Mahesh Babu vs Allu Arjun hits and flops list in telugu 2020

0

mahesh babu vs allu arjun

మహేష్ బాబు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా టాలీవుడ్ హీరోలే, ఇద్దరికీ కూడా ఫ్యాన్స్ లో బలే ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి సినిమాలకి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భలే డిమాండ్ ఉంది.  ఇద్దరు హీరోలు నటించిన ఏ సినిమాలు అయినా సరే భారీ కలెక్షన్లు సాధిస్తాయని సినీ వర్గాల భోగట్టా.

అంతే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఇద్దరికీ మంచి డిమాండ్ ఉంది. ఉదాహరణకు stylish star allu arjun కి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది , అదే విధంగా super star mahesh babu కి కర్ణాటకలో మంచి క్రేజ్ డిమాండ్ ఉంది.
1999 లో హీరో మహేష్ బాబు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ విధంగా తన సినీ కెరీర్లో  20  సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశాడు మహేష్ బాబు.  మహేష్ బాబు తన సినీ ప్రస్థానంలో మొత్తం 25 సినిమాలు పూర్తి చేశాడు.

అలాగే బన్నీ తన సినీ కెరీర్ ని  2003 వ సంవత్సరంలో ప్రారంభించారు.  బన్నీ తన కెరీర్లో 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని మొత్తం 18  సినిమాలు పూర్తి చేశాడు. మొత్తం గా వీరిద్దరూ కలిసి మహేష్ బాబు మొత్తం  25  సినిమాలు , బన్నీ 18 సినిమాలు పూర్తి చేశారు.

వీటిలో ఏ ఏసినిమాలు బ్లాక్ బస్టర్ ,హిట్ ,యావరేజ్ ఏవో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం.

Mahesh Babu Blockbuster Movies List :

  • సూపర్ స్టార్ హీరో కృష్ణ వారసుడిగా mahesh babu హీరోగా 1999 వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.  మహేష్ కి తొలి బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు. 2003 వ సంవత్సరంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన okkadu సినిమా తన కెరీర్ లోనే ఒక పెద్ద మలుపు తిరిగింది. గుణశేఖర్ కథ చార్మినార్ సెట్టింగ్ మహేష్ బాబు, భూమిక , ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలతో ఈ సినిమా మంచి గొప్ప విజయాన్ని సాధించింది.
  • మహేష్ బాబు కి ఒక్కడు సినిమా తర్వాత మరల ఇలాంటి బ్లాక్ బస్టర్ నిచ్చింది pokiri . 2006 సంవత్సరంలో వచ్చిన పోకిరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తన కెరీర్లో సినీ ఇండస్ట్రీ ని ఒక పెద్ద మలుపు తిప్పింది అనడంలో ఆశ్చర్యం లేదు. మహేష్ నటించిన ఈ పోకిరి చిత్రం 40 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
  • మహేష్ బాబు నుంచి వచ్చిన మరొక బ్లాక్ బస్టర్ మూవీ dookudu సినిమా 2011 లో వచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మహేష్ బాబు కు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది. దూకుడు మూవీ లో మహేష్ బాబు రెండు గెటప్పులు లో నటించడం జరిగింది దాదాపు 100 కోట్లు కలెక్షన్లు సాధించి టాలీవుడ్ లో ఒక గొప్ప రికార్డు సృష్టించింది.
  • కొరటాల శివ దర్శకత్వంలో  2011 లో వచ్చిన మరొక గొప్ప మూవీ గొప్ప బ్లాక్ బస్టర్ srimanthudu. మహేష్ బాబు నటించిన ఒక గొప్ప చిత్రం ఇది. ఈ సినిమా మహేష్ బాబు ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
  • 2011లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన bharat ane nenu ఒక గొప్ప మూవీ గా నిలిచిపోయింది.
  • 2019 లో వచ్చిన maharshi, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా అద్భుతంగా విజయం సాధించింది.

Allu Arjun Blockbuster Movies List :

అదేవిధంగా బన్నీ అల్లు అర్జున్ తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీస్ గమనిస్తే,

  • 2004వ సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన aarya, తన రెండవ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించుకున్నాడు. ఈ మూవీ అల్లు అర్జున్ కి తెలుగు సినీ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది.
  • 2007 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం desamuduru. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి పోయింది.  లవ్ అండ్ యాక్షన్ చిత్రంగా బన్నీకి గొప్ప పేరు తీసుకు వచ్చిన చిత్రం దేశముదురు.
  • తర్వాత 2012 సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన julayi సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
  • 2014లో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన race gurram బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చింది.
  • మాస్ దర్శకుడు బోయపాటి డైరెక్షన్ చేసినటువంటి చిత్రం sarrainodu. ఇదే బన్నీకి 2016లో బ్లాక్ బస్టర్ తీసుకువచ్చింది. ఇది బన్నీ కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Mahesh Babu vs Allu Arjun Hit Movies :

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మూవీస్ విషయానికి వస్తే 1999 లో విడుదలైన rajakumarudu , 2001లో వచ్చిన murari, 2005లో వచ్చిన అతడు 2006లో వచ్చిన పోకిరి, 2012లో వచ్చిన బిజినెస్ మాన్, 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వంటి చిత్రాలన్నీ మంచి విజయాలను అందుకుని మహేష్ బాబు హిట్స్ గా నిలిచాయి.

అలాగే అల్లు అర్జున్ హిట్ సినిమాలు చూస్తే 2003లో వచ్చిన గంగోత్రి, 2005లో వచ్చిన బన్నీ 2008లో వచ్చిన parugu, 2017 లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలన్నీ కూడా గొప్ప హిట్స్ గా నిలిచాయి.

ఇక మహేష్ బాబు యావరేజ్ సినిమాల విషయానికి వస్తే 2000 సంవత్సరంలో వచ్చిన యువరాజు, 2004లో వచ్చిన అర్జున్, 2014 లో వచ్చిన వన్-నేనొక్కడినే వంటి చిత్రాలన్నీ మహేష్ బాబు యావరేజ్ గా నిలిచాయి.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే 2009లో వచ్చిన ఆర్య టు 2010లో వచ్చిన వేదం 2017 లో వచ్చిన రుద్రమదేవి 2017 లోనే వచ్చిన దువ్వాడ జగన్నాథం ఈ చిత్రాలన్నీ బన్నీ కెరీర్లో యావరేజ్ గా నిలిచాయి.

Mahesh Babu vs Allu Arjun Flop Movies :

ఇక ఆఖరిగా మహేష్ బాబు బన్నీ నటించిన ఫ్లాప్ సినిమాలు చూస్తే,

మహేష్ బాబు నటించిన వంశీ 2000 సంవత్సరం లో వచ్చింది. 2002లో వచ్చిన టక్కరి దొంగ ,బాబి, 2003లో వచ్చిన నిజం 2004లో వచ్చిన నాని, 2006లో వచ్చిన సైనికుడు 2007లో వచ్చిన అతిథి 2010లో వచ్చిన కలేజా 2014 లో వచ్చిన ఆగడు, 2016 లో వచ్చిన బ్రహ్మోత్సవం 2017 లో వచ్చిన స్పైడర్ సినిమాలు మహేష్ బాబు కెరీర్లో ఫ్లాప్ నిచ్చాయి.

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా విషయాలకొస్తే,

2006లో వచ్చిన హ్యాపీ 2010లో వచ్చిన అవార్డు 2011లో వచ్చిన బద్రీనాథ్ 2013లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో
2018 లో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా అల్లు అర్జున్ కి ఫ్లాప్ నిచ్చాయి.

టోటల్గా మహేష్ 25 చిత్రాలు చేస్తే ఇందులో ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్స్ 5 hits 3 యావరేజ్ 11 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి .

అల్లు అర్జున్ చేసిన 18 చిత్రాలలో 5 బ్లాక్బస్టర్స్ 4 hits 4 యావరేజ్ ఐదు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.

NOTE : ఇదంతా అంతర్జాలంలో మాకు దొరికిన సమాచారం ప్రకారం ఇస్తున్న మాటర్. అంతే కానీ ఎవ్వరిని తక్కువ లేదా ఎక్కువ గ చెప్పడం లేదు. థాంక్స్.