ఆప్ పరిచయం
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చాను. అదేంటంటే మనం వాట్సాప్ లో మెసేజెస్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మెసేజ్ చేసినట్లయితే, అది చదివి రిప్లై ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు ఈ యాప్ ని ఉపయోగించి చాలా ఈజీగా ఇంగ్లీష్ లో మెసేజెస్ చదవచ్చు.
అలాగే మీరు కూడా ఇంగ్లీషులో రిప్లై ఇవ్వవచ్చు.ఈ విధంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటే క్రిందన అప్లికేషన్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
ప్రయాణాలు చేస్తున్నారు కానీ స్థానికుల భాష రాదా? స్నేహితులను సంపాదించుకోవాలనుకుంటున్నారా కమ్యూనికేట్ చేయలేకపోతున్నామని చింతిస్తున్నారా? విగ్రహం పోస్ట్ యొక్క అసలు పాఠం అర్థం కాలేదా? పరాయి భాషల్లోని నవలలు చదవాలనుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారా?
హాయ్ ట్రాన్స్ లేట్ తో ఇకపై అంతా సమస్య కాదు.
హాయ్ ట్రాన్స్ లేట్ ఏ దేశంలోనైనా ఏ భాషకు చెందిన వారితోనైనా అడ్డంకులు లేకుండా కమ్యూనికేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది, ఇది మీరు నిజంగా అనర్గళంగా మాట్లాడటానికి అనుమతిస్తుంది.


యాప్ పని చేయు విధానం
- ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది,కచ్చితంగా వాటిని అలో చేయండి.
- అప్లికేషన్లో పైన లాంగ్వేజ్ ఎంచుకోవడానికి రెండు బాక్సులు ఉంటాయి. అందులో మీరు ఏ భాష ఎంచుకోవాలో డిసైడ్ చేసుకోండి .
- తరువాత క్విక్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కనబడుతుంది దానిమీద టాప్ చేయగానే మన ఫోన్ కార్నర్ లో ఒక బటన్ మాదిరి కనబడుతుంది.
- దాని ద్వారా మనకు కావలసిన మెసేజ్ పై డ్రాగ్ చేసినట్లయితే ఆ మెసేజ్ మనకు కావాల్సిన భాషలోకి ట్రాన్స్లేట్ అవడం జరుగుతుంది. అలాగే మనం కూడా అదే భాషలో మెసేజ్ కు రిప్లై ఇవ్వవచ్చు .ఈ విధంగా ఈ యాప్ ని యూస్ చేసి సింపుల్ గా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు.
- మీరు అనువదించడానికి మరియు నేర్చుకోవడానికి 135 భాషలు:
✔️ ఇంగ్లీష్
✔️ ఫ్రెంచ్
✔️ హిందీ
✔️ స్పానిష్
✔️ పోర్చుగీసు
✔️ రష్యన్
✔️ జర్మన్
✔️కొరియన్
✔️జపనీస్
✔️ అరబిక్
✔️ థాయ్
✔️ టర్కిష్
✔️ బెంగాలీ
✔️ ఉర్దూ
✔️ పర్షియన్
✔️వియత్నమీస్
✔️ బర్మీస్
మీరు అన్వేషించడానికి మరిన్ని భాషలు వేచి ఉన్నాయి!