Table of Contents
hp gas subsidy check status online 2020 :-
సాధారణంగా PAHAL (DBTL) SCHEME అన్ని రకాల LPG సిలిండర్ల సబ్సిడీని నేరుగా కస్టమర్ ఎక్కడ ఆధార్ లింక్ చేసినాడో ఆ బ్యాంకు ఖాతాలకు అందజేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది. మామూలుగా hp gas subsidy online అనేది ఒక సంవత్సరానికి 12 సిలిండర్లకు ఈ రాయితీ లభిస్తుంది. ఆధార్ కార్డులు లేని కస్టమర్లకు కూడా ఈ రాయితీని పొందడానికి ఈ పథకంలో కొన్ని మార్పులు చేయబడినవి.
అయితే ఎవరికైనా సంవత్సరానికి పది లక్షల ఆదాయం ఉన్న వారు ఈ గ్యాస్ సబ్సిడీ పొందడానికి అర్హులు కారు.“పొగలేని వంట” అనే నినాదంతో భారీ ప్రచారంతో గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. మహిళలు వంట కోసం కట్టెలు ఉపయోగించడం వల్ల కలిగే కష్టనష్టాల గురించి బాగా అవగాహన కల్పించడం వల్ల ఎక్కువ మంది గ్రామీణ మహిళలు కూడా ప్రస్తుతం వంట కోసం ఎల్పిజి గ్యాస్ వినియోగిస్తున్నారు.
ఇందుకోసమే ప్రతి సిలిండర్కు కొద్ది మొత్తం డబ్బులను కేంద్ర ప్రభుత్వం రాయితీ గా ఇస్తుంది. అయితే దేశ వ్యాప్తంగా LPG gas వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో రాయితీ ఇస్తున్న శాతం కూడా పెరిగిపోతున్నది. ఇందుకోసం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావాలంటే సబ్సిడీలు తగ్గించాలి అందుకే భారత దేశ ప్రజలు గ్యాస్ సబ్సిడీ వద్దు అనుకునే వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రచారం చేశాడు.
దీనికి ప్రతిస్పందించిన ప్రజలు దాదాపు 10.5 మిలియన్ల కుటుంబాలు తమ యొక్క lpg gas subsidy ని స్వచ్ఛందంగా క్యాన్సిల్ చేసుకున్నారు అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కేవలం పేద ప్రజలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఈ సబ్సిడీ తప్పక ఉంటుందని ప్రభుత్వం తెలియజేసింది.
1.LPG GAS SUBSIDY ఎలా పొందాలి?
కేంద్ర ప్రభుత్వం PAHAL (DBTL) అనే పథకం ద్వారా గ్యాస్ వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా సబ్సిడీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో కి ట్రాన్స్ఫర్ చేయడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆధార్ కార్డు ద్వారా రెండు ఆధార్ కార్డు లేకుండా.
2. ఆధార్ కార్డు ద్వారా hp gas subsidy డబ్బులు ఎలా పొందాలి?
ఇందుకోసం సబ్సిడీ గ్యాస్ తీసుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తి అతని యొక్క ఆధార్ కార్డు నెంబర్ ను గ్యాస్ కంపెనీ యొక్క కార్యాలయంలో ఎంటర్ చేయాలి. అయితే ఈ ఆధార్ కార్డు నెంబరు బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడి ఉండాలి.
3. ఆధార్ కార్డు లేనివారు ఎల్పీజీ సబ్సిడీ డబ్బులు ఎలా పొందాలి?
ఆధార్ కార్డు లేని వారు రెండు వేరు వేరు వివరాలను ఎల్పిజి డీలర్ కు అందజేసి గ్యాస్ రాయితీ డబ్బులు పొందవచ్చు.
ఆధార్ కార్డు లేని వ్యక్తి అతని పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మరియు ఆ బ్యాంకు యొక్క IFSC కోడ్ వంటి పూర్తి సమాచారాన్ని ఎల్పిజి డీలర్ కు అందజేయాలి.
hp gas subsidy status check :
మీరు గనుక మొదటిసారి మీ hp gas subsidy ని online లో check చేయాలి అనుకుంటుంటే, మొదట మీరు రిజిస్ట్రేషన్ ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూడడం. ఇక్కడ ముఖ్యంగా మీ గ్యాస్ కనెక్షన్ తీస్కునే టైం లో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఖచ్చితంగా తెలిసిఉండాలి. అప్పుడే ఇదంతా చేయగలం.
ముందుగా :
మీరు My Lpg సైట్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీ గ్యాస్ కనెక్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
- ఇక్కడ నేను శాంపిల్ కోసం HP Gas సిలిండర్ ను సెలెక్ట్ చేశాను. ఏ కనెక్షన్ అయిన కూడా ఇదే విధంగా ఫాలో అవ్వాలి.
- ఇక్కడ టాప్ లో New User ఆప్షన్ ను క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ డీటెయిల్స్ ఫుల్ గ ఇవ్వండి, అంటే 17 Digit LPG ID ద్వార రిజిస్టర్ అవ్వొచ్చు. లేదా స్టేట్, డిస్ట్రిబ్యూటర్, కన్స్యూమర్ నెంబర్ ఇచ్చి చివర్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి.
- ఇక్కడ మీ నెంబర్ కు ఒక OTP వస్తుంది. దాని ఎంటర్ చేసి submit చేయండి.
- ఇప్పుడు మీ email id, password ని సెట్ చేయమని అడుగుతుంది.
- నెక్స్ట్ మీ ఇమెయిల్ కు ఒక activation లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ప్రాసెస్ పూర్తి చేయండి.
Hp Gas సైట్ లోకి login అవ్వండిలా :
- ఇప్పుడు మల్లి myLpg సైట్ కి వచ్చి Sign In పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ ఫోన్ నెంబర్ లేదా ఇమెయిల్ id ఇచ్చి captcha ఫిల్ చేసి Login అవ్వండి.
- next పాస్వర్డ్ అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. ఇప్పుడు మీరు లాగిన్ అవుతారు.
- ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్ గ కనపడతాయి. అందులో మీ ఆదార్ సీడింగ్ అయ్యిందో లేదో కూడా చూడొచ్చు.
- నెక్స్ట్ ఇక్కడ Track Your Refill ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
- ఇప్పుడు మీ Hp gas కి సంభందించిన అన్ని వివరాలు తెలుస్తాయి,అంటే మీరు గ్యాస్ ని ఎప్పుడు బుక్ చేశారు, ఎప్పుడు డెలివరీ అయ్యింది, ఎంత అమౌంట్ కట్టారు ఇలాంటివి.
- చివర్లో hp gs Subsidy Amount, Payment Status ఇలా కనిపిస్తాయి. అందులో మీ బ్యాంకు కు ట్రాన్స్ఫర్ అయ్యయో లేదో చెక్ చేసుకోవచ్చు.
Ujvala update