Friendship Day ని అసలెందుకు జరుపుకుంటాం ?

0

ఒక్కసారి మీరు మీ ఫ్రెండ్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోండి చూద్దాం.బహుశ ప్రపంచంలో ఇది ఎవ్వరికి సాధ్యం కాదు కదా.ఎందుకంటే మనం చాలామంది అనాధలను చూసి ఉంటాం అంటే వాళ్ళకు ముందు వెనక ఎలాంటి బంధుత్వం ఉండదు.కానీ ఈ భూప్రపంచంలో స్నేహితులు లేని వాళ్ళను మాత్రం చూడలేం. సాధారణంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం Friendship Day ని జరుపుకుంటారు. మరి అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 4 న Friendship Day వచ్చింది. ఇవన్నీ ఎలా ప్రారంభమయ్యాయో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఈ వేడుక వెనుక చరిత్ర ఏమిటి? మీ సమాధానం ‘లేదు’ అయితే మీకు తెలియని Friendship Day గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Friendship day History :

Friendship Day వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీలలో జరుపుకుంటారు. ఉదాహరణకు దీనిని జూలై 20 న అర్జెంటీనా, బ్రెజిల్, స్పెయిన్ మరియు ఉరుగ్వేలో జరుపుకుంటారు. ఈక్వెడార్, మెక్సికో మరియు వెనిజులాతో సహా పలు దేశాలు దీనిని ఫిబ్రవరి 14 న జరుపుకుంటాయి. బొలీవియా లో మాత్రం దిన్ని జూలై 23 న జరుపుతారు.ఇంక చెప్పాలంటే బంగ్లాదేశ్, మలేషియా, ఇండియా మరియు యుఎఇ సహా దేశాలు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం దీనిని జరుపుకుంటాయి.

స్నేహ దినోత్సవం యొక్క ఆలోచనను హాల్మార్క్ కార్డుల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ 1930 లో తెచ్చారు. ఆగస్టు 2 న జరుపుకోవాలని ఆయన ప్రతిపాదించారు.1998 లో UN సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ భార్య నానే అన్నన్ 1998 లో UN లో ప్రపంచ స్నేహానికి రాయబారిగా విన్నీ ది ఫూను ప్రకటించారు.

Friendship day Facts :

మొదట 1920 లో గ్రీటింగ్ కార్డ్ నేషనల్ అసోసియేషన్ స్నేహ దినోత్సవాన్ని ప్రోత్సహించింది.అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇదంతా గ్రీటింగ్ కార్డ్స్ మేజిక్. బిజినెస్ బాగా జరగాలి అంటే దానిని ప్రజలలోకి తీసుకెళ్ళాలి.మరి ఇక్కడ జరిగింది కూడా అదే.అప్పటివరకు కేవలం మాటలతో విషెస్ చెప్పుకునే వాళ్ళకు ఒక కొత్త అనుభూతిని ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చాయి.అలాగే ఫ్రెండ్స్ కు ఎదో గొప్ప బహుమతి ఇచ్చినట్టు ఒక గ్రేట్ ఫీలింగ్ ని ఈ కార్డ్స్ కలిగించాయి. ఇక దాంతో చూస్కోండి ఒక్కసారిగా అందరు ఈ గ్రీటింగ్ కార్డ్స్ ని పంచడం ఆనవాయితీ గ చేస్కున్నారు. అంతే కానీ ఫ్రెండ్షిప్ day మరేదో గొప్ప త్యాగం వల్ల అయితే పుట్టింది కాదు.

ఏదైతేనేం ఇపుడు ప్రతి దానికి ఒక రోజు అంటూ కేటా ఇంచారు. Mothers day,fathers day,women’s day లాంటివి ఇంకా చాలా డేస్ ఉన్నప్పుడు friendship day కూడా ఉండల్సిందేలే. మన కష్టాలను పంచుకోవడానికి,ఇష్టాలను చెప్పడానికి ప్రతి దానికి తోడు ఉండే నేస్తానికి ఒక్కరోజు ఏంటి లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ day విషెస్ చెప్పాల్సిందే. Happy friendship Day My Dear Friend.