తమిళంలో ఫుల్ బిజీగా ఉన్నామన హన్సిక. ప్రస్తుతం తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ చేస్తున్న ఆమె తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. హర్రర్ జానర్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే హన్సిక అలాంటి ప్రాజెక్ట్ ఒకదానికి సైన్ చేసిందట.
హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. వీరు గతంలో ‘అంబులి’ అనే తమిళ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని రంగనాథన్ నిర్మించనున్నాడు.
ఇందులో మన కథానాయకుడు శ్రీకాంత్ గారు నటించడం ఎంతో విశేషం ఈ చిత్రానిర్మాత అయిన రంగనాథ్ శ్రీకాంత్ కి కథ వివరించగా శ్రీకాంత్ గారికి ఎంతో నచ్చడంతో ఆయన నటించడానికి ఒప్పుకొన్నారు.
ఇకపోతే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటించడం మరో విశేషం.