిచారు. తెలుగు లో కామెడీని ఇష్టపడే వాళ్ళు అందరికీ ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. వేణు మాధవ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం మనస్పూర్తిగా ప్రార్థిద్దాం.