భద్రచలం మీద గోదావరి నది ఉగ్రరూపం !

0
godavari water level at bhadrachalam

Godavari water level at bhadrachalam :- గోదావరి నది చరిత్ర లో ఎన్నడు లేని విధంగా బద్రాచలం మీద తన నిజరూపం చూపిస్తుంది. వర్షాలు పడడం వలన గోదావరి నది నిండి పోయి బద్రాచలం లోకి నీరు అంత చేరింది. ఇళ్ళలోకి, దేవాలయలలోకి, షాప్స్ లోకి ఇలా అన్ని చోట్లకి నీరు చేరింది.

ఇంటిలోకి నీరు చేరడం వలన ప్రజలులందరు చాల ఇబ్బందులు పడుతున్నారు, వారికి తినేకి తిండి లేక పడుకొనేకి స్థలం లేక నాన కష్టాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఈ వాన ఎన్నడు లేనివిధంగా రాముని గుడిలోకి కూడా నీరు చేరడం జరిగింది.

ఈ నీరు రావడం వలన ప్రజలందరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, వరద నీటిలో కొంత మంది కొట్టుకొని వెళ్ళినారు, అలాగే పశువులు కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకొని పాయినాయి, ఈ నీరు దిగువ ప్రాంతం లోకి నీరు చేరడంవలన అక్కడ ఉన్న ప్రజలు కష్టాలు పడుతున్నారు. పగలు అనక రాత్రి అనక నీటిలోనే వారు జీవిస్తున్నారు.

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ప్రవాహంతో గ్రామాలు మరియు పట్టణాలను ముంచేస్తోంది. భద్రాచలం వద్ద 60 అడుగులను దాటి ప్రమాదకరంగా మారినది. మరి కొన్ని కాలనీలు కూడా నీట మునిగాయి.

ప్రమాదం ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు వారిని ఒడ్డుకు చేరుస్తున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో వరద రావడంతో మరో రెండు నెలలు పరిస్థితులు ఎలా ఉంటది అనేది తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెదుతున్నారు.

ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61.5 అడుగులకు చేరింది. మరో వైపు భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది.దానితో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి, సుభాష్‌నగర్‌, రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలను వరదతో ముంచెత్తింది.

మరి కొన్ని కొద్ది గంటలలో  భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 66 అడుగులు ఉంది. రాత్రికి 70 అడుగులకు చేరే అవకాశం ఉందని తెలిపారు.

లక్ష్మీ బ్యారేజ్‌ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35 లక్షల క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. అధికారులు ప్రజలును ఎప్పటికి అప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.