బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఇంటి చిట్కాలు

0
weight loss tips in telugu
weight loss tips in telugu

చిన్న మార్పులు – పెద్ద ఫలితాలు!

నమస్కారం! అందరు క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను.

ఈ కరోనా వలన గత ఏడాది నుంచి ఇంట్లో నుండి బయటకి వెళ్ళాలి అంటే అందరికి భయం వేస్తుంది. ఇంట్లో నే ఉండి అమ్మ చేతి వంట తింటూ కొంతమంది, సొంత ప్రయోగాలు చేస్తూ కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేశారు – బరువు కూడా పెరిగారండోయ్!

 లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాయామశాలలు కూడా మూతపడ్డాయి. ఇవాళ  నేను మీరు ఇంట్లో నుంచి బైటికి కదలకుండా బరువు తగ్గించుకునే చిట్కాలు కొన్ని చెప్తాను.

మన ఫిట్నెస్ గురువుల ప్రకారం, బరువు తగ్గడానికి  మనం పెట్టవలసిన శ్రద్ధ 70% ఆహరం మీద, 30% మన జీవనశైలి మీద.

Weight Loss Tips In Telugu :పెద్దలు ఏమి తినమంటున్నారు ?

కొంత మంది పోషకాహరణ నిపుణుల సలహాలు ఇవిగో:

1. నిమ్మకాయ – తేనె: ఈ చిట్కా మనకి అందరు చెప్తూనే ఉంటారు, ఎందుకంటే అది అంతగ గొప్పగా పని చేస్తుంది కాబట్టి. పొద్దునే ఖాళి కడుపుతో, ఒక గ్లాసు గొరువెచ్చని నీళ్లలో సగం నిమ్మకాయ చెక్క రసం, రెండు చంచాలా తేనె కలుపుకొని తాగాలి. తేనె నిమ్మకాయ నీళ్లు మన శరీరం లోని కొవ్వు ని కరిగించడానికి చాలా సహాయపడతాయి.  ఈ  నిమ్మకాయ నీళ్ల  వల్ల చాలా ఉపయోగాలు ఉన్నయి. మనకి  నోట్లో దుర్వాసన ని తగ్గిస్తుస్తుంది,  చర్మ సమస్యలు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు మనకి అజీర్తి, కిడ్నీ సమస్యలు కూడా రావు.

2. డిటాక్స్ వాటర్: ఈ డిటాక్స్ నీళ్లని మనం రోజంతటా తాగొచ్చు. మంచినీళ్ల బదులుగా ఈ డిటాక్స్ నీళ్లు తాగడం వలన మనం మరింత ఉత్సాహంగా ఉంటాము. మనం చాలా రకాల డిటాక్స్ నీళ్లు ఇంట్లో ఉన్న సరుకులతో చేస్కోవచ్చు. అందులో మూడు రకాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను:

         1. అల్లం, నిమ్మకాయ, పుదీనా: ఒక వెడల్పు మూత ఉన్న జగ్ తీస్కొని, అందులో చిన్న చిన్న ముక్కలుగా కోసిన అల్లం, గుండ్రంగా కోసిన నిమ్మకాయ, తుంచిన పుదీనా ఆకులు వేసి అందులో నిండుగా నీళ్లు వేయండి.

         2. పుచ్చకాయ: ఒక వెడల్పాటి జగ్ లో తొక్కు తీసేసిన రెండు పెద్ద పుచ్చకాయ ముక్కలను చిన్నగా కోసి  జగ్ నిండుగా నీళ్లు వేసుకోవాలి. దీనిలో  కొద్దిగా తుంపిన పుదీనా ఆకులు కూడా వేస్కొవచ్చు.

         3. ఆపిల్, లవంగం, దాల్ చీని చెక్క: ఒక వెడల్పాటి జగ్ లో తొక్కు తీసేసిన ఆపిల్ కాయ ముక్కలుగా కోసి, అందులో ఒక నాలుగు లవంగాలు, రెండు దాల్ చీని చెక్క ముక్కలు వేసి జగ్ నిండుగా నీళ్లు వెస్కొని తాగాలి.

ఈ నీళ్ళని రోజంతా ఆరారుగ తాగుతూ ఉండండి. ఒకవేళ నీళ్లు అయిపోయిన, ఆ జగ్ లో నే మళ్ళి నీళ్లు నింపుకొని తాగావచు. ఈ నీళ్లలో చెక్కర మాత్రం వేయకూడదు.

3. చిన్న మార్పులు: పరిశోధకుల ప్రకారం మనుషుల మనస్తత్వంలో మార్పు వారి జీవనశైలిని మారుస్తుందట. అందుకే మన పోషకాహరణ నిపుణులు కూడా కొన్ని చిన్న సైజు మార్పులు చేయమని చెప్తున్నారు. మన కంచం సైజు మనం ఎంత తినగలమో మనకి చెప్తుందట.   కావాలి అంటే గమనించండి – మీరు చిన్న కంచం లో తిన్నప్పుడు కొద్దిగా, పెద్ద కంచం లో తిన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా తింటారు.

తినేటప్పుడు, మీరు పెద్ద కంచాలకి బదులుగా చిన్న కంచంని ఎంచుకోమంటున్నారు. ఈ చిన్న ప్లేటులో తినడం వలన మన మెదడు మనకి కొద్దిగా తిన్న కూడా కడుపు నిండింది అని చెప్తుంది. దీని వలన మనం పుచ్చుకునే క్యాలోరీలు తగ్గుతాయి. చిన్న ప్లేట్ తో పాటు చిన్న సైజు చెంచా కూడా ఎంచుకోచ్చు.

4. పెరుగు: పెరుగు అనేది మనకి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే.  పెరుగుని మనం సలాడ్ లో వేస్కోవచ్చు లేదా అలాగే తీసుకోవచ్చు. పెరుగు లో మనకి పాలలో ఉండే పోషకాలు అన్ని ఉంటాయి, కొవ్వుని మినహాయించి. రోజుకు రెండు కప్పులు పెరుగు తినడం వలన మనకు చిరుతిండి మీద ధ్యాస తగ్గుతుంది. పెరుగు తినడం వలన మన జీర్ణశక్తి పెరిగి, మంచి బ్యాక్టీరియా తయారు అవుతుంది. దీనివలన మనకి  అజీర్తి, మలబద్ధకం వంటివి రాకుండా ఉంటాయి.

5. కాఫీ: కొంతమందికి కాఫీ తాగనిదే తెల్లారినట్టే ఉండదు. ఆ కాఫీ కి చిన్న మార్పులు చేస్తే మన బరువు కూడా తగ్గిస్తుందని మన నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వలన మనం మరింత చురుకుగా, ఉల్లాసంగా ఉంటాం. దీని వాలన మన క్యాలరీలు తగ్గుతాయి.  డికాషన్ లో పాలు, చెక్కర తగ్గించడం ఒక చిట్కా. పాలకి బదులుగా నీళ్లు కలుపుకోవడం మరో చిట్కా. ఈ నీళ్ల కాఫీని బయట దేశాల్లో అమెరికానో కాఫీ అంటారు. కాఫీలోని కెఫిన్ అనే పదార్ధం వలన మనం రోజంతా చురుగ్గా, ఉల్లాసంగా ఉంటారు.

6. ప్రోటీన్ : మనం ప్రతిరోజు తినే ఆహరం లో  అన్ని పోషకాలు ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా ప్రోటీన్. ప్రోటీన్ శాతం ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవడం వలన మన శరీరం లో కండ శాతం పెరిగి, కొవ్వు శాతం తగ్గుతుంది. ఈ ప్రోటీన్ మనకి మాంసాహారం లో  కోడి మాంసం, కోడి గుడ్లు, చేపలలో మనకి ఎక్కువగా లభిస్తుంది.

వీటిని కేవలం ఉడకబెట్టుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, మిరియాలు, కారం వేసుకొని – ఒక టీ-స్పూన్ నూనె లో వేయించుకొని, ఒక కప్పు అన్నం లేదా 2 రొట్టెలు, నీళ్ళగా చేసుకున్న పప్పుతో తింటే ఎంతో మంచిది.  శాకాహారం లో పన్నీర్, పప్పులు, మొలకెత్తిన గింజలలో ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్. మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) – పెసర్లు, పల్లీలు, బఠాణీలు, పచ్చిశెనగలు వంటివాటిని ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి.

ముఖ్యంగా పొట్టు తీయని పెసర్లు చాలా మంచిది. ఈ మొలకలు టమాటో, ఉల్లిపాయ ముక్కలు మరియు నిమ్మకాయ రసంతో ఎంతో రుచికరంగా ఉంటుంది. మనం తినే చిరుతిండి( నూనె లో వేయించిన బజ్జిలు, మురుకులు) బదులుగా ఈ మొలకలను ఒక నెల రోజులు పాటు తింటే తేడా మీకే తెలుస్తుంది.

ఒక వేళ మీకు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఉంటే – మీరు ఈ ఆహారం ఎక్కువగా తీసుకునే ముందు పోషకాహరణ నిపుణులను సంప్రదించండి.

7. ఆకుకూరలు: ఐరన్, ఫైబర్, విటమిన్స్, కాల్షియమ్, పోటాషియం, మెగ్నీషియం మరియు ఆంటీ-ఆక్సిడెంట్స్ ఇవి అన్ని ఎక్కువగా ఉండేవి ఆకుకూరలలో. పాలకూర, తోటకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ తినడం వలన మనకి ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. వీటివలన మనకి కీళ్లనొప్పులు, మూత్రపిండాలలో రాళ్లు, కాన్సర్ వంటి జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది. పాలకూరను మీరు మాంసాహారం తో వండుకొని తిన్నా రుచికరంగా ఉంటుంది.

8. ఉప్పు: ఎక్కువ కాదు, తక్కువ కాదు – తగినంత.  వంటకి తగినంత ఉప్పు లేనిదే ఆ వంటకానికి రుచి ఉండదు.  కానీ ఉప్పు ఎక్కువగా తినడం వలన ఉప్పులోని సోడియం మన శరీరంలో నీటి శాతం పెరిగి మన బరువు పెరగడానికి కారణం అవుతుంది. నిపుణులు అందుకే రాత్రి భోజనం 7 గంటల కంటే ముందు తింటే, ఉప్పును జీర్ణించుకునే సమయం ఉంటుంది అని, తక్కువ ఉప్పు తినమని సలహా ఇస్తున్నారు. ఉప్పును తక్కువగ తింటే లో-బీపీ వచ్చే సమస్య ఉంది, ఎక్కువగా తినడం వలన రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే గుర్తుంచుకోండి – తగినంత!

9. చెక్కెర: ఇది సహజంగా మనకి అందరు చెప్తూనే ఉంటారు – చెక్కెర తగ్గిస్తే బరువు తగ్గుతారు అని. బాగా అలవాటు అయిన వాటిని వెంటనే వదులుకోవడం సులువు కాదు. అందుకే వాటిని ఒకేసారి కాకుండా మెల్లిగా దూరం చేయాలి. మీకు ఎక్కువగా స్వీట్లు తినే అలవాటు ఉంటె, రెండుకు బదులు ఒకటి తినడానికి పరిమితించుకోండి. ఎక్కువగా చెక్కెర వేసుకునే అలవాటు ఉంటె, కొద్దికొద్దిగా తగ్గించుకోడానికి ప్రయత్నించండి. భోజనం తర్వాత తీపి తినే అలవాటుని మాత్రం మానుకోండి.

10. జలం: మన మానవాళికి అమృతం. రోజుకి కనీసం 4 లీటర్లు నీళ్లు తాగడం వలన మన బరువు తగ్గడంతో పాటు మనకి చర్మ సమస్యలు రావు, మన మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీళ్లు తాగడం వలన మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి : YSR Pension Kanuka 2021 Procedure

జీవనశైలి – Life Style For Weight Loss

Weight Loss Tips In Telugu
Weight Loss Tips In Telugu

ఈ కాలంలో ఎల్.కె.జీ నుంచి పి.జీ వరకు అందరికీ ఉన్నది “ఒత్తిడి”.  చాలా మందికి ఒత్తిడిలో తమకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఒత్తిడి వలన మనం బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. పరిశోధకుల ప్రకారం మనం ఒత్తిడికి గురైన ప్రతీసారి మన రక్తంలోకి  అడ్రెనలిన్ మరియు కార్టిసోల్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మిమ్మల్ని ఒత్తిడి పరిస్థుతులలో నుంచి బయటకు పడేయడానికి మీ మెదడు మీకు ఇచ్చే షార్ట్ కట్ మందు లాంటిది.

ఈ హార్మోన్ విడుదల అవ్వగానే కొంతమందికి ఆకలి ఎక్కువ వేయడం, మరి కొంత మందికి తీపి తినాలనే కోరిక కలుగుతుంటుంది. ఒత్తిడి వలన మనకి బరువు పెరగడమే కాకుండా, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కరోనా వలన అందరూ ఇంట్లో ఉండటం వలన పని ఒత్తిడి అందరికి ఎక్కువగా ఉంది. ప్రతీరోజు మీరు చేసే చిన్న మార్పుల వలన ఈ ఒత్తిడిని మీరు తప్పించుకోవచ్చు.

ముఖ్యంగా మీరు ఈ కింద చెప్పిన వాటి ప్రకారం ( Weight Loss Tips In Telugu ) మీ జీవనశైలి లో మార్పులు చేసుకోవాలి.

        1. పాజిటివ్ అఫ్ఫిర్మషన్స్: అంటే ధృవీకరణలు – మీ గురించి మీకు నచ్చిన ఒక ఐదు విషయాలు, మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఒక ఐదు విషయాలను రాసుకొని, పొద్దునే లేవగానే చదవండి – మార్పు మీకే తెలుస్తుంది!

       2. వ్యాయామం: మనo పాఠశాలలో ఉన్నప్పుడు చేసిన చిన్న చిన్న వ్యాయామాలు ప్రతిరోజూ ఒక కనీసం 15 నిమిషాలు చేస్తే చాలు, మీరు మరింత ఉల్లాసంగా ఉంటారు. వ్యాయామం చేసినప్పుడు మనకి ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతింది – ఇది మనకి ఒత్తిడిని అధిగమించి ఆనందంగా ఉండే ధైర్యన్నిస్తుంది.

       3. ప్రాణాయామం: భారతదేశంలో పుట్టిన విద్య – యోగా. ప్రపంచమంతటా ఇప్పుడు యోగా నేర్చుకుంటున్నారు. దాని ప్రభావం అంత గొప్పది. అందులో ఒక ప్రక్రియ – ప్రాణాయామం. మనం ఊపిరి పీల్చుకునే విధానం మీద శ్రద్ధ పెట్టడం వలన చాలా మార్పులు కలుగుతాయి. ఇప్పుడు మనకి అనుకూలంగా చాలా మంది యోగా నిపుణులు ఇంటర్నెట్ లో చిట్కాలు చెబుతున్నారు. ప్రతీరోజు 15 నిమిషాలు ప్రాణాయామం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది.

       4. టైం-టేబుల్ : అమ్మ ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటుంది – సమయానికి తిని, సమయానికి పడుకో అని. పెద్దలు ఈ మాట చెప్పడం వెనక పెద్ద అర్ధం ఉందండి. మన శరీరానికి మనం చేసే అలవాటే మన ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తుంది. సమయానికి తిని, సమయానికి పడుకోవడం వలన మనకి వేళకాని వేళలో ఆకలి వేయదు. దీనివలన మనకి చిరుతిండి తినే అలవాటు తగ్గుతుంది.

     5. మద్యపానం మరియు ధూమపానం ఆరోగ్యానికి హానికరం: వీటి వలన మనకు ఊపిరితిత్తులకు, కాలేయానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ వీటివల్ల మనకు ఒత్తిడి, మధుమేహం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. పరిమితిలో వీటిని తీసుకున్నా కూడా ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వీటినుంచి దూరంగా ఉండటం మేలు.

మితిమీరితే ఏదైనా వ్యసనమే – బరువు తగ్గించుకునే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆహార అలవాట్లను తరుచు మారుస్తూ ఉండాలి. దీనివలన మీ శరీరానికి అనుకూలమైన పోషకాలు అందుతూ ఉంటాయి. మనకు చాలా ఎక్కువ ఇప్పుడు వినిపించే ట్రెండ్స్ – క్రాష్ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. శరీర తీరుని బట్టి మన ఆహారశైలి మారుతూ ఉంటుంది. వాటిని పాటించే ముందు మీ పోషకాహరణ నిపుణుడి సంప్రదించడం తప్పనిసరి.

ఈ సలహాలు పాటించి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని ఆశిస్తూ… సెలవు!

ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఇంట్లోనే ఉండండి, తరచూ చేతులు శుభ్రం చేస్తూ ఉండండి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళండి. మాస్క్ లేనిదే బయటకు వెళ్ళకండి. ఇప్పుడు చెప్పుకున్న ఈ చిట్కాలు ( weight loss tips in telugu ) కానుక మీరు తప్పకుండా పాటిస్తే మీ శరీర బరువు తగ్గే సూచనలు మీకు కొద్ది రోజుల్లో కనబడుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here