Table of Contents
Ysr Pelli Kanuka Details In Telugu 2020
ఆడపిల్లల పెళ్లిళ్లు ప్రస్తుత రోజుల్లో చాలా ఇబ్బంది గా మారడం సహజం. తల్లిదండ్రులకు ఈ ఇబ్బందుల నుండి కాపాడుకోవడానికి ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కొత్త ప్రభుత్వం ఒక కొత్త పధకం ప్రారంభం చేశారు. అదే “YSR PELLI KANUKA SCHEME”. వైయస్ఆర్ పెళ్లి కానుక స్కీమ్ 2020 స్టేటస్, అర్హత (క్వాలిఫై) ఆన్‌లైన్‌లో వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని కులాల వధువులకు(పెళ్ళి కూతుర్లు) ఆర్థిక సహాయం అందించడానికి మరో ఉత్తమ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. (ఎపి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ ఉన్నవారు అవసరమైన సర్టిఫికేట్ ల(పత్రాలు)తో అప్లై చేసుకోవాలి. బ్యాంకు అకౌంట్ ముఖ్యం. A.P. పెళ్లి కానుక స్కీమ్ ను BC, SC, ST, శారీరకంగా వికలాంగులు, మరియు AP రాష్ట్రంలోని మైనారిటీల వధువులు అర్హులు.
ysr pelli kanuka eligibility
వీరికి సంవత్సరానికి రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు మాత్రమే అర్హులు. వైఎస్‌ఆర్ పెళ్లి కానుక పధకం కింద అర్హులైన అభ్యర్థులు కనీసం 10 రోజుల ముందుగా ( 10 రోజుల ముందుగా అనగా, పెళ్ళికి తేదీ కి 10 రోజుల ముందుగా, ఆఫీసు కి వెళ్ళి సబ్మిట్ చేయాలి )
సంబందిత ఆఫీసు కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయాలి. వారం రోజుల తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ ఫారం స్టేటస్ ను వెరిఫికేషన్ చేసుకోవాలి.
ఒకవేళ అప్లికేషన్ ఫారం రిజెక్ట్ ఐతే (తిరస్కరిస్తే), దానికి సంబంధించిన supported document మళ్ళీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కావున మొదటి సారి అప్లికేషన్ ఫారం టైమ్ లో అన్నీ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా సబ్మిట్ చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్టం లో ఉన్న పేద అమ్మాయిలకు పెళ్లి జరిగే సమయంలో వైఎస్‌ఆర్ పెళ్లి కానుక ద్వారా కొంత డబ్బుని గవర్నమెంట్ నుండి అందిస్తారు. పెళ్లి కానుక కు అమ్మాయి కుల రిజర్వేషన్ ప్రకారం నిర్ణయించబడుతుంది.
ysr pelli kanuka amount details in telugu
Category of Brides | Assistance Amount |
---|---|
Scheduled Caste (SCs) | Rs. 1 Lakh |
Scheduled Tribes (STs) | Rs. 1 Lakh |
SCs & STs Inter Caste Marriage | Rs. 1.25 Lakh |
Backward Classes (BCs) | Rs. 50,000 |
BCs Inter Caste Marriage | Rs. 75,000 |
Minorities | Rs. 1 Lakh |
Disabled | Rs. 1.5 Lakh |
Construction Labour Children | Rs. 1 Lakh |
Ysr Pelli Kanuka Amount Status
- 10 రోజుల ముందుగా అనగా పెళ్ళికి 5-10 రోజుల ముందుగా అప్లికేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి./
- కావలిసిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి.
- బ్యాంక్ అక్కౌంట్ అమ్మాయి పేరు మీదనే ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ కాదు.
- వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం ప్రతిదీ ఆన్‌లైన్లో మాత్రమే చేయాలి.
- మూడవ వ్యక్తి లేదా బ్రోకర్ అవసరం లేదు.
- ఈ స్కీమ్ అధికారులు మరియు లబ్ధిదారుడి మధ్య ప్రత్యక్ష సంభాషణ మాత్రమే.
- అర్హులైన అభ్యర్థులు పూర్తి అవసరమైన సర్టిఫికేట్/ ఫారాలు మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
వైయస్ఆర్ పెళ్లి కానుక అర్హతలు ( ysr pelli kanuka eligibility )
- ఆంధ్రప్రదేశ్ (A.P.) రాష్ట్రానికి చెందినవారు అయి ఉండాలి.
- ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు వధువుకు కనీసం 18 ఏళ్లు ఉండాలి.
- బీసీ / ఎస్సీ / ఎస్టీ రిజర్వేషన్లు ఎవరైనా కలిగి ఉండాలి.
- కుటుంబ ఆదాయాలన్నింటిలో వార్షిక ఆదాయం రెండు లక్షల కన్నా తక్కువ ఉండాలి.
వైయస్ఆర్ పెళ్లి కానుక సర్టిఫికేట్లు ( ysr pelli kanuka documents )
- వరుడు మరియు వధువు ఇద్దరికీ SSC సర్టిఫికేట్
- కుల ధృవీకరణ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డ్ (వరుడు మరియు వధువు ఇద్దరివీ)
- వరుడు మరియు వధువు ఇద్దరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ (ఆదాయ ధృవీకరణ పత్రం) వివాహ ఆహ్వాన కార్డు, పాస్పోర్ట్ సైజు వరుడు మరియు వధువు యొక్క ఫోటోకాపీ
- బ్యాంక్ పాస్ బుక్ స్కాన్ చేసిన కాపీ
- వైట్ రేషన్ కార్డ్ లేదా బిపిఎల్ కార్డ్
వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అర్హులైన అభ్యర్థులు A.P. అధికారిక వెబ్‌సైట్ ysrpk.ap.gov.in ని సందర్శించి, సంక్షేమ శాఖ ఇచ్చిన అన్ని సూచనలను చదవండి. సమీప మండల కార్యాలయం / మునిసిపాలిటీ కార్యాలయానికి వెళ్లి అవసరమైన వివరాలను అందచేయాలి.
కార్యాలయం నుండి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేసిన తరువాత, అభ్యర్థులు రిఫరెన్స్ నంబర్ పొందుతారు.
ముఖ్యమైన గమనిక: వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు ఎంటర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తరువాత, వైయస్ఆర్ పెళ్లి కానుక డబ్బు చెల్లింపు స్టేటస్ కోసం వధువు ఆధార్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించండి. వైయస్ఆర్ పెళ్లి కానుక అప్లికేషన్ కన్ఫామ్ చేయబడిన తర్వాత, వధువు బ్యాంక్ అకౌంట్ కు క్రెడిట్ జమ అవుతుంది, మరియు అదే సమయంలో అభ్యర్థులు పేమెంట్ యొక్క SMS ను పొందుతారు.
వైయస్ఆర్ పెళ్లి కానుక స్కీమ్ స్టేటస్ ( ysr pelli kanuka status in telugu)
వైయస్ఆర్ పెళ్లి కానుక అప్లికేషన్ ఫారం సబ్మిషన్ తర్వాత, రిజిస్ట్రేషన్ తేదీ 3-5 రోజుల తరువాత పెళ్లి కానుక అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేయండి. అభ్యర్థులు “మీ అప్లికేషన్ కన్ఫామ్ చేయబడింది – అంటే వైయస్ఆర్ పెళ్లి కానుక పేమెంట్ 7 రోజుల్లోపు బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది” అని చూపిస్తే, మీకు నిర్ధారణ లభిస్తుంది. “వైయస్ఆర్ పెళ్లి కానుక అప్లికేషన్ తిరస్కరించబడితే”, ఎందుకు దరఖాస్తు తిరస్కరించబడిందో చెక్ చేసి, అవసరమైన సర్టిఫికేట్ తో తిరిగి సబ్మిట్ చేయండి.
ysr pelli kanuka status check online
ysr pelli kanuka scheme customer care number
అభ్యర్థుల సూచన ప్రయోజనం కోసం ysr pelli kanuka toll free number అందుబాటులో లేదు. దీనిపై మేము మరింత సమాచారాన్ని అప్డేట్ చేస్తాము. వైయస్ఆర్ పెళ్లి కానుక అప్లికేషన్ ఎందుకు వెనక్కి రాబడిందో మనకు ముఖ్యమైన సమాచారం పోస్ట్ చేయబడును. అనేక తిరస్కరణలను ఇప్పటికే ఎదుర్కొంటున్న కారణాలు ఉన్నాయి.
ఈ క్రింది సూచనలను అనుసరించండి, మరియు తిరస్కరణలను(రిజెక్ట్) నివారించండి.(ysr pelli kanuka rules)
- వివాహ తేదీకి కనీసం 10 రోజుల ముందు అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి.
- అప్లై తేదీ నాటికి బ్యాంకు అకౌంట్ ఉండాలి.
- వధువు అకౌంట్ కాకుండా మరొకరి బ్యాంకు అకౌంట్ ను ఇవ్వవద్దు.
- సరైన మరియు ఖచ్చితమైన కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలి.
దీని గురించి కొన్ని ప్రశ్నలు- జవాబులు : ysr pelli kanuka faqs
- వైయస్ఆర్ పెళ్లి కానుక కోసం ఎలా ఎంట్రీ చేయాలి ? అప్లికేషన్ ను ఆన్‌లైన్‌లో మాత్రమే నింపండి.
- అప్లికేషన్ కోసం వివాహ కార్డు అవసరమా ? అవును, అభ్యర్థులు వివాహ స్కాన్ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.
- ఏదైనా వయస్సు లిమిట్ ఉందా ? అవును, అప్లికేషన్ ఫారమ్ తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
YSR పెళ్లి కానుక కు సంభందించిన పూర్తి వివరాల కోసం ఈ కింది pdf ను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లోనే చదువుకోండి.
Sir pelli koduku AP kakapithe ysr pelli kanuka vastundaa ledaa