Side Effects Of Antibiotics In Telugu 2023

0
side effects of antibiotics in telugu 2023

యాంటీబయోటిక్స్ వాడటం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ 2023

యాంటిబయోటిక్స్ : మనలో చాలా మంది ఈ యాంటిబయోటిక్స్ ని వాడుతుంటారు. చిన్న  తలనొప్పి వచ్చిన మనం యాంటిబయోటిక్స్ ని వాడతాం.యాంటిబయోటిక్స్ ని వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తాయిలే అని అనుకుంటే మనం మోసపోయినట్లే. ఎందుకంటే మన ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాడె ఈ యాంటిబయోటిక్స్ ఒకోసారి మన ప్రాణాలనే తిసేస్థాయి అని డాక్టర్స్ చెబుతున్నారు.

వాతావరణంలో మార్పుల కారణంగా మనకు దగ్గు,జలుబు వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. ఈ సమస్యలతో మనం డాక్టర్ ని సంప్రదిస్తే డాక్టర్ వెంటనే సూచించేది యాంటీ బయోటిక్స్. కొంతమంది అయితే  డాక్టర్ సలహా తీసుకోకుండా సొంతంగా యాంటీ బయోటిక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఇవి ఎక్కువగా వాడటం వలన మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంతకి ఈ యాంటిబయోటిక్స్ ని వాడటం వలన ఏ ఏ దుష్ప్రభావాలు కలుగుతాయో క్రింద వివరంగా తెలుసుకుందాం.

antibiotics side effects in telugu 2023

యాంటీబయోటిక్స్ వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు 

ఫ్రెండ్స్ ఈ యాంటిబయోటిక్స్ ని  అధిక మొత్తంలో వాడటం వలన మనకి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయి. అవి ఏంటో వివరంగా క్రింద తెలుసుకుందాం.

  1. చిన్న చిన్న జబ్బులకు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన మంచి బ్యాక్టీరియా తగ్గుతుంది. ఇది విరేచనాలు, కడుపు నొప్పి, వికారంకు దారితీస్తుంది.
  2. ఎమినొగ్లైకోసైడ్స్ వంటి యాంటీ బయాటిక్స్ కిడ్నీలకు మంచిది కాదు. ఇలాంటి యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల  కిడ్నీల పనితీరు ఆగిపోయే ప్రమాదం ఉంది.
  3. వాంతులు, తల తిరగడం వంటివి సంభవించవచ్చు.
  4. అతిసారం, కడుపు నొప్పి, అలెర్జీ  వంటి ప్రతిచర్యలు కూడా  సంభవించవచ్చు.
  5. యాంటీ బయాటిక్స్ ని ఏదైనా ఇన్ఫెక్షన్ నివారించడానికి తీసుకోవడం వల్ల  అవి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్ కి కారణమవుతాయి.
  6. వీటిని ఎక్కువ వాడటం వలన నోటిపుండు సమస్య కూడా వస్తుంది.
  7. కొన్ని రకాల డ్రగ్స్ సల్పా టెట్రాసైక్లిన్ అనే యాంటీ బయాటిక్ స్కిన్ ఎలర్జీకి కారణమవుతాయి. వీటివల్ల దురద, పొక్కులు చర్మంపై ఏర్పడతాయి. చాలా అరుదుగా స్టివెన్స్, జాన్ సన్ సిండ్రోమ్ కి దారితీస్తాయి. దీనివల్ల చర్మంపై తీవ్రమైన వాపు, మంట వస్తాయి.
  8. నరాల సమస్యలు కూడా వస్తాయి.
  9. యాంటి బయాటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొకటి వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్. టెట్రాసైక్లిన్, క్లిండమిసిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఈస్ట్ గ్రోత్ ని పెంచి.వాజినల్ ప్రాంతంలో తక్కువ ఎసిడిక్ ఉండటానికి కారణమై ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

    యాంటీబయోటిక్స్ ని ఎవరు వాడకూడదు:

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యాంటి బయాటిక్స్ని ఎవరెవరు వాడకూడదో క్రింద తెలుసుకుందాం.

  1. కిడ్ని సమస్యలతో బాధపడుతున్నవారు యాంటిబయోటిక్స్ కు దూరంగా ఉండాలి.
  2. అలాగే చిన్న పిల్లలకు వీటిని ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే డాక్టర్ని సంప్రదించి ఇవ్వాలి.
  3. గుండె సమస్యలు ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి.
  4. కొంతమందికి అలర్జీ ఉంటుంది. వారు కూడా ఈ యాంటిబయోటిక్స్ కి దూరంగా ఉండాలి.
  5. వృద్దులకు ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు.

గమనిక : పైన  తెలిపిన సమాచారం ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఇందులో ఏవైనా సందేహాలు ఉంటె వెంటనే మీ ఫ్యామిలి డాక్టర్ ని సంప్రదించండి.