అమరావతి; విశాఖపట్టణం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం లో పిడుగు సూచన.

0

 

.అమరావతి;విశాఖపట్టణం.విశాఖ జిల్లాలోని పలు గ్రామాలలో చోడవరం, చీడికాడ, మాడుగుల, బుచ్చయ్యపేట, రావికమతం, నర్సీపట్నం, కోటవురట్ల గ్రామాలలో నే కాకుండా ,తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి, కోటనందూరు, శ్రీకాకుళం జిల్లా  లోని సీతంపేట, పాతపట్నం, ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్ జి ఎస్ హెచ్చరించింది.ఆధునిక టెక్నాలజీతో ముందే సంభవించే విపత్తులను పసిగడుతున్నాము.అని ఆర్ జి ఎస్ తెలిపారు.ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఉండాలని సూచించారు.

క్యూ ములు  నింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి.ఆ చర్య జరుగుతున్నపుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్లో ఒక్కసారిగా కలకలం మొదలవుతుంది.ఆ సమాచారం ఆధారంగా పిడుగుపాటు ను ముందే ఊహించగలరు.పిడుగుపాటు ను ముందే పసిగట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ప్రభుత్వ పని తీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.