Prabhas biography – తెలుగులో

0

Prabhas biography in telugu : ప్రభాస్ అనే పేరు తెలుగు సినిమా రంగంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభంజనం గా మారింది.ఒక ప్రాంతీయ హీరోగా మొదలు పెట్టి ఆ తర్వాత నేషనల్ హీరో స్థాయికి ఎదిగిన ప్రభాస్ గురించి తెలుసుకుందాం. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు సంతానమే ప్రభాస్.

1979 అక్టోబర్ 23న పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ప్రభాస్ కు అన్నయ్య ప్రభోద్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రభాస్ కి సినిమారంగ ప్రవేశం అతని పెదనాన్న గారైన సినీ నటుడు కృష్ణం రాజు గారి ద్వారా జరిగింది.కృష్ణంరాజు కున్న రెబల్ స్టార్ బిరుదును ఈ జనరేషన్లో ప్రభాస్ కు యంగ్ రెబల్ స్టార్ గా ఇచ్చారు.

ప్రభాస్ సినిమా ప్రవేశం :-

అశోక్ కుమార్ నిర్మాతగా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మొట్టమొదటి చిత్రం ఈశ్వర్. ఈ సినిమా 2002 నవంబర్ 11న రిలీజ్ చేశారు.ఇదే సినిమాలో సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి ని తొలిసారిగా హీరోయిన్గా పరిచయం చేశారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా ప్రభాస్ కు అంతగా మంచి పేరు రాలేదు. తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా ఫ్లాప్ అయింది.తర్వాత ఎమ్మెస్ రాజు నిర్మాతగా శోభన్ డైరెక్షన్ లో విడుదలైన వర్షం సినిమా కాసుల వర్షం కురిపించింది.

ఈ సినిమాలో ఆరడుగుల ఆజానుబాహుడైన ప్రభాస్ అదే స్థాయిలో విలనిజంలో గోపీచంద్ గట్టిపోటీ ఇవ్వడంతో ఈ సినిమా ప్రభాస్ కు మంచి పేరు తీసుకువచ్చింది. టాలీవుడ్ లో మంచి హీరో ఉన్నాడని తెలియచెప్పింది ఈ సినిమా. అదే సంవత్సరం వచ్చిన మరో సినిమా అడవిరాముడు ఆవరేజ్ హిట్ గా నిలిచింది. తర్వాత 2005 సెప్టెంబర్ 30 తేదీన బి.వి.ఎస్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా రికార్డుల మోత మోగించింది. 12 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. అంతే కాకుండా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సరసన చేర్చింది. ఈ సినిమాతో ప్రభాస్ కు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

తర్వాత ఎమ్మెస్ రాజు నిర్మాతగా, ప్రభుదేవా దర్శకత్వంలో 2006 ఏప్రిల్ 20వ తేదీన భారీ అంచనాలతో విడుదలైన పౌర్ణమి సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో 2007లో మళ్లీ భారీ అంచనాలతో నిర్మించిన యోగి సినిమా కూడా పరాజయం పాలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2007లో విడుదలైన మున్నా సినిమా కథ బాగున్నా మంచి పేరు తెచ్చుకో లేకపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2008లో విడుదలైన బుజ్జిగాడు సినిమా బాగానే ఉన్నా అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఈ సినిమాలో ప్రభాస్ రజనీకాంత్ కు అభిమానిగా ప్రత్యేక మేనరిజంతో నటించాడు. ఇందులో మరో నటుడు మోహన్ బాబు ముఖ్య పాత్రను పోషించాడు. 2009లో మెహర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా బిల్లా సినిమా విడుదలైంది. ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడు.

ఒక పెద్ద డాన్ గా మరియు చిల్లర దొంగ గా నటించి మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఈ సినిమాకు 14 కోట్లతో అంచనాలు మొదలుపెట్టి 20 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. దర్శకుడు మెహర్ రమేష్ కు ఇది తొలి సినిమా అయితే ఇది 24 కోట్ల వరకు కలెక్షన్ వసూలు చేసింది. నిర్మాత ఏ.ఎం రత్నం కు నష్టాలే వచ్చాయి. తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2009లో విడుదలైన ఏక్ నిరంజన్ సినిమాబాలీవుడ్ అగ్ర నటి కంగనా రనౌత్ తో కలిసి నటించినా కూడా కలిసి రాలేదు. సినిమా పరాజయం పాలైంది.

తర్వాత ఏప్రిల్ 10 2010 సంవత్సరంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమా తొలిసారిగా ఒక క్లాస్ రోల్ లో నటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ కు మంచి హిట్ ను ఇచ్చింది. 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కుటుంబ విలువల నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ నటన అందర్నీ ఆకర్షించింది.2012లో రాఘవ లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన రెబల్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఇందులో కృష్ణంరాజు ప్రభాస్ ఫోన్ నాన్న గా నటించాడు. రచయిత కొరటాల శివ దర్శకత్వంలో 2013 ఫిబ్రవరి 8న వచ్చిన మిర్చి సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఛత్రపతి తో చేసిన మాస్ క్యారెక్టర్ తర్వాత ఎన్ని 8 సంవత్సరాలకు మిర్చిలో చూపించాడు. ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులు సంబరపడిపోయారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఒక డైలాగ్ ఉన్నది వాడి కొడుకు వచ్చాడు, వాడి కొడుకు వచ్చాడని చెప్పండి అన్న డైలాగ్ ఇప్పటికే ప్రజల్లో ఉన్నది అంటే ఆ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో తెలుస్తున్నది.

prabhas bahubali :

ఇక ప్రభాస్ తన డేట్స్ అన్ని రాజమౌళి గారికి అప్పగించడం జరిగింది. సుదీర్ఘకాలంపాటు బాహుబలి సినిమాలో మునిగిపోయాడు. రాత్రి పగలు, ఎండ వాన, అనే తేడా లేకుండా అహర్నిశలు కష్ట పడి అనేక యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నాడు. ప్రభాస్ కి కొంచెం బద్ధకం ఎక్కువ అనే విషయాన్ని తనే స్వయంగా చెప్పాడు. కానీ రాజమౌళి మాత్రం బాహుబలి షూటింగ్ లో ప్రభాస్ ఇలాంటివన్నీ వదిలేస్తాడు అని చెప్పాడు. ఈ సినిమాకు 300 కోట్లు అంచనా పెట్టారు కానీ పార్ట్ వన్ తో కథ పూర్తి కాకపోవడంతో పార్ట్2 కూడా తీయడం జరిగింది 430 కోట్ల తో నిర్మించడం జరిగింది.

ఇందులో విలన్ గా రానా, రాజమాతగా రమ్యకృష్ణ, కట్టప్ప గా సత్యరాజు, దేవసేనగా అనుష్క, నాజర్, మరో ముఖ్య పాత్రగా తమన్నా నటించారు.
ఈ సినిమాలో బాహుబలి తర్వాత కట్టప్ప పాత్రకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు ప్రజల తో పాటు కన్నడ తమిళ హిందీ ప్రజలందరూ కూడాఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు అంటే ఇది ఎంత ప్రాముఖ్యం కలిగిన సినిమానో మనందరికీ తెలిసిందే.దక్షిణ భారతదేశంలోనే ఇంత పెద్ద బడ్జెట్తో నిర్మించిన మొట్టమొదటి సినిమా కావడంతో దీని ప్రత్యేకత.

అపజయం అంటే ఏమిటో తెలియని దర్శకుడు కావడం మరో ప్రత్యేకత. ప్రభాస్ నటించిన ఈ జానపద కథ ద్వారా దేశవ్యాప్తంగా హైప్ వచ్చింది. జులై 10 2017 న అందరూ ఎదురుచూస్తున్నట్లు గానే బాహుబలి పార్ట్ వన్ విడుదలైంది. మొదటిసారిగా 4 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. అప్పటివరకు ఐ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదలైన సినిమాగా రికార్డు ఉండేది. ఆది కార్డు ని బద్దలు కొట్టింది బాహుబలి ది బిగినింగ్. ఈ సినిమా 630 కోట్లతో భారతీయ చలన చిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు కెక్కింది. దీంతో ప్రభాస్ నేషనల్ హీరోగా మారాడు. అయితే ఈ సినిమాలో రాజమౌళి ప్రపంచంలో ఎక్కడ వాడుకలో లేని ఒక భాష ను పరిచయం చేశాడు.

కానీ ప్రేక్షకులు ఊహించినంతగా ఈ సినిమాలో ఏమీ లేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక్కడే దర్శకుడి తెలివితేటల గురించి చెప్పుకోవాలి. బాహుబలి ది బిగినింగ్ సినిమాలో రాజకుటుంబంలో అంత నమ్మకం గా ఉండే కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు జవాబు కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసింది. ఈ ఒక్క ప్రశ్నతో సెలబ్రిటీలు, బిజినెస్ మాన్ లు వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరి నోటా ఇదే ప్రశ్న. ఒక్క ఈ ప్రశ్న వల్లనే ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా పెరిగిపోయింది.పార్ట్-2 సినిమా కు ఇది ప్లస్ పాయింట్గా నిలిచింది.

సాక్షాత్తూ భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం కట్టప్ప పాత్రనే తన రాజకీయ ప్రచారంలో వాడుకున్నాడు అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రజలకు చేరింది అనేది అర్థం అవుతున్నది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 10, 2017 లో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు వాడుకలో లేని థియేటర్లు కూడా బూజు దులిపాయి. ఈ సినిమా ద్వారా ఇండియన్ సినిమా కెపాసిటీ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మొత్తం భారతీయ సినిమా వసూళ్లలో తొలి వెయ్యి కోట్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఒక ప్రాంతీయ సినిమా ఈ రేంజ్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. ఎప్పుడో కానీ థియేటర్కి వెళ్లని వారు కూడా ఈ సినిమా చూడడం జరిగింది. అనేక ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయడం వల్ల ఈ సినిమా 1950 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. పేర్లలోను, వసూళ్లలో ను, స్టార్ లోనూ వసూలు చేసింది. ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఒక్క రాత్రికే మారిపోలేదు. దాదాపు అయిదు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. వేరే ధ్యాస లేకుండా ఏ దృష్టి లేకుండా ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు.

దీని కోసం తనను తాను ఓర్చుకుని అన్ని మార్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. మనకు మాత్రం డార్లింగ్ లాగానే కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి ప్రభాస్ గురించి ఎన్నైనా చెప్పవచ్చు. తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ దర్శకుడు, మిత్రుడు అయిన సుజిత్ దర్శకత్వంలో తన 19వ సినిమాలో నటించాడు. ఎన్ని విజయాలు వచ్చినా పొంగిపోవడం, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోవడం ప్రభాస్ జీవితంలో లేదు. తెలుగు సినిమాకి, భారతీయ సినిమాకి కావాల్సిన వ్యక్తిగా నిలిచాడు.

prabhas marriage :

ఇక 40 సంవత్సరాల ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. తనకు నటి అనుష్కకు పెళ్ళని పుకార్లు చేసినా, మరో నటి త్రిష వాళ్ళ అమ్మ ద్వారా సంబంధం అడిగిందని ప్రచారం చేసినా దీనికి కూడా ప్రభాస్ సమాధానం చెప్పలేదు. మరి ఆయనకు తగ్గ యువరాణి ఎక్కడుందో,ఆ అదృష్టవంతురాలు ఎవరో దేవుడికి తప్ప బహుశా ప్రభాస్ కు కూడా తెలియదేమో. ప్రభాస్ హైట్ 6 అడుగుల రెండు అంగుళాలు. టాలీవుడ్ హీరోల్లో అందరికంటే హైట్ ఇతనిదే. రానా, గోపీచంద్, మంచు మనోజ్ ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్స్.

Prabhas family :

ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. ప్రభాస్ బీటెక్ కోసం శ్రీ చైతన్య కాలేజీ లో పూర్తి చేశాడు. ప్రభాస్ కు 2004లో వర్షం సినిమా గాను ఉత్తమ యువ నటునిగా సంతోషం సినిమా అవార్డు, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 2010లో డార్లింగ్ సినిమా కోసం ఉత్తమ నటునిగా సినీ మాఅవార్డు అందుకున్నాడు. ప్రభాస్ నాన్నగారు సినీ నిర్మాత అని ఎవరికీ తెలియదు. ఇతని తండ్రి గోపీకృష్ణ మూవీస్ అనే పేరుతో భక్త కన్నప్ప, తాండ్రపాపారాయుడు, మధుర స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, ధర్మాధికారి, అమరదీపం అనే ఆరు సినిమాలు నిర్మించాడు.

అయితే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారు విపరీతంగా తాగుతారు! ఇతనికి మొగల్తూర్ లో 1500 ఎకరాల పొలం ఉంది అందులోనే ఒక బార్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బార్ లో దొరకని ఫారెన్ మందు ఉండదట. ఇక పెదనాన్న కృష్ణం రాజు కి ముగ్గురు కూతుర్లు. మగ పిల్లలు లేకపోవడంతో ప్రభాస్ ను అల్లారుముద్దుగా పెంచారు. తన వారసత్వంగా సినిమా ప్రవేశాన్ని కల్పించారు. ప్రభాస్ మరెన్నో విజయాలు అందుకుని భారతీయ చలనచిత్ర రంగాన్ని ఉన్నతస్థాయికి తీసుకోవాలని ఆశిద్దాం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి.