Income Tax department raids Kannada actress Rashmika Mandanna’s house
సరిలేరు నీకెవ్వరు ఫేమ్ రష్మిక మందాన ఇంట్లో ఐటీ దాడులు! ఎందుకంటే కారణాలు ఇవే!
హీరోయిన్ రష్మిక కు ఐటీ అధికారుల షాక్. కొడగు జిల్లా విరాజపేట లోని రష్మిక ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న రష్మిక. కర్ణాటకలో హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటి అధికారుల దాడులు జరుగుతున్నాయి. దాదాపు పది మందికి పైగా ఐటీ అధికారులు ముమ్మరంగా ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే ఐటి దాడులు విషయం తనకు తెలియదు అన్న రష్మిక. తమిళ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు చెన్నై వెళ్తున్న రష్మిక. అయితే ఐటి సోదాలు గురించి కన్ఫామ్ చేసిన రష్మిక పర్సనల్ మేనేజర్. అయితే ఐటి అధికారులు మాత్రం కొడగు జిల్లా విరాజపేట తాలూకాలోని రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఐటీ అధికారులు సోదాలు ఏ ఉద్దేశంతో జరుపుతున్నారు అనే విషయాలు ఇంకా వెలువడలేదు దీనిపై స్పష్టత రాలేదు.
ఐటీ అధికారులు సోదాలు సందర్భంలో రష్మిక అధికారులకు అందుబాటులో లేదనే విషయం తెలుస్తోంది. కేవలం 2016 సంవత్సరంలో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ లోకి చేరడం తో ఐటీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఈమె ఐటీ రిటర్న్స్ విషయంలో సరైన విధానం లేదు అని తెలుస్తోంది.
ముఖ్యమైన కారణం ఏంటంటే అనతికాలంలోనే అత్యధికంగా డబ్బులు సంపాదించడం. ఇక ఐటీ రిటర్నుల విషయంలో లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో అధికారులకు కొన్ని అనుమానాలు కలిగాయి. అయితే ఐటి అధికారులు మాత్రం కేవలం అసెస్మెంట్ మాత్రమే చేస్తున్నాము , ఇవి దాడులు కావు అని వారు పేర్కొంటున్నారు. గడిచిన మూడు సంవత్సరాల్లో ఆమె ప్రభుత్వానికి అందజేసిన ఐటి రిటర్న్స్ పైన మాత్రమే అసెస్మెంట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
రష్మిక కు రెమ్యూనరేషన్ రూపంలో ఎంత మాత్రం మొత్తం డబ్బులు అందాయి? అది కాక ఆమెకు వేరే రూపంలో డబ్బులు ఎలా వచ్చాయి ? తదితర విషయాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతున్నది. కేవలం రష్మిక స్వస్థలమైన కర్ణాటకలోని తన సొంత గ్రామంలో ఐటీ దాడులు జరుగుతున్నట్లు గానూ మరియు హైదరాబాదులో కూడా అయితే దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ రష్మిక కు హైదరాబాదులో ఎలాంటి ఇల్లు లేదు, హైదరాబాదులో ఐటి దాడులు జరుగుతున్నట్లుగా వాస్తవాలు ఏమి బయటపడలేదు. తన సొంత ఇంట్లో IT దాడుల సమయంలో ఆమె ఒక తమిళ సినిమా షూటింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం ఈమె ఐటి అధికారుల సోదాలు విషయంలో తన ఇంటికి వెళ్తుందా లేక తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొంటుందాఅనే విషయం ఇంకా బయటపడలేదు. కాకపోతే ఐటీ అధికారుల తనిఖీలు సందర్భంలో తాను అక్కడ ఉండాలని రూలేమీ లేదు ఒకవేళ అవసరం అయితే ఐటి అధికారులు వారి ఇంట్లో ఒక నోటీసు ఇచ్చి వెళ్తారు అని తెలుస్తోంది. అయితే అధికారులకు ఏవైనా సందేహాలు ఉంటే వాటి నివ్రృత్తి కోసం ఆమెకు ఒక నోటీసు ఇచ్చి వెళ్తారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఐటి అధికారులు అనుమానాలకు తగ్గట్లుగా అసెస్మెంట్ లో ఏవైనా లోపాలు , సవరణలు ఏవైనా ఉంటే, రష్మీ క ను కచ్చితంగా హాజరు కావాలని తెలియజేస్తారు. ఇక ఆమె ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆడిటర్ కూడా ఆమె ఇంటికి వెళ్తున్నట్లు గా సమాచారం. ఎందుకంటే ఆడిటర్ కైతే ఆమె ఆదాయ వ్యయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అతని దగ్గర ఉంటుంది అని తెలుస్తోంది.