వై సీ పి ఎమ్మేలే అరెస్ట్

0

వైసిపి నేత నెల్లూరు రూరల్ కోటం రెడ్డి పై మహిళా ఎం పి డి వోని బెదిరించిన కేసు లో అరెస్టు చేశారు.వెంకటాచలం కు చెందిన ఎం పి డి ఓ ధరలపై దౌర్జన్యాని కిదిగిన కేసులో పోలీసులు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు.తన ఇంటి పైకి వచ్చి దౌర్జన్యం చేశారని కోటం రెడ్డి పై ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కోటం రెడ్డి పై 448, 506, 290, సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే గొలగమూడి దగ్గర ఉన్నాఓ ఓ లే అవుట్ కు నీటి కనెక్షన్ మంజూరు చేయలేదన్న కోపంతో ఎమ్మెల్యే తనను ఇష్టానుసారంగా దుర్భాషలాడరు అని కేసు నమోదు చేశారు .

 

తన ఇంటి విద్యుత్, కేబుల్ కలెక్షన్లను తొలగించారని, నీటి పైపులను  తీసి వేసేందుకు గుంతలను తవ్వించారు అని సరళ ఆరోపించారు.కోటం రెడ్డి  దౌర్జన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎంపీడీవో సరళ.. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు.సరళ ఫిర్యాదు చేయడానికి వెళితే, ఎవరూ పట్టించుకోలేదని, ఆమె తెలిపారు. 

నిరసనగా స్టేషన్ ముందు బైఠాయించిన ఆమె కు గ్రామ కార్యదర్శులు సంఘీభావం తెలిపారు. చివరకు ఎంపీడీవో సరళ ఫిర్యాదుతో కోటం రెడ్డి ఆయన అనుచరుడు అయినా,శ్రీధర్ రెడ్డి పై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోటంరెడ్డి అనుచరుడు అయినా శ్రీకాంత్ రెడ్డి పై 290, 506, 448, 427, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఒక మహిళ అధికారిపై రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి దౌర్జన్యం చేయడం అమానుషమని  పలు రాజకీయ నేతలు ద్వజమెత్తారు. కోటంరెడ్డి ప్రవర్తనపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. నిజాయితీగా ఉన్న మహిళ అధికారిపై వైసిపి ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు గారు ధ్వజమెత్తరు.న్యాయం కోసం ఒక మహిళ అధికారి పోలీస్ స్టేషన్ కు వెళితే కేసు తీసుకోవడానికే భయపడుతున్నారు అంటే  ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

కోటంరెడ్డి ఇంటిదగ్గర అ ఆయన అనుచరులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.కోటంరెడ్డి మాత్రం  తాను ఎవరినీ బెదిరించలేదని చెబుతున్నారు.సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటనపై ఆరా తీయడం జరిగింది.ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన డిజిపి ని అడిగి వివరాలు తెలుసుకున్నారు.అయితే  చట్టం ముందు అందరూ సమానమే అని డిజిపి కి స్పష్టం చేసిన సీఎం జగన్. ఆధారాలు ఉంటే చట్టప్రకారం ఏ చర్య అయినా తీసుకోమని ఆదేశించారు.