Nothing కంపనీ కి బుద్ధి చెప్పిన మన తెలుగు YouTuber !

0
#dearnothing twitter trending news telugu

#dearnothing twitter trending | ట్విట్టర్ లో నథింగ్ కి ఎదురు దెబ్బ

#DearNothing నిన్నటి నుంచి ట్రెండ్ అవుతున్నటువంటి పదం. ట్విట్టర్ #DearNothing ట్వీట్లతో ట్విట్టర్ మొత్తం మార్మోగిపోయింది. మరి ఇంతలా ఈ ట్వీట్ ట్రెండింగ్ లో రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లండన్ బేస్డ్ కంపెనీ అయినటువంటి నథింగ్ ( nothing phone 1) నిన్న తన మొదటి ఫోన్ అయినటువంటి నథింగ్ ఫోన్ వన్ ఒక ఈవెంట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లో మన ఇండియాలో టెక్ వీడియోస్ చేస్తున్నటువంటి మంచి యూట్యూబర్స్ ని ఆహ్వానించారు.

అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఏంటంటే ఈ నథింగ్ ఫోన్ లాంచ్ ఈవెంట్ అయిన తర్వాత అన్ బాక్సింగ్ కోసం ఫోన్ ని యూట్యూబర్స్కి ఇవ్వడం పరిపాటి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నథింగ్ ఫోన్ వన్ కేవలం హిందీ యూట్యూబర్స్ కి మాత్రమే అందించారు.

సౌత్ ఇండియన్ Youtubers కి ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు. మన సౌత్ ఇండియన్ వాళ్లు అడిగిన ప్రశ్నకు జవాబుగా నథింగ్ ఫోన్ వారు స్టాక్ లేదు అని సింపుల్గా సమాధానం ఇచ్చారు. మీరు గమనిస్తే హిందీ లో ఉన్న ఒక పెద్ద Youtuber కో giveaway కోసం 5 nothing phone 1 లను ఇచ్చారు.

ఇది ఎంత వరకు న్ఈయాయమో మిరే చెప్పాలని మన తెలుగు youtuber అయిన ప్రసాద్ అడిగారు. సమస్య ఇక్కడ మాత్రమే మొదలు కాలేదు. ఇలా ప్రతి బ్రాండ్ కంపెనీ ఈవెంట్ కి పిలవడం, అన్ బాక్సింగ్ కోసం ఒక్క ఫోన్ కూడా ఇవ్వకపోవడం పరిపాటిగా మారింది.

దీన్ని చాలా అవమానంగా భావించిన మన సౌత్ ఇండియన్ యూట్యూబర్స్ ఎలాగైనా సరే వీరికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం తెలుగులో ( ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ) Prasad Tech in Telugu ), కన్నడలో Tech In Kannada, మలయాళంలో,Mr Perfect Tech, తమిళ్ లో Tamil Tech ఇలా అందరూ కలిసి హ్యాష్ ట్యాగ్ డియర్ నథింగ్ #DearNothing పేరుతో ఒక వీడియో చేశారు.


ఇది ఒక ప్రాంక్ లాగా నథింగ్ ఫోన్ మనకు ఇవ్వనట్టు వీడియో చేశారు. అలాగే వాళ్లకు జరిగినటువంటి అవమానాన్ని వారి subscribers తో షేర్ చేసుకున్నారు. ఇంకెప్పుడూ ఇలా జరగకుండా ఉండాలని ఉద్దేశంతో నథింగ్ ఫోన్ కి బుద్ధి చెప్పడానికి అందరూ ఇలా ప్రాంక్ వీడియోస్ చేశారు.

దాంతోపాటు ట్విట్టర్ అకౌంట్ లో వెళ్లి #DearNothing అని ట్వీట్ చేయాల్సిందిగా వాళ్ల వ్యూవర్స్ ని కోరారు. దీంతో ఒక్కసారిగా నిన్న సాయంకాలం నుండి ట్విట్టర్లో ఈ హాష్ ట్యాగ్ ( #dearnothing twitter trending ) మారి మోగిపోయింది.

మరి నథింగ్ కంపెనీ ఈ కాంట్రవర్సీకి ఇలా జవాబు చెబుతుందో వేచి చూడాల్సి ఉంది.