వివేకానంద సూక్తులు : స్వామి వివేకానంద (జనవరి 12, 1863 – జూలై 4, 1902), (బెంగాలీలో ‘షామీ బిబేకానందో’) ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. Vivekananda Quotes Telugu కోసం మీరు చూస్తుంటే కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు.
రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు.
స్వామి వివేకానంద సూక్తులు | Vivekananda Quotes Telugu
- మీతో మీరు ఒక్కసారి అయినా మాట్లాడుకోండి. లేకపోతే ప్రపంచంలోనే ఒక తెలివైన వ్యక్తిని కలవడం మీరు కోల్పోతారు.నీ వెనుక ఏం ఉంది ? నీ ముందు ఏం ఉంది అది నీకు అనవసరం. నీలో ఏం ఉంది అనేదే ముఖ్యం.
- పరపజయాలు పట్టించుకోకండి. అవి సర్వసాధారణం ,అవే జీవితానికి మెరుగులు దిద్దేవి . ఓటమీ లేని జీవితం ఉంటుందా?
- ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే…ఒక్క క్షణం అసహనం మొత్తం జివితన్నే నాశనం చేస్తుంది .
- కోపంతో మాట్లాడితే, గుణన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే, మనశాంతి ని కోల్పోతారు. అర్థాన్ని కోల్పోతావు. అహంకారంతోమాట్లాడితే, ప్రేమనుకోల్పోతావు అలోచించిమాట్లాడితే, గొప్పగా జివిస్తావు. మానవ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని నేను గ్రహించాను. అందుకనే… ప్రతి వ్యక్తి ముందు భక్తి తో నిలబడతను. వారిలో దేవున్ని చూస్తాను. అ క్షణంలో నేను బానిసత్వం నుండి విముక్తి పొందుతాను.
- అపారమైన విశ్వాసం అనంతమైన శక్తి ..ఇవే విజయ సాధనకు మార్గాలు.
- ఫలితo గురించి ఎంత శ్రద్ధ చుపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్దతుల్లో కూడా అంతే శ్రద్ధను చూపించాలి.
- మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు .. బలహీనంగా ఆలోచిస్తే బలహినులవుతారు, శక్తిని స్మరిస్తే శక్తివంతులు అవుతారు.
- ఏ ఒక్క రోజు అయినా నీకు సమస్యలు ఎడురుకాలేదంటే నువ్వు తప్పుడు మార్గంలో ప్రయనిస్తునావు అని అర్థం చేసుకో ….
- నిన్నటి నుండి మదన పడకుండా,రేపటి గురించి ఆలోచించగలిగే వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే .
- ఉస్సహంతో శ్రమించడం, అలసటను ఆనందగా అనుబవించడం … ఇవి సాధించే వారి ప్రాధమిక లక్షణాలు…
- బయపడకు .ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు .కలంతో పాటు ముందుకు సాగిపో . నీ ఆత్మ శక్తి ని మరలా పెంచుకో..
- సమస్యలే రాని… సవాళ్ళు ఎదురవని …ఓటమి తలుపు తడితే తట్టని … నిలుద్దాం .. పోరాడుదాం …గెలుద్దాం..
- హృదయానికి మెదడుకి మధ్య సంఘర్షణ ఏర్పడితే .. మీ హృదయన్నే అనుసరించండి.
- సర్వశక్తి నిలోనే ఉంది నువ్వు తలుచుకొంటే ఈ సమస్త లోకాన్ని నీ పదాక్రుతం చేసుకోగలవు.
- లక్యం కోసం అలుపెరుగని శ్రామికుడు లా నేడు నువ్వు ఉంటె రేపటి విజయం నీకు సాధ్యమవ్తుంది.
- నాయకుడుగా ఉన్నపుడు సేవకుడిగా మారండి అనంతమైన సహనాన్ని పెంచుకోండి .అప్పుడే మీకు విజయం సొంతం అవుతుంది.
- స్వయకృషి పట్టుదలా ధృడసంకల్పం ” ఈ మూడు ..మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తిర్చిదిద్దుతుంది.
- తనకు నచ్చితే మూర్కుడు సైతం ఘనకార్యం సాధించగలడు .కానీ..వివేకి ప్రతి పనిని తనకు నచ్చే విధంగా మార్చుకొంటాడు.
- స్థిరమైన గమ్యం ,కచ్చితమైన మార్గం రాజీలేని ప్రయత్నం”’ ఈ మూడు ఉంటె విజయం కచ్చితంగా మీది అవుతుంది.
- మనిషి పతనానికైనా,పాపానికైనా కారణం భయమే.
- ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలోను విజయం సాధించలేడు.
- దేశానికి ఉపయోగపడని శరీరం,డబ్బు ఎంత పెరిగినా వృధానే.
- బలమే జీవనం,బలహీనతే మరణం.
- ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగి పోతాయి.
- మానవుడు ఎంత గొప్ప వాడైతే అంత కష్టమైన పరీక్షలని దాటవలసి ఉంటుంది.
- వేలకొద్ది నీతులు చెప్పడం కన్నా ఒక్క మంచి పని చేసి చూపించు.
- నీ వెనుక ఏముంది,ముందు ఏముంది..!!అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.
- లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి.
- అసలు పని చేయకుండా బద్దకించే వాడికంటే ఏదో ఒక పని చేసేవాడు ఉత్తముడు.
ఇవి కూడా చదవండి :-