YS Jagan Mohan Reddy గారి జీవిత చరిత్ర తెలుస్తే షాక్ అంతే !

0
ys jagan mohan reddy
jagan wikipedia in telugu

YS Jagan Mohan Reddy Biography In Telugu | YS Jagan Mohan Reddy Wikipedia In Telugu

YS Jagan Mohan Reddy: యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి / Yeduguri Sandinti Jaganmohan Reddy. ఈ పేరు వినగానే భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం సృష్టించే నాయకుడు గా అందరి మనసులో మెదులుతాడు. ప్రస్తుత రాజకీయాలకు ఇతను గొప్ప భారత రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ కు 17 వ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నాడు.

కడపకు చెందిన YS Jagan Mohan Reddy గారు YSRCP ( Youth Labour Farmers Congress Party – యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ) కి వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు గా ఉన్నారు . జగన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, డా. వైయస్ రాజశేఖరరెడ్డి గారి కుమారుడు . ఈయన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 19 జూన్ 2014 నుండి 29 మే 2019 వరకు రాష్ట్ర రాజకీయాలలో క్నారియాశీల నాయకుడిగా ఉండి తన బాధ్యత నెరవేర్చాడు.

Jagan Mohan Reddy personal details | jagan mohan reddy age,jagan mohan reddy daughters,jagan mohan reddy family,jagan mohan reddy education qualification

  • Jagan Mohan Reddy date of birth – యడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి జననం  : 
    21 డిసెంబర్ 1972 (వయసు 47)
  • Jagan mohan reddy birth place : జమ్మలమడుగు , ఆంధ్రప్రదేశ్ , ఇండియా
  • రాజకీయ పార్టీ : YSRCP
  • ఇతర రాజకీయ బంధాలు : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (2011 వరకు మాత్రమే)
  • Jagan Mohan Reddy Wife – జీవిత భాగస్వామి : వై.ఎస్ భారతి రెడ్డి
  • Jagan Mohan Reddy Family – పిల్లలు : ఇద్దరు కూతుర్లు (హర్ష రెడ్డి మరియు వర్ష రెడ్డి)
    తల్లి: వై.ఎస్ విజయమ్మ
    తండ్రి: వై.ఎస్.రాశశేఖరరెడ్డి
    బంధువులు: వైయస్ షర్మిల (సోదరి)
    వైయస్ అవినాష్ రెడ్డి (కజిన్)
    వైయస్ వివేకానంద రెడ్డి (మామ)
    వైయస్ రాజా రెడ్డి (తాత)
  • ys jagan mohan reddy phone number : ఇలాంటివి అంతా ఈజీ గ దొరకవు.

Jagan Mohan Reddy Personal Business – వ్యక్తిగతవ్యాపారాలు : జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషా దినపత్రిక “సాక్షి” మరియు టెలివిజన్ ఛానల్ “సాక్షి టీవీ” ని స్థాపించారు . దీనితోపాటు అతను తన భార్య పేరు మీదుగా భారతి సిమెంట్స్ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఈ భారతి సిమెంట్స్ యొక్క సంస్థ కు చీఫ్ ప్రమోటర్ గా కొనసాగుతున్నాడు.

Jagan Mohan Reddy Political Entry

జగన్మోహన్ రెడ్డి 2004 లో కడప జిల్లాలో జరిగిన ఎన్నికలలో, భారత జాతీయ కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత 2009 ఎన్నికలలో కడప నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా పార్లమెంటు సభ్యుని(MP)గా ఎన్నికయ్యారు.

2009 లో తన తండ్రి ఆకస్మిక మరణం తరువాత, అతని ఓదార్పు యాత్ర పర్యటన సందర్భంగా జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో, 2011 లో YSRCP ఏర్పడటానికి దారితీసింది. ఈ విధంగా జగన్ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పార్టీని అనేక మార్గాల లో ముందుకు నడిపించాడు.

Jagan Mohan Reddy personal life In Telugu – వ్యక్తిగత జీవితం

జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21 న 1972 లో ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వైయస్ రాజశేఖరరెడ్డి మరియు వైయస్ విజయమ్మ దంపతులకు జన్మించారు . ఇతను ఇంటర్ విద్య వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ లో పూర్తి చేశాడు. మరియు ఇతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు.

YS Jagan marriage : జగన్ 28 ఆగస్టు 1996 న భారతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె లండన్లో అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నది.
ఇక మతపరంగా ఇతను కాథలిక్ క్రైస్తవుడు. జగన్ కు ఒకే ఒక చెల్లెలు ఉన్నది, ఆమె వై.ఎస్.శర్మిల. ఆమె కూడా రాజకీయ నాయకురాలు గా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.

YS Jagan Mohan Reddy political life – జగన్ రాజకీయ జీవితం

జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్ఆర్ గా ప్రసిద్ది చెందిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. YS రాజశేఖరరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రి గా 2004 నుండి 2009 వరకు సేవలందించారు.ఇక జగన్మోహన్ రెడ్డి 2004 లో కడప జిల్లాలో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ తరపున పార్లమెంట్ సభ్యులు గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మరలా 2009 లో, కడ్డప నియోజకవర్గం నుండి రెండవ సారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

తండ్రి అకాల మరణం ( ys rajasekhara reddy death) : సెప్టెంబర్ 2009 లో జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి మరణం తరువాత, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాల సాధనకు, రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి తన ప్రయత్నాలను ప్రారంభించాడు. ఈ సందర్భంలో ఆయనను ముఖ్యమంత్రిగా నియమించడానికి మెజారిటీ శాసనసభ్యులు మొగ్గు చూపారు. కానీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ , ఆమె కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ దీనికి అంగీకరించలేదు.

తన తండ్రి మరణించిన సందర్భం లో , తన తండ్రి మరణ వార్తతో ఆత్మహత్య చేసుకున్న వారిని మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను ఆరు నెలల తరువాత కలుసుకుంటానని వాగ్దానం చేశాడు. జగన్ వాగ్దానం చేసినట్లుగానే, అతను తన ఓదార్పు యాత్ర ను ప్రారంభించాడు . అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం జగన్ యొక్క ఓదార్పు యాత్రను మానుకోవాలి అని, ఆపివేయాలని ఆదేశించింది.

ఈ ఆదేశం వలన హైకమాండ్ మరియు జగన్ మధ్య ఉన్న బంధం రాజకీయ పతనానికి దారితీసింది. అయినప్పటికీ ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ ఓదార్పుయాత్రతో ప్రజల కోసం ముందుకు సాగారు .

YSR Congress party –  వైయస్ఆర్ కాంగ్రెస్ స్థాపన

29 నవంబర్ 2010 న, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పరాజయం పాలైన తరువాత ఆయన రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా, అతను 45 రోజుల్లో , తన తండ్రి ఆశయాల సాధన కోసం కొత్త పార్టీని ప్రారంభిస్తానని పులివెందులలో నిర్వహించిన ఒక సభలో 7 డిసెంబర్ 2010 న ప్రకటించాడు. జగన్ తన ప్రకటన ఆధారంగా, మార్చి 2011 లో, తూర్పు గోదావరి జిల్లా జగ్గన్నపేటలో తన పార్టీ పేరు YSR CONGRESS PARTY గా ప్రకటించారు.

ఆ తరువాత, అతని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికలకు వెళ్లి, దాదాపు అన్ని సీట్లను భారీ మెజారిటీతో గెలుచుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి, కడప నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలబడి 545,043 ఓట్ల తేడాతో గెలిచారు.

అక్రమ ఆస్తుల కేసు 2012 – ys jagan cases list in telugu

తన తండ్రి గారైన డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, వివిధ పెట్టుబడిదారుల నుండి 1,172 కోట్ల రూపాయలను లంచంగా జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు అని, బడా కంపెనీ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయం పొందటానికి, జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సంచలన ప్రకటన చేసింది.

ప్రధానంగా భూమి, మైనింగ్ లీజులు మరియు కొత్త పరిశ్రమలకు లైసెన్సులు ఇప్పించడంలో సహాయ పడినట్లుగా , కడప పార్లమెంటు సభ్యుడు, మరియు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అసమానమైన ఆస్తుల కేసులో దర్యాప్తు సంస్థ మే 27 న అరెస్టు చేసింది. వెంటనే మే 28 న హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అతన్ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. జూన్ 11 వరకు ఆయన చంచల్‌గూడ కేంద్ర జైలులో జైలు శిక్ష అనుభవించారు.

అరెస్ట్ మరియు 16 నెలల జైలు శిక్ష : అక్రమ ఆస్తుల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డిని (CBI) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. మరియు దర్యాప్తు సమయంలో అతని యొక్క జ్యుడిషియల్ కస్టడీని మాటిమాటికి పొడిగించి తీవ్ర మనోవేదనకు గురి చేశారు. అంతేకాకుండా అతని బెయిల్ పిటిషన్‌ను 4 జూలై 2012, 9 ఆగస్టు 2012 మరియు 13 మే 2013 న సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జగన్మోహన్రెడ్డి అరెస్టు తర్వాత, చాలామంది రాజకీయ నాయకుల మీద కూడా కేసులు బనాయించి అరెస్టు చేయడం జరిగింది.

తెలంగాణ వ్యతిరేకి జగన్ – ys jagan mohan reddy against telangana

జగన్మోహన్ రెడ్డి అరెస్టయి, జైలులో ఉన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు . ఈ విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం 125 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తరువాత, అతని చక్కెర స్థాయిలు మరియు రక్తపోటు తీవ్రంగా తగ్గింది.

వెంటనే చికిత్స కోసం అతన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమైక్యాంధ్ర నినాదంతో అతని తల్లి ఎమ్మెల్యే విజయమ్మ కూడా ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. జైలు నుండి విడుదలైన తరువాత, జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు.

ఈ బంద్ కు ప్రజలు బాగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి మరియు అతని తల్లి విజయమ్మ ఇద్దరూ కూడా తమ శాసనసభలకు రాజీనామా చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.

2014 ఎన్నికల్లో జగన్ ఓటమి – jagan majority in 2014 elections

2014 లో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), చాలా మంది రాజకీయం విశ్లేషకులు సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలు జగన్కు అనుకూలమని చెప్పారు. కానీ, YSRCP 2014 ఎన్నికలలో ఓడిపోయింది. ఈ ఎన్నికలలో రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి మొత్తం 175 సీట్లలో కేవలం 67 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మొత్తంగా 2 శాతం తేడాతో మాత్రమే వైఎస్ఆర్సిపి ఓడిపోయింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా కేవలం రెండు శాతం తేడాతో 2014 ఎన్నికలలో విజయం సాధించింది.

జగన్ పాదయాత్ర – YS Jagan Mohan Reddy Padayatra 

ప్రజాసంకల్పయాత్ర పేరుతో జగన్ పాదయాత్ర ను నిర్వహించాడు. అయితే 3,648 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న పాదయాత్ర చేపట్టిన ప్రతిపక్ష నాయకుడిగా మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిరస్థాయిగా పేరు నిలుపుకున్నాడు. తన రాజకీయ జీవితాన్ని కీలక మలుపులు తిప్పిన ఈ 3,000 కిలోమీటర్ల పొడవైన వాక్‌థాన్‌ను, ప్రజాసంకల్పయాత్ర అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి 6 నవంబర్ 2017 న ప్రారంభించారు.

జగన్ మోహన్ రెడ్డి ఈ పాదయాత్రను ప్రారంభించడానికి ముందు, తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించినాడు. ఆ తరువాత YSRCP చీఫ్ తన ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’ ను తన స్థానిక కడప జిల్లాలోని ఆర్కె వ్యాలీ నుండి ప్రారంభించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ” రావాలి జగన్, కావాలి జగన్ ” అంటూ నినదించారు. 430 రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 125 అసెంబ్లీ విభాగాలలో ఆయన జరిపిన ఈ పాదయాత్రలో అనేక సంఖ్యలో ప్రజలను కలిసి , ప్రజల సంక్షేమం కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. చివరకు ఈ ప్రజా సంకల్ప యాత్ర 6 నవంబర్ 2017 న ప్రారంభమై 9 జనవరి 2019 లో ముగిసింది.

కత్తి దాడి పరిణామాలు : 25 అక్టోబర్ 2018 న విశాఖపట్నం విమానాశ్రయంలోని విఐపి వెయిటింగ్ హాల్ లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యక్తి కాక్ ఫైటింగ్ కత్తితో దాడి చేశాడు . భుజంపై గాయం కావడంతో శస్త్రచికిత్స చేయడం జరిగింది.

2019 ఎన్నికల లో గెలుపు – ముఖ్యమంత్రి – Jagan Majority In 2019 Elections

2019 ఏప్రిల్-మేలో జరిగిన 2019 జాతీయ, రాష్ట్ర ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 151 గెలిచింది. మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాల్లో 22 స్థానాలను YSRCP గెలుచుకుంది. తర్వాత 30 మే 2019 న జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జగన్ పరిపాలన ప్రత్యేకతలు : ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో గెలిచిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విషయంలో తనదైన ప్రత్యేక శైలిని కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో తాను కలిసిన ప్రజలను, వారి సంక్షేమం కోసం అప్పట్లోనే తాను కొన్ని ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది.

ఇందులో భాగంగానే ప్రజా సంక్షేమం కోసం “నవరత్నాలు ( Ysr Navaratnalu స్కీం లో ఉన్న ప్రతీ పథకం గురించి తెలుసుకోండి ) ” అనే ఒక గొప్ప వినూత్నమైన పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు జరుపుతున్నాడు. ఈ “నవరత్నాలు” కార్యక్రమం ద్వారా భారత దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందాడు. రాష్ట్రంలోని అన్నివర్గాల వారికి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందేవిధంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగాలని ఆశిద్దాం.