Table of Contents
10 నిమిషాల్లో చేవినోప్పిని పోగెట్టే వంటింటి చిట్కాలు
Ear Pain: ఫ్రెండ్స్ చలికాలంలో అయిన లేకపోతే వాతావరణం కొద్దిగా చల్లబడిన మనకు ఇబ్బంది పెట్టే సమస్యలలో చెవి నొప్పి ఒకటి.పిల్లలలో అయిన పెద్దలలో అయినా అప్పుడప్పుడు చెవి నొప్పి రావడం సర్వసాధారణమైన విషయమే. కానీ ఆ నొప్పి తీవ్రత అనేది మనం ఇతరులకి చెప్పుకోలేని విధంగా ఉంటుంది.
ఈ చెవి నొప్పి అనేది వివిధ రకాలుగా వస్తుంది. కొంతమందికి సైనస్ ఉంటుంది దీనివల్ల కూడా ఈ నొప్పి వస్తుంది. ఇంకొంతమందికి చల్లగాలికి వెళ్లిన, నీరు చెవిలోకి వెళ్లిన లేదా చీమలు వెళ్లిన చెవి నొప్పులు వస్తాయి. ఈ నొప్పి నాకు తెలిసి చాలామందికి అర్థరాత్రిలలో ఎక్కువగా వస్తుంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటాం. మనం మన వంట ఇంటిలోని కొన్నింటిని యూస్ చేసుకొని ఈ చెవి నొప్పిని తగ్గించుకోవచ్చు.అవి ఏంటి ఎలా యూస్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ ఆర్టికల్ లో క్లియర్ గా వివరంగా తెలుసుకుందాం.
Ear Tips For Telugu
ఈ క్రింద మనం చెవి నొప్పి ని తగ్గించే చిట్కాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1.గోరు వెచ్చని నూనె:
మన ఇంట్లో ఉండే ఆముదం నూనెని తీసుకొని కొద్దిగా వేడిచేసి చల్లారిన తర్వాత ఒకటి లేదా రెండు చుక్కలను చెవిలో వేసుకోవాలి. ఇలా చేయడం వలన చెవి నొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
2.తులసి ఆకులు:
ఫ్రెండ్స్ మన అందరి ఇళ్ళలో తులసి ఆకులు ఉంటాయి.ఈ ఆకుల రసాన్ని చెవిలో రెండు లేదా మూడు చుక్కలు వేయడం వల్ల చెవి నొప్పి తగ్గే అవకాశం ఉంది. వీటిలో రోగ నిరోధక శక్తి తగ్గించే గుణాలతో పాటు యాంటీ ఇన్ ఫ్లామేషన్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి చెవి పోటు తొందరగా తగ్గుతుంది.
3.వెచ్చదనం కలిగించడం(కాపడం):
ముఖ్యంగా చిన్న పిల్లలుకు చెవిపోటు వచ్చినప్పుడు గోరువెచ్చని వేడినీటిలో డిప్ చేసిన టవల్ తో నొప్పి ఉన్న చెవి దగ్గర కాపడం పెట్టాలి. ఇలా 10 నిమిషాలు చేస్తే నొప్పి నుంచి వెంటనే ఉపసమనం కలుగుతుంది. దీనిని కూడా మనం ఒక బెస్ట్ టిప్ గా చెప్పుకోవచ్చు.
4.వెల్లుల్లి:
ఫ్రెండ్స్ చెవి పోటు వచ్చిన వారిలో కొంత మందికి బయట వాపు కనిపిస్తుంది. అలాంటప్పుడు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి దాన్ని చిన్న వస్త్రంలో కట్టి వాపు ఉన్న చోట ఒత్తుతూ ఉండాలి. ఇలా చేస్తే వాపు అదుపులోకి వస్తుంది.తద్వరా నొప్పి నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది.
5. లావెండర్ ఆయిల్:
చెవి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లావెండర్ ఆయిల్ ని తీసుకుని నొప్పి ఉన్నచోట అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు చెవిపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు.
6.ఉప్పు పొడి ప్యాక్:
ఫ్రెండ్స్ ఉప్పును కొద్దిగా వేడి చేసి సాఫ్ట్ క్లాత్ లో చుట్టి చెవి పైభాగాన 10 నుంచి 15 నిమిషాలు కాపడం వలన చెవి నొప్పి నుంచి తక్షణం ఉపశమనం కలుగుతుంది.
7.వెచ్చని ఆవిరిని తీసుకోవడం:
ఫ్రెండ్స్ మనలో కొద్దిమందికి జలుబు ఎక్కువ అవ్వడం వలన కూడా చెవి నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు ఒక పెద్ద బౌల్ లో వేడి నీటిని తీసుకొని ఒక టవల్ తీసుకొని ఆవిరి బయట వెళ్ళకుండా ఆవిరిని పట్టుకోవాలి ఇలా చేయడం వలన గొంతు ముక్కు మరియు చెవి మధ్యలో ఉన్న ఎయిర్ ట్యూబ్ లలో ప్రెజర్ ని తగ్గించుకోవచ్చు. తద్వారా ఐదు నిమిషాల్లో మనం చెవినొప్పి నుంచి ఉపవాసం పొందవచ్చు.
8.లవంగాలు:
లవంగాలలో కూడా చెవి నొప్పిని అదుపు చేసే గుణాలు ఉంటాయి. లవంగాల నూనె రెండు చుక్కలు చెవిలో చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ లవంగాల నూనె మనకి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెలో రెండు లవంగాలును మరిగించాలి. దీన్ని చల్లార్చి, వడ కట్టి రెండు చుక్కలు చెవిలో వేయాలి. వెంటనే నొప్పి తగ్గుతుంది.
9.అల్లం:
ఫ్రెండ్స్ కొందరిలో చెవి చుట్టూ వాపు వచ్చి నొప్పి వేస్తుంటుంది.అలాంటప్పుడు కొద్దిగా కాటన్ ని తీసుకొని అల్లం రసంలో ముంచి వాపు ఉన్న చోట మర్దనా చేయాలి. ఇలా ఒక 10 నిముషాలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.
గమనిక:ఫ్రెండ్స్ పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకుని తెలిపాము వీటిని వాడటం వలన చెవి నొప్పి తగ్గవచ్చు తగ్గకపోవచ్చు కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది.