వాట్సప్ ని మించిన ఈ App గురించి మీకు తెలుసా ?

0

త్వరలో మీ ఫోన్ లో వాట్సాప్ కనుమరుగు కాబోతున్నది!! ఎందుకో ఇది చదవండి.

కొత్త మెసేజింగ్ యాప్:

భారత ప్రభుత్వం కన్ను ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ పైన పడింది .ప్రస్తుతం ఎంతోమంది ఫోన్లలో వాడుకలో ఉన్న వాట్సాప్ నుండి ఎంతో రహస్యంగా ఉంటున్న విషయాలు హ్యాకింగ్ కు గురి కావచ్చని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఇందుకోసం భారత్ సొంతంగా వాట్సాప్ ను రూపొందించే పనిలో అడుగులు ముందుకు వేసి ఉన్నది. కాబట్టి నెటిజన్లు ఎంతోమందికి ఈ వాట్సాప్ ను అతి త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నది.

Jims App ::

ఇది కొత్త మెసేజింగ్ యాప్ పేరు. భారత ప్రభుత్వం ఎందుకు తీసుకు వస్తున్నదంటే ఎంతో ముఖ్యమైన పరిపాలనకు సంబంధించిన అధికార పరమైన సందేశాలను అతి రహస్యంగా ఉంచుటకు.

ఈ వాట్సాప్ టెస్టింగ్ కోసం సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధీనంలో జరుగుతున్నది.
అందుకే దీనికి గవర్నమెంట్ ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీస్ (జి ఐ ఎం ఎస్ ) అనే పేరు పెట్టారు .2020 డిసెంబర్ చివరి నాటికి ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

NIC::

ఇదే జిమ్స్ యాప్ ను తయారు చేస్తున్న సంస్థ. ఈ జిమ్స్ యాప్ ను కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆయా శాఖలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాడుకునే విధంగా అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ ఎన్ ఐ సి సంస్థ ప్రభుత్వ శాఖలకు ఈమెయిల్ సర్వీసును అందిస్తూ ఉంటుంది. దాదాపు ఒక్క రోజుకు రెండు కోట్ల ఈమెయిల్ సర్వీసులను నిర్వహిస్తుంది.

పైలెట్ ప్రాజెక్టుగా జి ఐ ఎం ఎస్ యాప్ :-

ఈ యాప్ లో ని సాఫ్ట్వేర్ మొత్తం ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుని ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తయారు చేస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. మొదటగా ఈ యాప్ ను ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ ఆ తర్వాత దాదాపు 11 జాతీయ భాషల్లో కూడా తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇందుకోసం విదేశాంగ శాఖ, సెంట్రల్ హోంశాఖ, సిబిఐ ,రైల్వే శాఖలు కూడా ఈ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయి అని తెలిపారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ మొదలగు వాటిని సపోర్ట్ చేసేలా తయారు చేస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళిక:

ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ పరమైన కీలక శాఖలో వాట్స్అప్ మరియు ఇతర మెసేజింగ్ సర్వీసుల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకొంటూ ఉన్నవి. ఈ నేపథ్యంలో ఏదైనా విలువైన కీలకమైన రహస్యమైన ముఖ్యమైన సందేశాలు సమాచారము హ్యాకింగ్ కు గురి కావచ్చు అని నిపుణుల అభిప్రాయం. ఇందుకోసమే ప్రభుత్వం ఇలాంటి అప్ లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చి ప్రజలకు సుపరిపాలన ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది విజయవంతం కావాలని కోరుకుందాం.