SS Rajamouli మరియు shankarలలో ఎవరు గొప్ప డైరెక్టర్

0

Shankar vs Rajamouli ::

రాజమౌళి వెర్సెస్ శంకర్.. భారతీయ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు. మాతృభాష సినిమాలను విశ్వవ్యాప్తం చేసిన దర్శక దిగ్గజాలు మన భారతీయ దర్శకులు అతి కొద్ది మందే ఉన్నారు. సమకాలీన సమస్యలకు తమదైన శైలిలో పరిష్కారాలు అందించి సినీ ప్రియులను అలరిస్తూనే భారతీయ సినిమాల బాక్సాఫీసును కొల్లగొడుతున్న క్రియేటివ్ జీనియస్ దర్శకులుగా ప్రతిభ చూపుతున్న వారిలో ఒకడు దర్శకధీరుడు rajamouli. ఇంకొకరు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సున్నితమైన అంశాలను సామాజిక అంశాలను వినోదంతో మేళవించి ప్రపంచ సినీ ప్రియులను అలరిస్తున్న అపర మేధావి తమిళ director shankar.

ఈ దర్శకులు ఇద్దరూ భారతీయ సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు. మరి ఇప్పుడు వీరిద్దరి జీవిత విశేషాలతో పాటు సెల్యులాయిడ్ పై వీరిద్దరి స్టామినా ఏంటో చూద్దాం.

SS Rajamouli ::

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింప చేసిన ఘనత రాజమౌళి గారిది. Rajamouli విజయాల వెనక ఎంతో హార్డ్ వర్క్ ,డెడికేషన్, కమిట్మెంట్ ,సిన్సియారిటీ ఇవే అతని విజయానికి నాలుగు మూల స్తంభాలు. రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇతడు జానకి రాముడు , బొబ్బిలి సింహం లాంటి సినిమాలకు కథలు అందించి అర్ధాంగి అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అన్నయ్య ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. మంచి బిజీ బిజీగా ఉంటున్న సమయంలో సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిష్యరికం చేస్తూ ఆయన దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా ఓనమాలు నేర్చుకున్నాడు.

అలాగే తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర శిష్యరికం చేసిన తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికంలో రాజమౌళి లో దాగి ఉన్న ప్రతిభను బయటకు లాగాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలోనే శాంతినివాసం సీరియల్ దర్శకత్వం వహించి బుల్లితెర అభిమానులకు చేరువయ్యాడు రాజమౌళి.

rajamouli movies :

2001వ సంవత్సరంలో దర్శకుడు రాఘవేంద్ర పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాడు. తర్వాత మంచి కథ కోసం ఎదురు చూసి జూనియర్ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా తీశాడు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ rajamouli ఎక్స్ట్రార్డినరీ టేకింగ్ సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళాయి.

బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి సినిమాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ సింహాద్రి కథను చాలా ఎనర్జిటిక్ గా రాశాడు. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితాన్ని మార్చి వేసిన చిత్రం సింహాద్రి. తర్వాత రగ్బీ గేమ్ నేపథ్యంలో వచ్చిన సై అనే సినిమా నితిన్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సై సినిమా తో రాజమౌళి ఎలాంటి కథతో నైనా ప్రేక్షకులను సినిమాలకు రప్పించగలరు అని తేలిపోయింది.

అప్పుడే సినీ ట్రేడ్ వర్గాల్లో SS Rajamouli పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాల జోరు తో రాజమౌళి ఈసారి ప్రభాస్ తో ఛత్రపతి సినిమా తీశాడు. సింహాద్రి టైం లో నే సింహాద్రి కథను ప్రభాస్కు వినిపిస్తే ప్రభాస్ ఆ కథను రిజెక్ట్ చేశాడు!  ఎందుకంటే రాజమౌళికి అప్పట్లో పెద్ద హిట్లు లేవు. ఎందుకంటే చేసిన ఒకే ఒక్క సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ అయితే ఆ సినిమా ప్రభాస్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది.

సింహాద్రి మరియు సై సినిమా చూసిన తర్వాత ప్రభాస్ కు రాజమౌళి కి సెట్ అయింది. ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రభాస్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రెబల్ స్టార్ గా విజృంభించిన చిత్రం ఛత్రపతి. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ సెంథిల్ కుమార్ వర్క్ హైలెట్ గా నిలిచింది. రాజమౌళి తీసే ప్రతి సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా పని చేస్తాడు.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తాడు. ఛత్రపతి సినిమాలో అన్ని రకాల హంగు ఆర్భాటాలతో ఇది రాజమౌళి ముద్ర మార్క్ అనే పేరు ఏర్పడింది. అప్పట్లోనే ప్రభాస్కు ఛత్రపతి బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ హిట్ గా పేరు తెచ్చింది.

ఇక అప్పట్నుంచి అపజయం ఎరుగని దర్శకుడు గా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. రవితేజతో విక్రమార్కుడు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్తో యమదొంగ హ్యాట్రిక్ చిత్రంగా నిలిచింది. ఇలా rajamouli దర్శక దిగ్గజం గా ప్రేక్షకుల మన్ననలను ప్రశంసలను పొందాడు.

మెగా స్టార్ రామ్ చరణ్ తో మగధీర చిత్రం చేసి అత్యంత ప్రతిభ గల దర్శకునిగా భారతీయ సినిమా రంగాన్ని ఆకర్షించాడు.
ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజమౌళి చిన్న సినిమా,సునీల్ తో మర్యాద రామన్న చిత్రం తీశాడు. ఇది బాక్సాఫీసును కొల్లగొడుతూ దూసుకెళ్లింది. చిన్న ప్రాణి ని ప్రధాన పాత్రగా పెట్టి ఈగ సినిమా తీసి తెలుగు తమిళ భాషలలో విజయదుందుభి మోగించడం అద్భుతం. రాజమౌళి సామాన్యుడు కాదు అనే స్థాయికి వచ్చేశాడు.

భారతీయ సినీ ట్రేడ్ విశ్లేషకులు ss rajamouli ప్రతిభకు బ్రహ్మరథం పట్టారు. ఒక చిత్రానికి తీసిన జోనర్ మరలా మరో చిత్రానికి వాడకుండా తనదైన శైలిలో కొత్త జోనర్ ను వాడుతూ ప్రతి చిత్రం తో విజయాలు సాధిస్తాడు. తర్వాత Bahubali సినిమా తో అతని కీర్తి ప్రతిష్టలు ప్రతిభాపాఠవాలతో విశ్వవ్యాప్తం అయినాయి. Bahubali the beginning, Bahubali the conclusion సినిమాలు ఓ విజువల్ వండర్. ప్రపంచ దేశాలలో అద్భుత పరిచేలా విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ మంచి దృశ్యకావ్యంగా మలిచారు జక్కన్న. ఇతని టాలెంట్ చూసి యావద్భారత దేశం గర్వపడేలా చేశాడు. నేటికీ రాజమౌళి లో తరగని ఉత్సాహం అదే ఊపు అదే జోరు కొనసాగుతూ ఉంటాయి.

ఇంతవరకు ఎలాంటి అపజయాలు లేవు. కీర్తి ప్రతిష్టలకు కొదవలేదు. బాహుబలి లాంటి పెద్ద సినిమాల తర్వాత అలుపెరుగని యోధుడు ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. సాధారణంగా రాజమౌళి సినిమాలో హీరో ఉపయోగించిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి గా ఉంటాయి. విలన్ లు రావణాసురుడి లా కనిపిస్తారు. హీరో కి ధీటుగా ఢీ అంటే ఢీ అనేటట్లు ఉంటారు. సెంటిమెంట్ ఎమోషన్స్ కామెడీ పక్కాగా ఉండాల్సిందే.

rajamouli rrr movie ::

రాజమౌళి సినిమాలో ఓ మహత్తు ఉంటుంది అదే తన సినిమాను పై మెట్టుకు తీసుకువెళుతుంది. నిజానికి ఇద్దరు బడా హీరోలను పెట్టి సినిమా తీయడం చాలా సాహసంతో కూడుకున్న పని. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో సినిమా అంటే కత్తిమీద సాములాంటిదే. ఏమాత్రం సినిమాను హార్ట్ చేసినా చాలా డేంజర్. పైగా ఇద్దరి యోధుల కథ ఇద్దరివీ శక్తివంతమైన పాత్రలు. హాలీవుడ్ సాంకేతిక పరిజ్ఞానంతో హైయెస్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్విరామంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ట్రిపుల్ ఆర్ (RRR) , 2020 సంవత్సరం జులై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఈ సినిమాతో దర్శకుడిగా రాజమౌళి టాలెంట్ ఏంటో మరోసారి మనకు అర్థం అవుతుంది.

director shankar ::

ఇది ఇలా ఉంటే ఒకప్పుడు తమిళ దర్శకుడు shankarను ఇండియన్ జేమ్స్ కామెరూన్ అనేవారు. శంకర్ మామూలు దర్శకుడు కాదు. శంకర్ ప్రతిభ ఏంటో అతని దర్శక దిగ్గజం గ్రాఫ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శంకర్ భారతీయ సినిమాలో హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్ ను ప్రవేశపెట్టాడు.

shankar movies :

తొలి సినిమా జెంటిల్ మెన్ తో సంచలన విజయం సాధించాడు. దీంతో అగ్ర దర్శకునిగా మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ గా భారత దేశంలో గుర్తింపు పొందాడు.  ఇంత ప్రతిభ కలిగిన సినీ దర్శకుడు జీవిత విశేషాలు ఓ సారి తెలుసుకుందాం.

shankar 1990 సంవత్సరంలో ఎస్సై చంద్రశేఖర్ వంటి సీనియర్ దర్శకుల దగ్గర సహాయకుడిగా చేరి హిందీ చిత్రం జై శివ శంకర్ చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టాడు. 1993లో దర్శకుడిగా జెంటిల్మెన్ భారీ బడ్జెట్ సినిమా తో తమిళ తెలుగు భాషల సినిమాలతో ఏకకాలంలో పరిచయమయ్యాడు. తొలి సినిమా ఇచ్చిన విజయంతో శంకర్ వెనుతిరిగి చూసుకోలేదు. శంకర్ తీసిన ప్రతి చిత్రం భారతీయ సినిమాపై ప్రభావితం చూపాయి. ఓ డాన్స్ మాస్టర్ ని హీరోగా పెట్టి సినిమా తీయడం అనే ఆలోచన రావడమే పెద్ద సక్సెస్.

డాన్స్ మాస్టర్ ప్రభుదేవా హీరోగా తెలుగులో ప్రేమికుడు తమిళంలో కాదలన్ చిత్రాలు ఒకేసారి విడుదల చేసి సంచలన విజయాలు సాధించాడు. శంకర్ తీసిన ప్రతి చిత్రం కూడా వజ్రపు తునకలే! బ్రహ్మాస్త్రం సంధించిన వజ్రాయుధం లాంటివి.
భారతీయుడు సినిమా లో కమలహాసన్ నటనకు భారతదేశం మొత్తం నివ్వెరపోయింది. శంకర్ ప్రతిభకు ప్రేక్షకులు శభాష్ అన్నారు. స్వాతంత్ర నేపథ్యం ప్రస్తుత పరిణామాలు లంచం అనే సమస్యలు తీసుకుని బ్రిలియంట్ గా నిర్మించిన గొప్ప దర్శకుడు శంకర్.

అలాగే అపరిచితుడు సినిమాలో విక్రమ్ నటన నభూతో న భవిష్యత్ అన్నట్లుగా శంకర్ సంధించాడు. జీన్స్ సినిమా ను హైయెస్ట్ బడ్జెట్ తో తీశాడు. ఐశ్వర్యారాయ్ అందం నటన శంకర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాయి.
ఒకే ఒక్కడు, బాయ్స్, స్నేహితుడు ,శివాజీ ,రోబో ,రోబో 2.0 చిత్రాలుఅన్నీ శంకర్ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేశాయి. శంకర్ టెక్నికల్ స్టార్డమ్ కు హాలీవుడ్ పరిజ్ఞానం జత కలిస్తే ఎలా ఉంటుందో రోబో సినిమా ద్వారా చూపించాడు.

శంకర్ సినిమాలన్నీ ఓ సామాజిక సమస్యల నుంచి పుట్టుకొస్తాయి. రోబో సినిమాలో రజనీకాంత్ ఐశ్వర్యారాయ్ శంకర్ స్టైలిష్ టేకింగ్ తో తీసిన ఈ సినిమాకు విదేశాలలో సైతం బ్రహ్మరథం పట్టారు. రోబో సినిమాకు సీక్వెల్ గా వచ్చిన రోబో 2.0 సినిమాలో సెల్ఫోన్ల వల్ల పక్షి ప్రాణాలకు నష్టం వాటిల్లితే తద్వారా మనుషులకు కూడా హాని కలుగుతుందని హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు.

ఇప్పుడు మళ్లీ భారతీయుడు 2 అంటూ కమలహాసన్తో వస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ భారతీయుడు 2 సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ శంకర్ తో దాదాపు పది చిత్రాలు చేశాడు ప్రతి చిత్రం కూడా సాంగ్స్ పరంగా సూపర్ డూపర్ హిట్ సాధించినవే. అయితే ప్రస్తుతం భారతీయుడు-2 సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. శంకర్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో మేకప్ కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది.

అందుకు శంకర్ తీసిన అపరిచితుడు ఐ,భారతీయుడు చిత్రాలు మచ్చుతునకలు.  హాలీవుడ్ మేకప్ ఎక్స్పర్ట్స్ తో తన సినిమాలకు వర్క్ చేయించి వాటికి అత్యంత ఆకర్షణీయమైన హంగులు దిద్ది సెల్యులాయిడ్ పై సంధించడం లో తనకు తానే సాటి.  ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఇంత వరకూ ఎదిగిన గొప్ప దర్శకుడు శంకర్.

శంకర్ more sensible లవ్ స్టోరీ నిర్మాతగా కూడా మారి ప్రేమిస్తే అనే సినిమా తీశాడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. Director Shankar సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అతని ప్రతిభకు ఎన్నో పురస్కారాలు అందాయి. ఎం.జి.ఆర్ విశ్వవిద్యాలయం అతనికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. భారతీయుడు చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయింది.


ఇలా 1993లో జెంటిల్మెన్ సినిమాతో ప్రారంభమైన సినీ ప్రస్థానం తొలి సినిమా జెంటిల్ మెన్ తో నే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ దర్శక అవార్డు పొందాడు ఫిలింఫేర్ అవార్డ్ వరించాయి. నేటి భారతీయుడు 2 వరకు అదే ఉత్సాహంతో ప్రయాణం చేస్తున్నాడు. ఈ విజయాలన్నీ అతని సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు. shankar తీస్తున్న భారతీయుడు 2 చిత్రం అఖండ విజయం సాధించాలని కోరుకుందాం.

ఇలా ఇద్దరు దర్శకేంద్రులు భారతీయ సినిమాల ను ఖండాంతరాల వరకు వ్యాప్తి చేస్తూ తమ క్రియేటివిటీ తో అగ్ర స్థానాలలో ఉన్నారు. అవార్డుల విషయంలో నైనా, టెక్నాలజీని వాడుకునే విధానం లోనైనా ,పురస్కారాల లోనైనా, ప్రేక్షకుల అభిమానం పొందడం లోనైనా ,రికార్డులు సృష్టించడం లోనైనా ఇద్దరూ ఇద్దరే. పద్మశ్రీ rajamouli గారి RRR, shankar గారి bharateeyudu 2 గత చిత్రాల వలె విజయం సాధించాలని ఆశిద్దాం.