అల వైకుంటపురం లో ఉన్న ఇంటి విశేషాలు చుస్తే షాక్ అవుతారు

0

ala vaikunta puram lo house owner

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన గొప్ప సినిమాలలో ఒకటి అల వైకుంఠపురం లో. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురం లో. ఈ సినిమాలో మెజారిటీ కథ ఒక ఇంట్లోనే జరుగుతుంది. ఆ ఇంటి పేరే వైకుంఠపురం. నిజజీవితంలో ఆ ఇల్లు ఎవరిదో తెలుసా ?

తెలుగులో ఓ పాపులర్ న్యూస్ ఛానల్ మరియ ఇతర చానల్స్ ను నడిపే ఓ మీడియా అధిపతి సొంత కూతురి ఇల్లే అది, అని ఫిలిం యూనిట్ సన్నిహిత వర్గాల విశ్వసనీయ సమాచారం. ఇంటి విలువ ఎంతో తెలిస్తే మనం ఆశ్చర్యపోకతప్పదు.
ఈ ఇంటి విలువ అక్షరాల 300 కోట్ల రూపాయలు. హైదరాబాదులో ఉండే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇది ఒక్కటి అని సమాచారం.

ఇంటిలోనే అల వైకుంఠ పురం లో చిత్ర సన్నివేశాలు షూటింగ్ చేయడం జరిగిందట. ఒకసారి ఇంటిని చూసి అల్లు అర్జున్ ఎప్పుడో ముచ్చటపడ్డారు అంట. తన లైఫ్ లో కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్ లో కూడా ఉన్నాడు అంట.
ఏదిఏమైనా అల వైకుంఠ పురం లో ఉన్న ఇల్లు ప్రేక్షకులను ముగ్ధులను చేసేస్తుంది. సినిమా కథలో ఈ ఇల్లు ఓ భాగంగా ఉండడం వల్ల ప్రేక్షకులు అంత పరిశీలనగా చూడకపోవచ్చు.

పరిశీలనగా చూస్తే మాత్రం ఆ ఇంటి అందం, ఆ ఇంటి రిచ్ నెస్ కు అభిమానులు ఫిదా అవక తప్పదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠ పురం లో చిత్రం తొలి రోజునే హిట్ టాక్ గా పేరు తెచ్చుకుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో బన్నీ లవ్ ఇంట్రెస్ట్ గా నటించడం ప్రత్యేకత. మురళి శర్మ సుశాంత్ ,సముద్రఖని ,నవదీప్ హర్షవర్ధన్ ,తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ వీరంతా ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.

ఇందులో సుశాంత్ ,నివేద కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ ,హారిక హాసిని క్రియేషన్స్ లో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహించాడు. కేవలం 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 47.85కోట్లు కలెక్షన్ సాధించింది.
అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ కలెక్షన్స్ 67 కోట్లపైగానే దాటిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్ ,స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ల హ్యాట్రిక్ చిత్రంగా నిలిచిపోవడం లో అనుమానం లేదు.