• Home
  • Credit Cards
  • Finance
  • Loan Apps
  • Stock Market
  • Crypto
  • Insurance
Search
Telugu News Portal
  • Home
  • Credit Cards
  • Finance
  • Loan Apps
  • Stock Market
  • Crypto
  • Insurance
Home Government Schemes

సుకన్య సమృద్ది యోజన పథకం పూర్తి వివరాలు తెలుగులో

By
Rajeswari
-
September 16, 2023
0
Facebook
Twitter
Pinterest
WhatsApp
    sukanya yojana scheme in telugu 2023

    Table of Contents

    • Sukanya Samriddhi Yojana Scheme Details In Telugu 2023
      • సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు :
      • సుకన్య సమృద్ది యోజన పథకంలో  చేరాలంటే అర్హతలు:
        • సుకన్య సమృద్ది యోజన పథకంలో చేరాలంటే ఉండాల్సిన డాకుమెంట్స్:
        • సుకన్య సమృద్ది యోజన పథకం ఏ ఏ బ్యాంకులలో అందుబాటులో వుంది:
        • సుకన్య సమృద్ది యోజన పథకంలో ఎలా, ఎక్కడ చేరాలి?
        • సుకన్య సమృద్ది యోజన పథకంలో ఎంత డబ్బు కట్టాలి, వడ్డీ ఎంత వస్తుంది ?

    Sukanya Samriddhi Yojana Scheme Details In Telugu 2023

    సుకన్య సమృద్ది యోజన పథకం: ఫ్రెండ్స్ ఇటివల కాలంలో కేంద్ర ప్రభుత్వం చాలా రకాల నూతన పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి ఈ సుకన్య సమృద్ది యోజన పథకం.  ఇది ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం. ఈ పథకం ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సుకన్య సమృద్ది  యోజన పథకం గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే ఈ  పథకంలో ఎలా చేరాలి?, నెల నెల ఎంత మొత్తంలో డబ్బు కట్టాలి?, వడ్డీ ఎంత వస్తుంది?, అసలు ఈ పథకం ఏ ఏ బ్యాంకులలో అందుబాటులో వుంది? అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

    sukanya samriddhi yojana details in telugu

    సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు :

    ఫ్రెండ్స్ ఈ పథకంను నరేంద్ర మోదిగారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 22 వ తేది 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలకు ఆర్థిక భద్రతను కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని స్కీంలలో వచ్చే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీని ఈ పథకం అందిస్తుంది.

    ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ప్రయోజనం ఏంటి అంటే ఈ పథకంలో అకౌంట్  ప్రారంభించినప్పటి నుంచి పాపకి  21 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు డబ్బు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. ఒక వేళ పాపకి  18 ఏళ్లు వయస్సు వచ్చిన  తర్వాత అమ్మాయి వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు మాత్రమే  తీసుకునే అవకాశం ఉంటుంది.

    సుకన్య సమృద్ది యోజన పథకంలో  చేరాలంటే అర్హతలు:

    ఈ పతాకంలో చేరాలి అంటే మనం ముందుగానే పైన తెలిపినట్లు ఇది ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా పుట్టినప్పటి నుంచి పది ఏళ్ళ వయస్సు లోపల ఉన్నవారు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు.

    సుకన్య సమృద్ది యోజన పథకంలో చేరాలంటే ఉండాల్సిన డాకుమెంట్స్:

    ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలను ఈ పథకంలో చేర్చాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

    1. ఆధార్ కార్డ్ (తల్లితండ్రులవి, అమ్మాయి)
    2. అమ్మాయి ఫోటోలు
    3. బ్యాంకు పాస్ బుక్
    4. అమ్మాయి బర్త్ సర్టిఫికెట్
    5. పాన్ కార్డు.

    సుకన్య సమృద్ది యోజన పథకం ఏ ఏ బ్యాంకులలో అందుబాటులో వుంది:

    ఈ పథకం చాలా రకాల బ్యాంకులలో అందుబాటులో ఉంది అవి ఏ బ్యాంకులో క్రింద చూద్దాం.

    1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    2. ఆంధ్రా బ్యాంక్
    3. కెనరా బ్యాంక్
    4. బరోడా బ్యాంక్
    5. యునైటెడ్ బ్యాంక్
    6. ఐడిబిఐ బ్యాంక్
    7. ఇండియన్ బ్యాంక్
    8. పంజాబ్ నేషనల్ బ్యాంక్
    9. కార్పొరేషన్ బ్యాంక్
    10. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
    11. అలహాబాద్ బ్యాంక్
    12. అలహాబాద్ బ్యాంకు

    సుకన్య సమృద్ది యోజన పథకంలో ఎలా, ఎక్కడ చేరాలి?

    ఫ్రెండ్స్ ఈ పథకంలో చేరాలి అనుకునేవారు వారికీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు కు కానీ, పోస్ట్ ఆఫీస్ కి కానీ వెళితే సరిపోతుంది. మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళితే అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ సహాయంతో అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు గవర్నమెంట్ పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని మొదట డౌన్లోడ్ చేసుకోవాలి.

    దరఖాస్తులో అడిగిన వివరాలన్నింటినీ పూర్తిచేయాలి. అంటే డాక్యుమెంట్లు అకౌంటుదారురాలైన పాప ఫొటోలు, తల్లిదండ్రులు/గార్డియన్ ఫొటోలు ఉండాలి. ఆధార్​ కార్డు, బాలిక జనన ధృవపత్రం వీటన్నింటినీ జత చేసి దరఖాస్తు పత్రాన్ని పోస్టాఫీసులో అందజేయాలి. దరఖాస్తుతోపాటు చెక్, డ్రాఫ్ట్ లేదా క్యాష్ రూపంలో ప్రారంభ డబ్బు కట్టాలి. ఒకవేళ మీరు బ్యాంకు వెళ్ళిన కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది.

    సుకన్య సమృద్ది యోజన పథకంలో ఎంత డబ్బు కట్టాలి, వడ్డీ ఎంత వస్తుంది ?

    ఈ పథకంలో మనం ఒక సంవత్సరంలో 1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. కనీసం ఎంత కట్టాలి అనేది మన ఇష్టం . కాకపోతే మనం కనీసం ఒక సంవత్సరానికి 250 రూపాయలు కట్టాలి. ఉదాహరణకు మనం నెలకు 5000 రూ… డిపాజిట్ చేస్తే పాపకి 21 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి 25 లక్షలకు పైగా అమోంట్ వస్తుంది. దీన్ని బట్టి మనం నెల నెల ఎంత కట్టాలో ఒక అవగాహనకు రావచ్చు.

    ఇక వడ్డీ విషయానికి వస్తే ప్రస్తుతం 7.6 % వడ్డీ రేటు వస్తుంది. వడ్డీ రేటు అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు మారుతూ ఉంటుంది. ఎందుకంటె ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం  వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. అందువల్ల వడ్డీ రేట్లు పెరగవచ్చు. లేదంటే తగ్గొచ్చు. కొన్నిసార్లు  వడ్డీ రేట్లు నిలకడగా కూడా కొనసాగవచ్చు.

    Note: ఈ పథకంలో మనకి పన్ను మినహాయిపు కూడా ఉంది. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. కాబట్టి మనకి పన్ను సమస్య కూడా లేదు.

    గమనిక: ఫ్రెండ్స్ పైన తెలిపిన సమాచారం అనేది ఇంటర్ నెట్ ని ఆధారం చేసుకొని తెలిపాము. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె గవెర్నమెంట్ సైట్ ని ఒక్కసారి చూడండి.

    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleHow To Open Zerodha Account In Telugu
      Next articleJeevan Anand Plan Details In Telugu 2023
      Rajeswari
      Rajeswari

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Image Background Blur 2025

      PDF To Image Converter 2025

      Photo Resizer 2025

      Passport Size Photo Maker 2025

      Image Crop and Image Rotate 2025

      Background Remover 2025

      PDF To Word Converter 2025

      Image Compressor 2025

      Word To PDF Converter 2025

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY Cancel reply

      Log in to leave a comment

      Latest Posts

      • Image Background Blur 2025
      • PDF To Image Converter 2025
      • Photo Resizer 2025
      • Passport Size Photo Maker 2025
      • Image Crop and Image Rotate 2025
      • Background Remover 2025
      • PDF To Word Converter 2025
      • Image Compressor 2025
      • Word To PDF Converter 2025

      Archives

      TeluguNewsPortal.Com లో మీకు ఏ విషయాలు తెలుస్తాయి ?

      1. క్రెడిట్ కార్డులు, లోన్లు, బ్యాంకింగ్ అప్డేట్స్
      2. స్టాక్ మార్కెట్ & క్రిప్టో కరెన్సీ సమాచారం
      3. ఇన్సూరెన్స్ & ఫైనాన్స్ టిప్స్
      4. రోజు విజిట్ చేసి కొత్త విషయాలు తెలుసుకోండి.
      5. మీ ఆర్థిక భవిష్యత్తు కోసం విశ్వసనీయ సమాచారం.
      • Home
      • About Us
      • Contact Us
      • Disclaimer
      • Privacy Policy
      © All Rights reserved TeluguNewsPortal.com