జగన్ మరో సంచలన నిర్ణయం. తను ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని,మాటతప్పనని, మడమతిప్పనని,ఎలక్షన్స్ ముందర జగన్ గారు అన్నారు.ఆ తర్వాత,ఆయన పార్టీ ఒక ప్రభంజనం లా, ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర సృష్టించింది.జగన్ సీఎం అయ్యాక తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.అందులో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా మన సీఎం జగన్ గారు ఎప్పుడూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఇప్పుడు కూడా అలాంటి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే,ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీలకు 50 శాతం అవకాశం కల్పించాలని జగన్ గారు నిర్ణయించారు.ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వర్గాల వారు ఎంతో ఆనంద పడుతున్నారు. అలాగే మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.తీసుకున్న ఈ సంచలన నిర్ణయం.నిజంగా హర్షించదగ్గ విషయమే.
ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం, సాధారణ పరిపాలన శాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మన ముఖ్యమంత్రి ఇ జగన్ గారు సూచించారు. ఇక ఓట్ సోర్సింగ్ లోఅందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు, అన్ని ప్రభుత్వ శాఖల్లో,ఒకే రకమైన జీతం… ఆన్లైన్ పద్ధతుల్లో జీతాల చెల్లింపు, పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాము అని తెలిపారు.అలాగే ఓట్ సోర్సింగ్ లో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు మా ప్రభుత్వం ఎంత కఠినమైన చర్యలు అయినా తీసుకుంటుంది అని మన సీఎం జగన్ గారు అన్నారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఓట్ సోర్సింగ్ కార్పొరేషన్ బిల్లుకు ఆమోదం తెలుపనున్నట్లు సీఎం జగన్ గారు అన్నారు.